Andhra Pradesh

News May 30, 2024

అనంత: ప్రిన్సిపల్‌కు జైలు శిక్ష

image

విశ్రాంత ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన ఓ ప్రిన్సిపల్‌కు కర్నూలు ఏసీబీ కోర్టు జైలు శిక్షతోపాటు బుధవారం జరిమానా విధించింది. అనంతపురం రేంజ్ ఏసీబీ డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపిన మేరకు హిందూపురం ప్రభుత్వ అందుల రెసిడెన్షియల్ పాఠశాలలో 2017లో రాజేశ్వర్ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. పెన్షనరీ బెనిఫిట్స్ బిల్లుల కోసం ప్రిన్సిపల్ రూ. 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

News May 30, 2024

ప.గో: నేడు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పర్యటన

image

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
ముఖేష్ కుమార్ మీనా గురువారం భీమవరం రానున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు భీమవరం SRKR  ఇంజినీరింగ్ కాలేజీ, విష్ణు కాలేజీలలో కౌంటింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్‌లను ఆయన తనిఖీ చేస్తారు. సాయంత్రం భీమవరం నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తారని కలెక్టర్ పేర్కొన్నారు.

News May 30, 2024

తిరుపతి: డిగ్రీ విద్యార్థులకు సెలవులు పొడిగింపు

image

ఎస్వీయూ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు జూన్ 6వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ మహ్మద్ హుస్సేన్ తెలిపారు. గతంలో మే 31 వరకు ఉన్న సెలవులను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూన్ 6వ తేదీ వరకు పొడిగించామన్నారు. జూన్ 7వ తేదీన కళాశాలలు పున: ప్రారంభమవుతాయని తెలిపారు. ఆదేశాలను ఎస్వీయూ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలలు తప్పక పాటించాలని సూచించారు.

News May 30, 2024

నెల్లూరు: ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై స్నేహితుడి అత్యాచారం

image

ప్రేమికుడిని కట్టేసి, ప్రియురాలిపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన సూళ్లూరుపేటలో జరిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన యువతి, యువకుడు ప్రేమించుకుంటున్నారు. యువకుడికి ఏడుమలై, బాలాజీ అనే స్నేహితులున్నారు. ఆ యువతి జన్మదినం సందర్భంగా.. గుడికి వెళ్దామని చెప్పి మార్గమధ్యంలో ఏడుమలై, బాలాజీ కలిసి ఆ యువకుడి చొక్కాతో అతణ్ని కట్టేశారు. బాలాజీ కాపలాగా ఉండగా ఏడుమలై యువతిని (20) బెదిరించి అత్యాచారం చేశాడు.

News May 30, 2024

తూ.గో: సైన్స్ పరీక్షకు 3,730 మంది హాజరు

image

తూర్పు గోదావరి జిల్లాలో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా బుధవారం సైన్స్ పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా సైన్స్ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. జిల్లాలో 6,575 మంది విద్యార్థులకు గాను 3,730 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని డీఎస్ ఈఓ వాసుదేవరావు తెలిపారు. 2,840 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పారు.

News May 30, 2024

దీర్ఘకాలిక సెలవుపై కేజీహెచ్ సూపరింటెండెంట్

image

కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో ఇంచార్జ్‌గా కేజీహెచ్ గైనిక్ విభాగానికి చెందిన డాక్టర్ ఐ.వాణీకి బాధ్యతలు అప్పగించారు. డాక్టర్ అశోక్ కుమార్ లైంగికంగా వేధించారంటూ కేజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీఐ భాస్కరరావు తెలిపారు.

News May 30, 2024

వజ్రకరూరులో వజ్రాల వేట

image

అనంతపురం జిల్లాలో చినుకులు పడితే చాలు ప్రజలు వజ్రకరూరు చేలలోకి పరుగులు తీస్తున్నారు. పొలాల్లో దొరికే రాళ్లు, వజ్రాలని అవి వారి తలరాతలు మారుస్తాయని అంటుంటారు. ఏటా జూన్ నుంచి సెప్టెంబరు వరకు వేట సాగిస్తారు. స్థానికులతో పాటు కర్నూలు, కడప, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు బళ్లారి నుంచి కూడా వస్తారు. అయితే ఈ ప్రాంతంలో ఏటా 40 నుంచి 50 వజ్రాలు దొరుకుతాయని స్థానికులు చెబుతున్నారు.

News May 30, 2024

VJA: దారి దోపిడీ కేసులో ఎనిమిది మంది అరెస్ట్

image

సూరాయపాలెంలో ఇటీవల జరిగిన దారిదోపిడీ కేసులో బుధవారం భవానీపురం పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. సీఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నవ్య అనే మహిళను తాడేపల్లికి చెందిన ఎనిమిది మంది యువకులు నగదు కోసం బెదిరించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి కర్రలు, రాడ్లు, పోలీసు టోపీ స్వాధీనం చేసుకున్నామన్నారు.

News May 30, 2024

విజయనగరం జిల్లాలో మరో 7 జూనియర్ కాలేజీలు

image

ఈ విద్యా సంవత్సరం నుంచి విజయనగరం జిల్లాలో ఏడు చోట్ల కొత్తగా కాలేజీలు ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ డీఈవో కేవీ రమణ తెలిపారు. తెట్టంగి, జామి, కోనూరు, బొండపల్లి, రామభద్రపురం, పిరిడి, ఏవీ పురం ఉన్నత పాఠశాలల్లో కళాశాలలు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు ఉంటాయని వెల్లడించారు. విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

News May 30, 2024

వన్డే క్రికెట్ టోర్నీలో కడప, నెల్లూరు జట్లు విజయం

image

చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కేఎస్ఆర్ఎమ్, కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో నిర్వహిస్తున్న ఏసీఏ అంతర్ జిల్లాల సీనియర్ వన్డే క్రికెట్లో బుధవారం నిర్వహించిన మ్యాచ్‌లో కడప, నెల్లూరు జట్లు విజయం సాధించాయి. కడప జట్టు 310 పరుగులు చేయగా, చిత్తూరు 247 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో కడప జట్టు 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో నెల్లూరు జట్టు 8 వికెట్ల తేడాతో కర్నూలు జట్టుపై విజయం సాధించింది.