India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రామ స్థాయిలో ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై మండల స్థాయి అధికారులు తనిఖీ చేసి వెంటనే నివేదికను అందజేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ మండల స్థాయి కమిటీ అధికారులతో ఆక్వా జోనేషన్ ప్రతిపాదనలపై సమీక్షించారు. గ్రామ స్థాయి నుంచి ఆక్వా జోనేషన్ విస్తీర్ణాన్ని తనిఖీ చేసి జిల్లా స్థాయి కమిటికి పూర్తి స్థాయిలో నివేదిక అందించాలన్నారు.
తూ.గో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణం వద్ద ఈనెల 12న జాబ్ మేళా’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ బుధవారం తెలిపారు. పలు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి 19 నుంచి 30 సంవత్సరాలలోపు వయసుగల వారు అర్హులని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నేపాల్‌లో గడిచిన 2 రోజులగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లా నుంచి మొత్తం 61 మంది మానససరోవర యాత్రకు వెళ్లిన వారు ఉన్నారు. వారిని రప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఖాట్మండు నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు యాత్రికులందరూ రాష్ట్రానికి చేరుకుంటారన్నారు. వారి బంధువులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కోరారు.
ఎస్సీ కార్పొరేషన్ ఉచిత హెవీ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానించింది. బుధవారం కర్నూలులోని కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. 10 పోస్టులకు 21 మంది దరఖాస్తు చేయగా, అందులో 18 మంది హాజరయ్యారని చెప్పారు. అర్హులైన పది మందిని ఎంపిక చేయగా వారిలో ఒక మహిళ ఉన్నట్లు ప్రకటించారు.
ప్రొద్దుటూరు జార్జ్ కారొనేషన్ క్లబ్లో బుధవారం ఎస్జీఎఫ్ఐ జిల్లా స్థాయి అండర్ 14, 17 బాల బాలికల ఫెన్సింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభను చూపిన 40 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ఐ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాజుపాలెం ఎంఈవో ప్రసాద్, హెచ్ఎం ఇమామ్ హుస్సేన్, పీడీలు పోటీలను పర్యవేక్షించారు.
బ్లూమ్‌బర్గ్ మేయర్స్ ఛాలెంజ్‌లో విశాఖ ఎంపికైందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. 99 దేశాల్లో 600 నగరాలు పోటీ పడగా 50 నగరాలను ఫైనల్‌కు చేశారని, ఇందులో విశాఖ నిలిచిందని చెప్పారు. ప్రతి పౌరుడు జీవీఎంసీ అధికారిక వెబ్‌సైట్‌లో క్యూఆర్ కోడ్‌తో తమ ఆలోచనలు, అభిప్రాయాలు, సూచనలు పంచుకోవాలన్నారు. ఈనెలలో 19వ వార్డులో వర్క్ షాప్ నిర్వహించనున్నామన్నారు.
రైతులకు తగినంత యూరియా జిల్లాలో అందుబాటులో ఉందని, పంపిణీ కూడా సక్రమంగా జరుగుతోందని కలెక్టర్ అంబేడ్కర్ బుధవారం తెలిపారు. యూరియా సరఫరాలో సమస్యలు తగ్గాయని, డయిల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ఫోన్ చేసేవారి సంఖ్య కూడా తగ్గిందని చెప్పారు. అందువల్ల డయిల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని గురువారం నుంచి తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
దేవనకొండలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ రంజిత్ భాష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉండే రోగులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రంతో పాటు, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కేంద్రాలకు సంబంధించిన రికార్డులను చూశారు. మండల వైద్యాధికారి, సీఐ వంశీనాథ్, ఆర్డీవో భరత్ నాయక్ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ చాంబర్‌లో జాతీయ పశువ్యాధి నియంత్రణ గోడపోస్టర్లను కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ఈనెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 15 వరకు ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పశువులకు సమయానుకూలంగా టీకాలు వేయడం ద్వారా వ్యాధి నియంత్రణ సాధ్యమవుతుందని రైతులు, పశుపోషకులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లాలోని నిరుద్యోగ యువత కర్నూల్ కెరీర్స్ (mykurnool.ap.gov.in) పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రంజిత్ భాష బుధవారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరూ ఈ వెబ్ సైట్‌లో తమ తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల వివరాలను తెలుసుకోవచ్చన్నారు. ఈ సమాచారాన్ని ఈ మెయిల్ ద్వారా అందించే సౌకర్యం ఉందన్నారు.
Sorry, no posts matched your criteria.