Andhra Pradesh

News May 31, 2024

దోర్నాల: టిప్పర్‌ను ఢీ కొట్టిన బైకు.. వ్యక్తి స్పాట్‌డెడ్

image

దోర్నాల మండలం యడవల్లి గ్రామ సమీపంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. వెంకటేశ్వర నాయుడు బైకుపై వెళ్తున్న నేపథ్యంలో వాహనం అదుపుతప్పి టిప్పర్‌ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణాలు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 31, 2024

చిత్తూరు: ఆత్మ సేవలు లేక ఇబ్బందులు

image

చిత్తూరు జిల్లాలోని రైతులకు వ్యవసాయ రంగంలో సమగ్ర అభివృద్ధి సాధించాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆత్మ పథకాన్ని తీసుకు వచ్చింది. ఆత్మ సహకారంతో గ్రామస్థాయిలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేవారు. రైతులను విజ్ఞాన యాత్రకు తీసుకువెళ్లి వ్యవసాయ రంగంలో నూతన అంశాలను వివరించే వారు. ప్రస్తుతతం ఆత్మ సేవలు లేకపోవడంతో రైతులు చెందుతున్నారు. ఆ సేవలు కొనసాగించాలని రైతులు కోరుతున్నారు.

News May 31, 2024

ఏపీ ఈసెట్ ఫలితాల్లో మెరిసిన శ్రీకాకుళం విద్యార్థిని

image

ఏపీ ఈసెట్ ఫలితాల్లో అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆమదాలవలస మండలం శ్రీహరిపురానికి చెందిన కూన జ్యోత్స్న 8వ ర్యాంకు (బ్రాంచ్ ర్యాంక్), ఇంటిగ్రేటెడ్ ర్యాంక్-826 సొంతం చేసుకుంది. ఈ విద్యార్థిని 200 మార్కులకు గాను 105 మార్కులు సాధించింది. 10వ తరగతి శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదవగా.. డిప్లొమా అనకాపల్లిలో పూర్తి చేసింది. మంచి ర్యాంక్ రావడంతో ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

News May 31, 2024

SKLM: అభ్యర్థుల మార్పు YCPకి కలిసొచ్చేనా..?

image

2019లో శ్రీకాకుళం MP అభ్యర్థిగా YCP నుంచి బరిలో దిగిన దువ్వాడ శ్రీనివాస్ తాజా ఎన్నికల్లో టెక్కలి నుంచి అచ్చెన్నపై పోటీ చేస్తున్నారు. అటు టెక్కలిలో 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాడ తిలక్.. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. 2019లో పరాజయం పాలైన వీరిద్దరికి వైసీపీ అధిష్ఠానం మరలా టికెట్ ఇచ్చింది. స్థానాల మార్పు వైసీపీకి ఇక్కడ విజయం అందిస్తుందా..? దీనిపై మీ కామెంట్?

News May 31, 2024

పాలిసెట్ విద్యార్థులకు గమనిక

image

నెల్లూరు: ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చేసినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ రామ్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను జూన్ 6 వరకు.. ఆప్షన్లను పదో తేదీ వరకు.. ఆప్షన్ల మార్పు 11 వరకు.. సీట్ల కేటాయింపు 13న.. జాయినింగ్ రిపోర్టులను 14 నుంచి 19వ తేదీ వరకు అందజేయనున్నట్లు చెప్పారు.

News May 31, 2024

మంత్రాలయం ఎన్నికల రిటర్నింగ్ అధికారి బదిలీ

image

మంత్రాలయం -145 నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మురళిని బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన స్థానంలో చెల్లా విశ్వనాథను నియమించారు. మురళి ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, రికార్డులలో సక్రమంగా నమోదు చేయకపోవడం, సిబ్బందికి సరైన సూచనలు ఇవ్వడంలో విఫలమైనట్లు పేర్కొంటూ బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

News May 31, 2024

విశాఖ: రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి

image

ఉమ్మడి విశాఖ జిల్లా కొయ్యూరు మండలం చింతవానిపాలెం ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీతారాం గ్రామానికి చెందిన వెలమ రాంబాబు కుటుంబ సభ్యులతో బాలరేవుల బంధువుల ఇంటికి వచ్చి, శుక్రవారం ఉదయం బైక్‌పై తిరిగి పయనమయ్యారు. చింతవానిపాలెం ఘాట్‌లో బైక్ బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో బైక్ లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాంబాబు, అతడి కుమారుడు ప్రశాంత్ మృతి చెందారు. మృతుడి భార్య, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు.

News May 31, 2024

ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

image

నూజివీడులోని YSR హార్టికల్చర్ వర్సిటీలో రెండేళ్ల ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. SSC పాసైన విద్యార్థులు https://drysrhu.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో జూన్ 18లోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ పి. విజయలక్ష్మి చెప్పారు. మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి సీట్లు భర్తీ చేస్తామని ఆమె తెలిపారు.

News May 31, 2024

ఫస్ట్ పశ్చిమ ఫలితం.. చివరగా భీమిలి రిజల్ట్..!

image

విశాఖ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు 12 గంటల సమయం పట్టొచ్చని కలెక్టర్ మల్లికార్జున అంచనా వేశారు. విశాఖ పశ్చిమలో ఈవీఎం ఓట్ల లెక్కింపు మ.2 గంటలకు, పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల సాయంత్రం 4 గంటలకు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. తొలిత పశ్చిమ, తర్వాత విశాఖ దక్షిణ, చివరగా భీమిలి నియోజకవర్గ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గానికి 14 చొప్పున 98 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News May 31, 2024

చివరగా పలమనేరు ఫలితం..?

image

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పలమనేరులో 287 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ 21 రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారు. అత్యల్పంగా చిత్తూరులో 226, నగరిలో 229 పోలింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడి ఈవీఎంల లెక్కింపు 17 రౌండ్లలో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో చిత్తూరు లేదా నగరి ఎమ్మెల్యే ఎవరనేది ముందుగా తెలుస్తుంది. చివరగా పలమనేరు ఫలితం తేలే అవకాశం ఉంది. చిత్తూరు SVసెట్‌లో కౌంటింగ్ జరుగుతుంది.