India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్వయం సహాయక సంఘాల మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో బుధవారం ఉపాధి అంశంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గుర్రపు డెక్క నుంచి వర్మి కంపోస్ట్ రూపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి మండలంలో మూడు యూనిట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నేపాల్‌లో చిక్కుకున్న నెల్లూరు జిల్లా వాసులకు రక్షణగా ప్రభుత్వం నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లా వాసులు ఎవరైనా నేపాల్‌లో ఉంటే వారి వివరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్‌లో తెలియపరచాలని కోరారు. వారి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అడ్మిషన్లకు రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్‌కు https://cets.apsche.ap.gov.in,
https://vsu.ac.in వెబ్ సైట్లను సందర్శించాలని అడ్మిషన్స్ డైరెక్టర్ హనుమారెడ్డి సూచించారు.
బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి 3 ఏళ్ల జైలుశిక్ష, రూ.15వేల జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. కొమరోలు మండలం మైనర్ బాలిక పట్ల వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో పోలీసులు సరైన సాక్ష్యాలు సేకరించారు. తాజాగా నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించగా పోలీసులను SP దామోదర్ అభినందించారు.
ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేలంపై కౌన్సిల్ సమావేశంలో 24 గంటలు ఉత్కంఠత అనంతరం ఆమోదం తెలిపారు. 9 ఏళ్లుగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు మున్సిపాలిటీకి బకాయిలు పెడుతూనే ఉన్నారు. వాటి వివరాలు (లక్షలలో)..
2015లో రూ.3.96, 2016లో రూ.3.13, 2017లో రూ.2, 2018లో రూ.4.75, 2019లో రూ.8.02, 2021లో రూ.7.10, 2022లో రూ.30.06, 2023లో రూ.5.66, 2024లో రూ.31.50 బకాయిలు మున్సిపాలిటీకి రావాల్సి ఉంది.
నేపాల్‌లో నెలకొన్న అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్ ఆదేశాల మేరకు ఈ సేవలను తక్షణం అందుబాటులోకి తీసుకువచ్చారు. నేపాల్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులు ఈ నంబర్‌కు 94912 22122 ఫోన్ చేసి సహాయం పొందవచ్చన్నారు.
గ్రామ స్థాయిలో ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై మండల స్థాయి అధికారులు తనిఖీ చేసి వెంటనే నివేదికను అందజేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ మండల స్థాయి కమిటీ అధికారులతో ఆక్వా జోనేషన్ ప్రతిపాదనలపై సమీక్షించారు. గ్రామ స్థాయి నుంచి ఆక్వా జోనేషన్ విస్తీర్ణాన్ని తనిఖీ చేసి జిల్లా స్థాయి కమిటికి పూర్తి స్థాయిలో నివేదిక అందించాలన్నారు.
తూ.గో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణం వద్ద ఈనెల 12న జాబ్ మేళా’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ బుధవారం తెలిపారు. పలు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి 19 నుంచి 30 సంవత్సరాలలోపు వయసుగల వారు అర్హులని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నేపాల్‌లో గడిచిన 2 రోజులగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లా నుంచి మొత్తం 61 మంది మానససరోవర యాత్రకు వెళ్లిన వారు ఉన్నారు. వారిని రప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఖాట్మండు నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు యాత్రికులందరూ రాష్ట్రానికి చేరుకుంటారన్నారు. వారి బంధువులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కోరారు.
ఎస్సీ కార్పొరేషన్ ఉచిత హెవీ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానించింది. బుధవారం కర్నూలులోని కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. 10 పోస్టులకు 21 మంది దరఖాస్తు చేయగా, అందులో 18 మంది హాజరయ్యారని చెప్పారు. అర్హులైన పది మందిని ఎంపిక చేయగా వారిలో ఒక మహిళ ఉన్నట్లు ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.