Andhra Pradesh

News May 31, 2024

మంత్రాలయం ఎన్నికల రిటర్నింగ్ అధికారి బదిలీ

image

మంత్రాలయం -145 నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మురళిని బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన స్థానంలో చెల్లా విశ్వనాథను నియమించారు. మురళి ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, రికార్డులలో సక్రమంగా నమోదు చేయకపోవడం, సిబ్బందికి సరైన సూచనలు ఇవ్వడంలో విఫలమైనట్లు పేర్కొంటూ బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

News May 31, 2024

విశాఖ: రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి

image

ఉమ్మడి విశాఖ జిల్లా కొయ్యూరు మండలం చింతవానిపాలెం ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీతారాం గ్రామానికి చెందిన వెలమ రాంబాబు కుటుంబ సభ్యులతో బాలరేవుల బంధువుల ఇంటికి వచ్చి, శుక్రవారం ఉదయం బైక్‌పై తిరిగి పయనమయ్యారు. చింతవానిపాలెం ఘాట్‌లో బైక్ బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో బైక్ లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాంబాబు, అతడి కుమారుడు ప్రశాంత్ మృతి చెందారు. మృతుడి భార్య, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు.

News May 31, 2024

ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

image

నూజివీడులోని YSR హార్టికల్చర్ వర్సిటీలో రెండేళ్ల ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. SSC పాసైన విద్యార్థులు https://drysrhu.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో జూన్ 18లోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ పి. విజయలక్ష్మి చెప్పారు. మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి సీట్లు భర్తీ చేస్తామని ఆమె తెలిపారు.

News May 31, 2024

ఫస్ట్ పశ్చిమ ఫలితం.. చివరగా భీమిలి రిజల్ట్..!

image

విశాఖ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు 12 గంటల సమయం పట్టొచ్చని కలెక్టర్ మల్లికార్జున అంచనా వేశారు. విశాఖ పశ్చిమలో ఈవీఎం ఓట్ల లెక్కింపు మ.2 గంటలకు, పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల సాయంత్రం 4 గంటలకు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. తొలిత పశ్చిమ, తర్వాత విశాఖ దక్షిణ, చివరగా భీమిలి నియోజకవర్గ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గానికి 14 చొప్పున 98 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News May 31, 2024

చివరగా పలమనేరు ఫలితం..?

image

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పలమనేరులో 287 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ 21 రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారు. అత్యల్పంగా చిత్తూరులో 226, నగరిలో 229 పోలింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడి ఈవీఎంల లెక్కింపు 17 రౌండ్లలో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో చిత్తూరు లేదా నగరి ఎమ్మెల్యే ఎవరనేది ముందుగా తెలుస్తుంది. చివరగా పలమనేరు ఫలితం తేలే అవకాశం ఉంది. చిత్తూరు SVసెట్‌లో కౌంటింగ్ జరుగుతుంది.

News May 31, 2024

మైదుకూరు MLA రఘురామిరెడ్డికి హైకోర్టులో ఊరట

image

మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చాపాడు పోలీసులు ఆయనపై నమోదు చేసిన ఒక కేసుకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా ఈనెల 6వ తేదీ వరకు పలు షరతులతో మద్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టుతో సహా ఆయన విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చాపాడు పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

News May 31, 2024

శ్రీకాకుళం: విషాదం.. వివాహిత ఆత్మహత్య

image

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం పెనసాం గ్రామానికి చెందిన వివాహిత బెవర మేరీ సలోమి(22) గురువారం ఉరివేసుకొని మృతి చెందింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన సలోమికి, పెనసాంకు చెందిన జగదీశ్‌తో వివాహమైంది. వీరికి ఏడాదిన్నర కుమార్తె. సలోమి ఉరివేసుకొని ఉన్నట్లు సమాచారం అందడంతో SI మధుసూదనరావు వెళ్లి పరిశీలించారు. ఆమె తల్లిదండ్రులు విజయవాడలో ఉండటంతో ఫిర్యాదు అందాల్సి ఉందన్నారు.

News May 31, 2024

GOOD NEWS.. గ్రూప్-2 మెయిన్స్‌కు ఉచిత శిక్షణ

image

ఏలూరులోని బీసీ స్టడీ సర్కిల్లో జూన్ 1 నుంచి గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ వెల్ఫేర్ అధికారిణి నాగరాణి తెలిపారు. గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనన్నట్లు వివరించారు. జూలై 28వ తేదీన జరగనున్న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News May 31, 2024

VZM: చెక్‌బౌన్స్ కేసులో టీచర్‌కి జైలు శిక్ష

image

చెక్‌బౌన్స్ కేసులో టీచర్ జాగరపు వెంకట అప్పారావుకు 6 నెలల జైలుశిక్ష విధిస్తూ S.KOTA జూనియర్ సివిల్ జడ్జి వాణి గురువారం తీర్పు చెప్పారు. ధర్మవరానికి చెందిన శ్రీనివాసరావు నుంచి కుమరాంకి చెందిన వెంకట అప్పారావు రూ.2 లక్షలు అప్పు తీసుకొని రూ.1.50 లక్షలకు చెక్కు ఇచ్చారు. చెక్కు చెల్లకపోవడంతో కోర్టును ఆశ్రయించగా శిక్ష ఖరారైంది. నెల రోజుల్లో చెల్లించకపొతే మరో 6 నెలల శిక్ష ఉంటుందని తీర్పు వెల్లడించారు.

News May 31, 2024

నెల్లూరు: భారీగా దొరికిన బంగారం, డబ్బు

image

కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద రూ.కోట్ల విలువైన సొత్తు పట్టుబడింది. చెన్నై బస్సులో సీఐ శ్రీనివాసరావు తనిఖీలు చేయగా ఐదుగురు మహిళల వద్ద రూ.1.61 కోట్లు పట్టుబడింది. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారిని అరెస్ట్ చేశారు. అలాగే మిర్యాలగూడ నుంచి చెన్నై వెళ్తున్న కారులో రూ.కోటి విలువైన 1497 గ్రాముల బంగారు బిస్కెట్లు దొరికాయి. మరోవైపు వెంకటాచలం టోల్‌గేట్ వద్ద 1.65 కేజీల బంగారు బిస్కెట్లను సీజ్ చేశారు.