Andhra Pradesh

News May 30, 2024

బాపట్లలో నలుగురి గల్లంతు.. రంగంలోకి దిగిన NDRF బృందం

image

బాపట్ల జిల్లా నల్లమల వాగులో నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే. అయితే 3 మృతదేహాలు లభ్యం కాగా <<13341655>>నాలుగో వ్యక్తి ఇంకా లభ్యం కాలేదు. <<>>ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశాలతో తహసీల్దార్ శ్రవణ్ కుమార్, డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో NDRF బృందం రంగంలోకి దిగింది. ఇప్పటికే బాపట్ల రూరల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు ప్రత్యేక బోట్ల ద్వారా నాలుగో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

News May 30, 2024

ఆమదాలవలస: నిప్పుల కుంపటిలా వాతావరణం

image

ఆమదాలవలస నియోజకవర్గ పరిధికి చెందిన మండలంలో గురువారం వాతావరణం నిప్పుల కుంపటిలా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణంలో భానుడి ప్రతాపం అధికం కావడంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ఎండ వేడి, ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. తోపుడు బండ్లపై వ్యాపారులు, దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా తయారైంది. అవసరమైతే గానీ బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు.

News May 30, 2024

ప్రకాశం: 4 రోజుల్లో మన MLA ఎవరో తెలుస్తుంది

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలింగ్‌ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఫలితాల కోసం అటు అభ్యర్థులు, ఇటు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ ఉంది. 2019లోని 12 స్థానాల్లో YCP-8, TDP-4 గెలిచాయి. YCP మరోసారి ఎక్కువ స్థానాలపై కన్నేయగా, TDPకి మెజార్టీ సీట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్ పట్టు సాధించాలని చూస్తుండగా, దీంతో ఎవరు గెలుస్తారనే చర్చ నడుస్తోంది. మరి మీ MLAగా ఎవరు గెలవబోతున్నారు.

News May 30, 2024

కడప: ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కడప జిల్లాలో జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలుత సైన్యంలో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి వచ్చిన ఓట్లు, తర్వాత పోస్టల్ బ్యాలట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు. 8.30కు EVMలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఉదయం 10-11గంటల మధ్య ఫలితాలపై కొంత స్పష్టత వస్తుందన్నారు.

News May 30, 2024

తూ.గో: విషాదం.. పాల ప్యాకెట్ కోసం వెళ్లి మృత్యువాత

image

పాల ప్యాకెట్ కోసం బైక్‌పై కుమారుడితో వెళ్తూ తండ్రి మృతి చెందాడు. కొవ్వూరుకు చెందిన శెట్టి కనకప్రసాద్(35) ఉపాధి నిమిత్తం 10 రోజుల కింద హైదరాబాద్ వెళ్లాడు. గురువారం ఉదయం పాల ప్యాకెట్ కోసం తన రెండేళ్ల కుమారుడిని తీసుకొని బైక్‌పై వెళ్తుండగా.. HYD ఇనాంగూడ వద్ద డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందగా.. కుమారుడికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

మదనపల్లెలో గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం

image

మదనపల్లె వారపు సంత క్రాస్ వద్ద ఉండే గ్యాస్ షాప్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించడంతో సిబ్బందితో వెళ్లి మంటలు అదుపు చేశామన్నారు. సకాలంలో మంటలు ఆర్పడం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదన్నారు. గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్‌ను సైదాపేటకు చెందిన భాష గత రెండేళ్లుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

News May 30, 2024

నెల్లూరు: విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు: SP

image

ఎన్నికల ఫలితాల రోజు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. వాట్సప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే మెసేజ్‌లు పంపితే గ్రూప్ అడ్మిన్ మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరు గెలిచినా పాజిటివ్‌గా ఉండాలని అన్నారు. అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని అన్నారు.

News May 30, 2024

ప.గో: విషాదం.. పాల ప్యాకెట్ కోసం వెళ్లి మృత్యువాత

image

పాల ప్యాకెట్ కోసం బైక్‌పై కుమారుడితో వెళ్తూ తండ్రి మృతి చెందాడు. కొవ్వూరుకు చెందిన శెట్టి కనకప్రసాద్(35) ఉపాధి నిమిత్తం 10 రోజుల కింద హైదరాబాద్ వెళ్లాడు. గురువారం ఉదయం పాల ప్యాకెట్ కోసం తన రెండేళ్ల కుమారుడిని తీసుకొని బైక్‌పై వెళ్తుండగా.. HYD ఇనాంగూడ వద్ద డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందగా.. కుమారుడికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

అనంత: రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

image

అనంతపురం దగ్గరలోని మారుతీ నగర్ ఫస్ట్ క్లాస్ వద్ద గురువారం రైలులో నుంచి జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా స్థానికులు తెలిపిన వివరాల మేరకు బెంగళూరు నుంచి బళ్లారి వెళ్లే హంపి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సురేశ్ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News May 30, 2024

గుంటూరు వెస్ట్ అసెంబ్లీలో 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు

image

ఓట్ల లెక్కింపునకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కౌంటింగ్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 94 నంబర్ గల గుంటూరు వెస్ట్ అసెంబ్లీ లో మొత్తం 282 పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ జరిగింది. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో 21 రౌండ్‌లలో లెక్కించనున్నారు. రౌండ్‌ల వారీగా ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రకటించడానికి ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది.