Andhra Pradesh

News May 30, 2024

జగన్ గెలిస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు పోస్టర్లు అతికిస్తా: కిరణ్ రాయల్

image

జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం చేస్తే రాజకీయాల నుంచి బయటకు వచ్చి జగన్ ప్రమాణ స్వీకార ఆహ్వాన పోస్టర్లు తిరుపతి నుంచి వైజాగ్ వరకు అంటిస్తానని జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ సవాల్ విసిరారు. తిరుపతిలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సజ్జల మాట్లాడిన మాటలు రాజకీయ విధ్యంసం పెంచే విధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కౌంటింగ్ వద్ద హింసను ప్రేరేపించడం సిగ్గుచేటని అన్నారు.

News May 30, 2024

తూ.గో: ‘నేను గెలుస్తానా..? లేదా..? చెప్పండి’

image

జూన్ 4 కోసం అభ్యర్థులు, ప్రజల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కౌంటింగ్‌కు మరో 4రోజులే గడువు ఉండగా ఉమ్మడి తూ.గో జిల్లాలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. పోలింగ్ తర్వాత విహారయాత్రలకు వెళ్లిన అభ్యర్థులు, నేతలు తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. ఎవరికి వారు సర్వేలు చేయించుకున్నప్పటికీ ఓటరు నాడీ పట్టలేక న్యూమరాలజీ, జ్యోతిషం చెప్పవారిని ఆశ్రయిస్తున్నారు. ‘నేను గెలుస్తానా లేదా చెప్పండి’ అంటూ స్పష్టత తీసుకుంటున్నారట.

News May 30, 2024

రొద్దం: చెట్టుకు ఊరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

రొద్దం మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగు చూసింది. ఎస్సీ కాలనీ సమీపంలో చెట్టుకు చంద్ర మోహన్ అనే వ్యక్తి చీరతో మెడకు ఊరి వేసుకోని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 30, 2024

కర్నూలు: పెళ్లి కావడం లేదని సూసైడ్

image

కర్నూలు బి.క్యాంప్ లో నివాసముంటున్న రఘు నాయక్ (27) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై గదిలో ఉరి వేసుకున్నాడు. తల్లి లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మూడో పట్టణ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు.

News May 30, 2024

ప.గో జిల్లాలో మాజీ సర్పంచికి జైలు శిక్ష

image

ప.గో జిల్లా ఆకివీడు మండలం దుంపగడప మాజీ సర్పంచి కవిటపు రామకృష్ణకు జైలు శిక్ష పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. 2018 ఫిబ్రవరి 16న రామకృష్ణ తనను కులం పేరుతో దూషించి, ఉద్యోగం తీయిస్తానంటూ బెదించినట్లు ANM ఫిర్యాదు చేయగా, అప్పటి SI సుధాకర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. అనేక వాయిదాలు, వాదనల అనంతరం నేరం రుజువుకావడంతో రామకృష్ణకు ఏడాది జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెలువడింది.

News May 30, 2024

మరో నాలుగు రోజులే.. విజయవాడ ఎంపీగా గెలుపెవరిది?

image

ఎన్నికల ఫలితాలు వెలువడడానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉండగా, ఎన్టీఆర్ జిల్లా ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం ఇరు పార్టీల నుంచి కేశినేని బ్రదర్స్ (వైసీపీ తరఫున కేశినేని నాని, కూటమి తరపున కేశినేని చిన్ని) పోటీ చేస్తుండగా.. జూన్ 4న అన్నదమ్ముల్లో ఎవరు గెలుస్తారోనని చూడడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

News May 30, 2024

బి.కోడూరు: YCP నాయకుడిపై కేసు నమోదు

image

మండలంలోని పెద్దులపల్లెకి చెందిన EX ZPTC, YCP నాయకుడు రామకృష్ణారెడ్డిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దులపల్లె పరిధిలోని ప్రభుత్వ భూమి S.NO:331లో 10 ఎకరాలను ఆక్రమించాడని పలు ఆరోపణలు రావడంతో రెవెన్యూ అధికారులు భూములను పరిశీలించి నోటీసులు ఇచ్చారు. ఆక్రమిత భూమిలో రాత్రికి రాత్రే మొక్కలు నాటడంతో గుర్తించిన MRO మహేశ్వరి బాయ్ సిబ్బందితో మొక్కలను తొలగించారు. MRO ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

News May 30, 2024

చీమకుర్తి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

చీమకుర్తి ఈస్ట్ బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న సీఐ దుర్గా ప్రసాద్ మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ హాస్పటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 30, 2024

శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న పాలిటెక్నిక్ కౌన్సిలింగ్

image

జిల్లాలో పాలీసెట్ -2024 కౌన్సిలింగ్ కొనసాగుతోంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. బుధవారం 27,001నుంచి 43,000 ర్యాంకు మధ్య విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించగా, 336 మంది హాజరయ్యారు. వీరిలో ఓసి, బిసి 305, ఎస్సీ, ఎస్టీ 31 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈనెల 27 నుంచి కౌన్సిలింగ్‌కు 951 మంది హాజరయ్యారు. నేడు 43001 నుంచి 59000 ర్యాంకుల వారికి పరిశీలిస్తారు.

News May 30, 2024

శ్రీకాకుళం: పెరుగుతున్న కూరగాయలు ధరలు

image

జిల్లాలో కూరగాయల ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. మార్కెట్లో ఏ కూరగాయలు కొనాలన్నా కనీసం కిలో ధర రూ.50/- లు కంటే ఎక్కువ చెల్లించాల్సిందే. బజార్లలో కిలో పచ్చిమిర్చి ఏకంగా రూ.60/- లు వరకు పలకగా రిటైల్ షాపులలో కనీసం రూ.65/- లు నుంచి రూ.70/- ల వరకు అమ్ముతున్నారు. దీనితో సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలను చూసి కొనాలన్నా, తినాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి.