Andhra Pradesh

News May 30, 2024

కడప: 4 రోజుల్లో మన MLA ఎవరో తెలుస్తుంది

image

జిల్లాలో పోలింగ్‌ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఫలితాల కోసం అటు అభ్యర్థులు, ఇటు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ ఉంది. 2019లో ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలను క్లీన్ స్విప్ చేసిన YCP ఈసారి అదే ధీమాతో ఉంది. అటు TDPకి ఈసారి మెజార్టీ సీట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్ పట్టు సాధించాలని చూస్తుండగా, దీంతో ఎవరు గెలుస్తారా అని చర్చ నడుస్తోంది. మరి మీ MLAగా ఎవరు గెలవబోతున్నారు.

News May 30, 2024

అనంతసాగరం: పెన్నా నదిలో మృతదేహం లభ్యం

image

అనంతసాగరం మండలం, సోమశిలలోని శివాలయం ఎదురుగా ఉన్న పెన్నా నదిలో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహం వద్ద ఆధార్ కార్డు లభ్యం అవ్వడంతో మృతురాలిది కడప జిల్లా, రాజంపేట మండలం, బాలరాజుపల్లికి చెందిన పంగ అంకన్నగారి చెన్నమ్మ (74) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

ప.గో: ‘నేను గెలుస్తానా..? లేదా..? చెప్పండి’

image

జూన్ 4 కోసం అభ్యర్థులు, ప్రజల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కౌంటింగ్‌కు మరో 4రోజులే గడువు ఉండగా ఉమ్మడి ప.గో జిల్లాలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. పోలింగ్ తర్వాత విహారయాత్రలకు వెళ్లిన అభ్యర్థులు, నేతలు తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. ఎవరికి వారు సర్వేలు చేయించుకున్నప్పటికీ ఓటరు నాడీ పట్టలేక న్యూమరాలజీ, జ్యోతిషం చెప్పవారిని ఆశ్రయిస్తున్నారు. ‘నేను గెలుస్తానా లేదా చెప్పండి’ అంటూ స్పష్టత తీసుకుంటున్నారట.

News May 30, 2024

అనంత JNTUలో ఏపీ ఈసెట్ ఫలితాలు

image

ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి ఏపీ ఈసెట్ ఫలితాలు అనంతపురం జేఎన్టీయూలో గురువారం విడుదల చేశారు. బీటెక్ రెండవ సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈసెట్ పరీక్ష అనంతపురం జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. 37767 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 36369 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 32881 మంది విద్యార్థులు అర్హత సాధించారన్నారు. ఉత్తీర్ణతా శాతం 90.41గా ఉందన్నారు.

News May 30, 2024

జగన్ గెలిస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు పోస్టర్లు అతికిస్తా: కిరణ్ రాయల్

image

జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం చేస్తే రాజకీయాల నుంచి బయటకు వచ్చి జగన్ ప్రమాణ స్వీకార ఆహ్వాన పోస్టర్లు తిరుపతి నుంచి వైజాగ్ వరకు అంటిస్తానని జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ సవాల్ విసిరారు. తిరుపతిలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సజ్జల మాట్లాడిన మాటలు రాజకీయ విధ్యంసం పెంచే విధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కౌంటింగ్ వద్ద హింసను ప్రేరేపించడం సిగ్గుచేటని అన్నారు.

News May 30, 2024

తూ.గో: ‘నేను గెలుస్తానా..? లేదా..? చెప్పండి’

image

జూన్ 4 కోసం అభ్యర్థులు, ప్రజల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కౌంటింగ్‌కు మరో 4రోజులే గడువు ఉండగా ఉమ్మడి తూ.గో జిల్లాలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. పోలింగ్ తర్వాత విహారయాత్రలకు వెళ్లిన అభ్యర్థులు, నేతలు తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. ఎవరికి వారు సర్వేలు చేయించుకున్నప్పటికీ ఓటరు నాడీ పట్టలేక న్యూమరాలజీ, జ్యోతిషం చెప్పవారిని ఆశ్రయిస్తున్నారు. ‘నేను గెలుస్తానా లేదా చెప్పండి’ అంటూ స్పష్టత తీసుకుంటున్నారట.

News May 30, 2024

రొద్దం: చెట్టుకు ఊరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

రొద్దం మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగు చూసింది. ఎస్సీ కాలనీ సమీపంలో చెట్టుకు చంద్ర మోహన్ అనే వ్యక్తి చీరతో మెడకు ఊరి వేసుకోని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 30, 2024

కర్నూలు: పెళ్లి కావడం లేదని సూసైడ్

image

కర్నూలు బి.క్యాంప్ లో నివాసముంటున్న రఘు నాయక్ (27) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై గదిలో ఉరి వేసుకున్నాడు. తల్లి లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మూడో పట్టణ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు.

News May 30, 2024

ప.గో జిల్లాలో మాజీ సర్పంచికి జైలు శిక్ష

image

ప.గో జిల్లా ఆకివీడు మండలం దుంపగడప మాజీ సర్పంచి కవిటపు రామకృష్ణకు జైలు శిక్ష పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. 2018 ఫిబ్రవరి 16న రామకృష్ణ తనను కులం పేరుతో దూషించి, ఉద్యోగం తీయిస్తానంటూ బెదించినట్లు ANM ఫిర్యాదు చేయగా, అప్పటి SI సుధాకర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. అనేక వాయిదాలు, వాదనల అనంతరం నేరం రుజువుకావడంతో రామకృష్ణకు ఏడాది జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెలువడింది.

News May 30, 2024

మరో నాలుగు రోజులే.. విజయవాడ ఎంపీగా గెలుపెవరిది?

image

ఎన్నికల ఫలితాలు వెలువడడానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉండగా, ఎన్టీఆర్ జిల్లా ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం ఇరు పార్టీల నుంచి కేశినేని బ్రదర్స్ (వైసీపీ తరఫున కేశినేని నాని, కూటమి తరపున కేశినేని చిన్ని) పోటీ చేస్తుండగా.. జూన్ 4న అన్నదమ్ముల్లో ఎవరు గెలుస్తారోనని చూడడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.