Andhra Pradesh

News May 30, 2024

ప్రకాశం: అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. తమ్ముడు మృతి

image

జిల్లాలోని ముండ్లమూరు మండలం సుంకరవారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో అన్నదమ్ముల మధ్య గురువారం రాత్రి ఘర్షణ చోటు చేసుకోవడంతో తమ్ముడు మృతి చెందాడు. రాయితో అన్న దాడి చేయడంతో తమ్ముడు బ్రహ్మయ్య(29) ఘటనా స్థలంలోని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

నిప్పుల కొలిమిలా నెల్లూరు

image

భానుడు ప్రతాపంతో నెల్లూరు జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఎండ తీవ్రతతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. మధ్యాహ్నం సమయానికే రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వృద్ధులు చిన్నారులు ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా నెల్లూరులో ఈరోజు 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News May 30, 2024

ఎస్.రాయవరం: బైక్‌ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు.. వ్యక్తి మృతి

image

ఎస్.రాయవరం మండంలం అడ్డరోడ్డు సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. గురువారం మధ్యాహ్నం విశాఖ నుంచి కాకినాడ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్‌ పెదగుమ్ములూరు గ్రామానికి చెందిన జూమాల రాంబాబు(45) బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో రాంబాబు అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్సై విభీషణరావు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News May 30, 2024

ధవళేశ్వరం: గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల

image

గోదావరి డెల్టా సిస్టం పరిధిలో ఖరీఫ్-2024 (ఫ.స.లీ.1434) పంటకు సంబంధించి మూడు ప్రధాన కాలువకట్టకు జూన్ 1న సాగు నీటిని విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ ఎస్ ఈ ఆర్.సతీష్ కుమార్ తెలిపారు. తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టా ప్రధాన పంట కాలువలకు జూన్ 1వ తేదీన ఉదయం 10.30 గంటలకు నీటి విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఎస్‌ఈ వెల్లడించారు. రైతులు దీనిని గుర్తించి సాగునీటిని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు.

News May 30, 2024

ICETలో 4,9 ర్యాంకులు సాధించిన అనంత విద్యార్థులు

image

ఐ సెట్ ఫలితాలు అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి ఐ సెట్ ఫలితాలు ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 44,447మంది ICETకు హాజరుకాగా.. 42,984మంది అర్హత సాధించినట్లు వెల్లడించారు. ఈ ఐసెట్‌లో అనంతపురం జిల్లాకు చెందిన కడపన గణేశ్ కుమార్ రెడ్డి నాలుగో ర్యాంక్, దవనబోయన వెంకటేశ్ తొమ్మిదవ ర్యాంకు సాధించారు.

News May 30, 2024

సికింద్రాబాద్ సిల్చార్ సూపర్ ఫాస్ట్ రైలు రద్దు

image

సికింద్రాబాద్- సిల్చార్ (12513) మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ రైలును జూన్ 1వ తేదీన రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ మేనేజర్ కే.సందీప్ తెలిపారు. న్యూహాల్ ఫామ్ రైల్వే స్టేషన్ బంద్రాకల్ మధ్య జరుగుతున్న ట్రాక్ మరమ్మతుల కారణంగా రైలును రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులు దీనిని గమనించి తదనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

News May 30, 2024

కుప్పంలో యువకుడి ఆత్మహత్య

image

చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక మునిసిపాల్టీ పరిధిలోని బైరుగానిపల్లె సమీపంలోని ఓ చెట్టుకు యువకుడు ఉరేసుకుని ఉండటాన్ని స్థానికులు గురువారం సాయంత్రం గుర్తించారు. వెంటనే కుప్పం పోలీసులకు సమాచారం అందించారు. యువకుడు బైరుగానిపల్లెకు చెందిన చెందిన అంజి(30)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News May 30, 2024

గుంటూరు: జూన్ 3 నుంచి మద్యం షాపులు మూసివేత

image

జూన్ 3 సాయంత్రం 6:00 నుంచి జిల్లాలోని మద్యం షాపులు మూసివేయాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించడంలో భాగంగా జూన్ 3 సాయంత్రం 6:00 నుంచి ఓట్ల. లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీ మద్యం దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. 

News May 30, 2024

కృష్ణా: LLB పరీక్షల రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన LLB 6వ సెమిస్టర్(రివైజ్డ్) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు.

News May 30, 2024

శ్రీకాకుళం: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు ఎస్పీ కీలక సూచనలు

image

శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లకు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా గ్రూప్స్‌లో ఉద్దేశపూర్వకంగా కుల, మత, రాజకీయ పార్టీలను, వ్యక్తులను రెచ్చగొట్టేలా పోస్టులు, అవాస్తవాలు షేర్ చేయకూడదన్నారు. అలా ఎవరైనా చేస్తే అడ్మిన్స్‌తో పాటు ఆ సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.