Andhra Pradesh

News May 30, 2024

ధర్మవరంలో హత్య చేసింది ఇతడినే..!

image

ధర్మవరంలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించిన విషయం తెలిసిందే. హిందూపురం పట్టణానికి చెందిన కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యుఐ జాతీయ కార్యదర్శి, యువ న్యాయవాది సంపత్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. ధర్మవరం ఒకటవ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

మచిలీపట్నం: బీటెక్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ – 2024లో నిర్వహించిన బీటెక్ 7,8 సెమిస్టర్ (స్పెషల్) పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. పరీక్షల ఫలితాలకై వర్సిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in / చెక్ చేసుకోవాలని కృష్ణా విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం తెలిపింది.

News May 30, 2024

పవన్ మెజార్టీపై నా యావదాస్తి పందెం వేస్తా: వర్మ

image

‘పిఠాపురంలో పవన్ మంచి మెజార్టీతో గెలుస్తారని నా యావదాస్తి పందెం వేస్తా. ఎవరైనా ఉంటే కాగితాలతో రమ్మనండి’ అంటూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ ఓ ఛానల్ డిబెట్‌లో సవాల్ చేశారు. చంద్రబాబు, పవన్ తాము గెలుస్తున్నట్లు ఎక్కడా చెప్పడం లేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందన్న విషయంపై వర్మ స్పందిస్తూ.. గెలిచే వారెప్పుడూ సైలెంట్‌గా, ప్రశాంతంగా ఉంటారని, ఓడిపోయే వారే హడావుడి చేస్తారని అన్నారు.

News May 30, 2024

కడప: ఓపెన్ 10th, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే

image

ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ కు సంబంధించి టెన్త్, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని డీఈవో అనురాధ, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ కెవి సుబ్బారెడ్డి తెలిపారు. పదో తరగతికి సంబంధించి 5 కేంద్రాల్లో 768 మంది అభ్యాసకులు, ఇంటర్మీడియట్‌కు సంబంధించి 7 కేంద్రాల్లో 1373 మంది పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయన్నారు

News May 30, 2024

పిఠాపురం ఫలితంపై నా యావదాస్తి పందెం వేస్తా: వర్మ

image

‘పిఠాపురంలో పవన్ మంచి మెజార్టీతో గెలుస్తారని నా యావదాస్తి పందెం వేస్తా. ఎవరైనా ఉంటే కాగితాలతో రమ్మనండి’ అంటూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ ఓ ఛానల్ డిబెట్‌లో సవాల్ చేశారు. చంద్రబాబు, పవన్ తాము గెలుస్తున్నట్లు ఎక్కడా చెప్పడం లేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందన్న విషయంపై వర్మ స్పందిస్తూ.. గెలిచే వారెప్పుడూ సైలెంట్‌గా, ప్రశాంతంగా ఉంటారని, ఓడిపోయే వారే హడావుడి చేస్తారని అన్నారు.

News May 30, 2024

విశాఖ: ప్రభుత్వ సిబ్బంది నిబద్ధతతో పని చేయాలి

image

ప్రభుత్వ కార్యాలయంలో సిబ్బంది, అధికారులు నిబద్ధతతో పనిచేయాలని విశాఖ జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఎం.వి శేషమ్మ అన్నారు. జిల్లా కోర్టులోని లోక్ అదాలత్ కార్యాలయంలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల ప్రభుత్వ అధికారుల శిక్షణ శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి శేషమ్మ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

News May 30, 2024

ఏలూరు: ట్రావెల్స్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

ప్రైవేట్ ట్రావెల్స్ వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు భీమడోలు ఎస్సై సుధాకర్ తెలిపారు. భీమడోలు మండలం అరుంధతీ కాలనీకి చెందిన భీమడోలు మహాలక్ష్ముడు బుధవారం ఏలూరు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వెళ్తున్న ట్రావెల్స్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహాలక్ష్ముడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.

News May 30, 2024

రేపు విశాఖ-పలాస పాసింజర్ రద్దు

image

వాల్తేరు డివిజన్ నౌపడ- పూండి సెక్షన్లో వంతెనల పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ శుక్రవారం పలు రైళ్లను రద్దు చేసినట్టు వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఆరోజు శుక్రవారం పలాస-విశాఖ (07471) (07470) ప్రత్యేక మెమో పాసింజర్ రైళ్లను రద్దు చేశారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి సహకరించాలని వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్ కోరారు.

News May 30, 2024

విశాఖ: ఇంటర్ పరీక్షల్లో డబ్బులు వసూలు?

image

ఇంటర్ సంప్లమెంటరీ పరీక్షల్లో విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కూర్మన్నపాలెంలోని ఓ ప్రైవేటు కాలేజీ నిర్వాహకులు నగదు వసూలు చేసి మాస్‌కాపీయింగ్‌కు సహకరిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో ఆ కళాశాలలో అధికారులు బుధవారం తనిఖీ చేశారు. గదులను, సీసీ ఫుటేజీని పరిశీలించి ఎలాంటి అవకతవకలు జరగలేదని నిర్ధారించారు.

News May 30, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఠారెక్కిస్తున్న ఎండలు

image

పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో వేసవి ప్రభావంతో ఎండలు ఠారెక్కిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కాస్తున్న ఎండకు వృద్ధులు, చిన్నారులు, ప్రజలు ఉక్కపోతతో తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారు. ఎండ ప్రభావంతో జన సంచారం లేక ప్రధాన పట్టణాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వేసవి తాపానికి గురి కాకుండా మజ్జిగ, మంచి నీరు, కొబ్బరినీళ్లు విధిగా తీసుకోవాలని, పనులు వాయిదా వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.