Andhra Pradesh

News May 30, 2024

నాగార్జున యూనివర్సిటీకి జాతీయ ర్యాంక్

image

ది వీక్- హన్సా రీసెర్చ్ – బెస్ట్ యూనివర్సిటీ సర్వే – 2024 ర్యాంకింగ్స్ మల్టీడిస్సిప్లినరీ యూనివర్సిటీ కేటగిరిలో, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జాతీయ స్థాయిలో 16వ ర్యాంకును, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకును కైవసం చేసుకుంది. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది కృషి వల్లే ఈ ర్యాంకు సాధ్యమైందని వీసీ రాజశేఖర్ పేర్కొన్నారు. ఇటువంటి ర్యాంకుల ద్వారా విశ్వవిద్యాలయ కీర్తి మరింత ఉన్నత స్థాయికి చేరుతుందన్నారు.

News May 30, 2024

కోనసీమ: రికార్డు స్థాయిలో ‘పనస’ విక్రయాలు

image

కోనసీమ జిల్లా అంటే గుర్తొచ్చేవి కొబ్బరి తోటలు. వీటి మధ్యే అంతర్ పంటగా వేసే ‘పనస’ సైతం మంచి దిగుబడితో లాభాలు తెచ్చిపెడుతోంది. అంబాజీపేట మార్కెట్‌కు రోజూ 500-700లకు పైగా పనసకాయలు వస్తుంటాయి. జిల్లా నుంచి HYD, ఇతర నగరాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈఏడాది జిల్లాలో 79.36 ఎకరాల్లో సాగు కాగా.. ఇప్పటికే రూ.7 కోట్ల వ్యాపారం జరిగినట్లు సమాచారం. 10-15 కాయలు కాసే చెట్టుకు ఈసారి 25 కాసినట్లు రైతులు చెబుతున్నారు.

News May 30, 2024

కృష్ణా: జూన్ 7తో ముగియనున్న రీవాల్యుయేషన్ గడువు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (దూరవిద్య) పరిధిలో ఫిబ్రవరి/మార్చి 2024లో నిర్వహించిన డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలకు (సెమిస్టర్ ఎండ్) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా నిర్ణీత ఫీజు రూ.770 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News May 30, 2024

ప.గో: విషాదం.. భార్యపై అలిగి భర్త ఆత్మహత్య

image

భార్యపై అలిగి భర్త సూసైడ్ చేసుకున్న ఘటన ప.గో జిల్లా ఆకివీడులో చోటుచేసుకుంది. SI నాగబాబు వివరాల ప్రకారం.. అమృతరావు కాలనీకి చెందిన బాలుప్రసాద్(31) ఓ ఖాళీ స్థలాన్ని కొని అప్పులపాలయ్యాడు. అవి తీర్చేందుకు కువైట్ వెళ్తానని భార్యకు చెప్పగా ఆమె ఒప్పుకోలేదు. కోపంతో పుట్టింటికి వెళ్లిపోవడంతో బాలు ప్రసాద్ ఈనెల 24న పురుగు మందు తాగాడు. భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 28న మృతి చెందాడు.

News May 30, 2024

దారుణం.. మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంబాజీపేట మండలం చిరుతపూడి శివారు కట్టావారిపాలెంకు చెందిన మానసిక దివ్యాంగురాలు(25) ఈనెల 26న అమ్మవారి జాతర నేపథ్యంలో ఇంట్లోంచి బయటకు వెళ్లింది. అదే అదనుగా భావించిన పాటియ్య(55) ఆమెను పక్కన ఉన్న తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. కేకలు విన్న ఇతర మహిళలు వెళ్లి ఆమెను బయటకు తీసుకువచ్చారు.తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News May 30, 2024

విశాఖ: రెట్టింపు లాభాన్ని ఆర్జించిన డీసీఐ

image

డ్రెస్సింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2023-24 ఆర్థిక సంవత్సరం సమయానికి రూ.35.68 కోట్ల లాభాన్ని ఆర్జించిందని డీసీఐ అధికారి నటరాజన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.15 కోట్ల లాభం సాధించగా ఈ సంవత్సరం రెట్టింపు లాభాన్ని సాధించిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.945.5 కోట్ల టర్నోవర్ సాధించామని, 2024-25 సంవత్సరానికి రూ.1840 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు తెలియజేశారు.

News May 30, 2024

తెనాలి: ఈ దేవాలయ ప్రతిష్ఠ జరిగి 100 సంవత్సరాలు

image

తెనాలి పట్టణ బోసురోడ్డు, హనుమాన్ చౌక్‌లోని సుప్రసిద్ధ దేవాలయం శ్రీచిట్టి ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ ఆలయ ప్రతిష్ఠ జరిగి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు స్వామివారి శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు భక్తులు స్వామి వారిని దర్శించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులు కావాలని పూజారి దివి యోగానంద చక్రవర్తి కోరారు.

News May 30, 2024

10th మార్కుల జాబితాలో తప్పులుంటే ఇలా చేయండి: డీఈవో

image

ప్రకాశం: పదవ తరగతి మార్కుల జాబితా (2023-24 సంవత్సరం) లో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు తక్షణమే స్పందించాలని డీఈవో సుభద్ర తెలిపారు. తప్పులను సరిచేసుకోవాలంటే డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, విజయవాడ కార్యాలయంలోని మాణిక్యమాంబను సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.

News May 30, 2024

కర్నూలు: వేరు వేరు ఘటనల్లో ఐదుగురి ఆత్మహత్య

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఒకేరోజు ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదుగురూ కూడా యువకులే కావడం గమనార్హం. శ్రీశైలంలో పూజారి మహేశ్(26), పాణ్యంలో చాకలి మోహన్ వంశీ(23), దేవనకొండ మండలం జిల్లెబుడకల గ్రామంలో కొండమీద హరిచంద్ర(39), కర్నూల్ బి.క్యాంపులో రఘునాయక్(27), పగిడ్యాల మండలకేంద్రంలో రమేశ్(20) ఒకే రోజు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కారణాలు ఏవైనా వీరి ఆత్మహత్య విషాదాన్ని నింపుతోంది.

News May 30, 2024

రైల్వేకోడూరు: బాలికతో హోంగార్డు అసభ్య ప్రవర్తన

image

కోడూరులో హోంగార్డుగా పనిచేసే టి.ప్రతాప్ ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన భార్యాభర్తలు తమ కుమార్తె(15)తో కలిసి మంగళవారం ట్రైన్‌లో బయలుదేరారు. బాలిక అప్పర్ బెర్త్‌లో నిద్రింస్తుంది. తనతో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడాన్ని గమనించి తల్లికి చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించి జైలుకు తరలించారు.