Andhra Pradesh

News May 30, 2024

మందస: గుర్తు తెలియని మృతదేహం కలకలం  

image

శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొండలోగాం పంచాయతీ పరిధి రామరాయి సమీప పొలాల్లో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక గిరిజనులు గుర్తించారు. అనంతరం మందస పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే మందస పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

News May 30, 2024

శ్రీకాకుళం జిల్లాలో తగ్గనున్న ఎండ తీవ్రత

image

జిల్లా ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తీపి కబురు చెప్పింది. ఈ మేరకు జిల్లాలో శుక్రవారం, శనివారం ఎండ తీవ్రత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుందని పేర్కొంది. ఈ సందర్భంగా ఆ రెండు రోజుల పాటు జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయని తేలికపాటి మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దీనితో 30 నుంచి 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను నమోదవుతాయని APSDMA తెలిపింది.

News May 30, 2024

చిత్తూరు: కత్తులతో దాడులు

image

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నంజంపేటలో కత్తులతో దాడులు చేయడం కలకలం రేపింది. వైసీపీ నాయకుడు కృష్ణమూర్తి తన అనుచరులతో గ్రామంలోకి చొరబడి వీరంగం సృష్టించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలు ఉమాశంకర్, నాగభూషణం, గిరిప్రసాద్‌ ఇళ్ల వద్దకు వెళ్లి కత్తులతో దాడి చేశారని చెప్పారు. నాగభూషణం తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 30, 2024

టపాసులు విక్రయిస్తే చర్యలు: ఏఎస్పీ

image

టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ మసుమ్ బాషా హెచ్చరించారు. తాడేపల్లిగూడెంలో టపాసులు, పెట్రోల్ బంకు యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో టపాసులు కాల్చడానికి పర్మిషన్ లేదని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాటిళ్లలో పెట్రోల్ నింపరాదని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎస్పీ మూర్తి, సీఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

News May 30, 2024

కడప: ‘నీటి సమస్యనా ఈ నంబర్‌కి కాల్ చేయండి’

image

కడపలో నీటి సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావలని కడప నగరపాలక సంస్థ పేర్కొంది. ‘నీరు చాలా విలువైనది, కాబట్టి దానిని తెలివిగా వినియోగిద్దాం! ఇవాళ మనం పొదుపు చేసే ప్రతి చుక్క రేపటిని నిర్ధారిస్తుంది. నీటి సరఫరా సమస్యల గురించి విచారించడానికి 9949093772 నంబర్‌ను సంప్రదించాలి’ అంటూ X (ట్విటర్)లో పోస్ట్ చేసింది. చాలా ఆలస్యం కాకముందే నీటిని ఆదా చేద్దాం అనే నినాదంతో ముందుకువెళ్దామని పేర్కొంది.

News May 30, 2024

లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేయండి: కలెక్టర్

image

జూన్ 4న నిర్వహించే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు.
గురువారం ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు అనుసంధానంగా కౌంటింగ్ కేంద్రాలలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు.

News May 30, 2024

అనంత: పాముకాటుకు గురై యువ కూలీ మృతి

image

బొమ్మనహల్ మండలం కొళగానహళ్లికి చెందిన ఓ యువ కూలీ పాము కాటుకు గురై మృతిచెందిన ఘటన గురువారం జరిగింది. కొళగనహళ్లి గ్రామానికి చెందిన హెచ్.ప్రభాకర్ దేవిగిరి క్రాస్ వద్ద పశుగ్రాసం లారీ లోడింగ్ కోసం తోటి కూలీలతో కలిసి వెళ్లాడు. అక్కడ జొన్న పంటలో కాలికి పాము కాటు వేసింది. వెంటనే అతడిని బళ్లారి వీమ్స్‌కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య సవిత ఉన్నారు.

News May 30, 2024

ప్రకాశం: అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. తమ్ముడు మృతి

image

జిల్లాలోని ముండ్లమూరు మండలం సుంకరవారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో అన్నదమ్ముల మధ్య గురువారం రాత్రి ఘర్షణ చోటు చేసుకోవడంతో తమ్ముడు మృతి చెందాడు. రాయితో అన్న దాడి చేయడంతో తమ్ముడు బ్రహ్మయ్య(29) ఘటనా స్థలంలోని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

నిప్పుల కొలిమిలా నెల్లూరు

image

భానుడు ప్రతాపంతో నెల్లూరు జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఎండ తీవ్రతతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. మధ్యాహ్నం సమయానికే రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వృద్ధులు చిన్నారులు ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా నెల్లూరులో ఈరోజు 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News May 30, 2024

ఎస్.రాయవరం: బైక్‌ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు.. వ్యక్తి మృతి

image

ఎస్.రాయవరం మండంలం అడ్డరోడ్డు సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. గురువారం మధ్యాహ్నం విశాఖ నుంచి కాకినాడ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్‌ పెదగుమ్ములూరు గ్రామానికి చెందిన జూమాల రాంబాబు(45) బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో రాంబాబు అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్సై విభీషణరావు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.