Andhra Pradesh

News May 30, 2024

వన్డే క్రికెట్ టోర్నీలో కడప, నెల్లూరు జట్లు విజయం

image

చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కేఎస్ఆర్ఎమ్, కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో నిర్వహిస్తున్న ఏసీఏ అంతర్ జిల్లాల సీనియర్ వన్డే క్రికెట్లో బుధవారం నిర్వహించిన మ్యాచ్‌లో కడప, నెల్లూరు జట్లు విజయం సాధించాయి. కడప జట్టు 310 పరుగులు చేయగా, చిత్తూరు 247 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో కడప జట్టు 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో నెల్లూరు జట్టు 8 వికెట్ల తేడాతో కర్నూలు జట్టుపై విజయం సాధించింది.

News May 30, 2024

చివరిగా వెలువడేది ‘కొత్తపేట’ ఫలితం!

image

ఓట్ల లెక్కింపు రోజున ఉమ్మడి తూ.గో జిల్లాలో చివరి ఫలితం కొత్తపేట నియోజకవర్గం నుంచి వెలువడనుంది. 26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ చేపట్టారు. అత్యధిక ఓట్లు నమోదైన కొత్తపేట నియోజకవర్గంలో 262 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో 2,52,383 మంది ఓటర్లకు గాను 2,14,975 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కొత్తపేట నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు మొత్తం 26 రౌండ్లు నిర్ణయించారు.

News May 30, 2024

ఏలూరు: దాడి చేస్తారనే భయంతో సూసైడ్

image

తనపై దాడి చేస్తారనే భయంతో భీమడోలుకు చెందిన జయరాజు మజ్జిగలో పురుగు మందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. జయరాజు ఈనెల 27న కొంతమందితో గొడవపడ్డాడు. అయితే వారు తిరిగి తనపై దాడి చేస్తారనే భయంతో బుధవారం పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

దేవనకొండ: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం దేనవకొండ మండలంలో జరిగింది. జిల్లేడుబుడకలలో కొండమీద లక్ష్మన్న కుమారుడు బోయ హరిచంద్రుడు(42) అప్పుల బాధ తట్టుకోలేక విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి 5 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం కోసం చేసిన అప్పుల తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

News May 30, 2024

యర్రగొండపాలెం ఆర్ఓ సస్పెండ్

image

యర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రీలేఖను తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి మీనా కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 13న జరిగిన పోలింగ్‌లో యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఘర్షణలు జరిగిన సమయంలో, సకాలంలో స్పందించకపోవడంతో ఎన్నికల కమిషన్ వేటు వేసినట్లు తెలిపారు. గురువారం నియోజకవర్గంకు కొత్త ఆర్ఓ ను కలెక్టర్ నియమించనున్నట్లు చెప్పారు.

News May 30, 2024

నెల్లూరు: వేర్వేరు ఘటనల్లో ఈత కొడుతూ ఇద్దరి దుర్మరణం

image

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. విడవలూరు(M) వెంకటనారాయణపురం వాసి మురళీకృష్ణ స్నేహితులతో కలిసి పైడేరువాగు వంతెన వద్ద ఈతకొడుతూ నీటిలో మునిగి మృతిచెందాడు. ఇందుకూరుపేట(M), రాముడుపాలేనికి చెందిన రామయ్య,గీతల కుమార్తె భవ్యశ్రీ(12) నెల్లూరు వెంగళరావునగర్‌లో గల స్విమ్మింగ్‌ఫూల్‌లో ఈతకొడుతూ నీటిలో మునిగిపోయింది. బాలికను సిబ్బంది బయటకుతీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

News May 30, 2024

అల్లూరి: బాణంతో దాడిచేసింది మతిస్థిమితం లేని వ్యక్తి

image

మతి స్థిమితం లేని గిరిజన వ్యక్తి మరో గిరిజనుడిపై <<13338215>>బాణం<<>> వేయగా సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పెడకొండ గ్రామానికి చెందిన కాకూరి బాబ్జీ అనే వ్యక్తి గత కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడు. బుధవారం గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న వంతల సోనీ(53)పై బాణంతో దాడి చేశాడు. ఛాతీపై బాణం దిగబడడంతో సోనీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు ముందు బాబ్జీ దాడిలో బూడిద గుండన్న అనే వ్యక్తి గాయపడ్డాడు.

News May 30, 2024

పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబుల కలకలం

image

పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలో బుధవారం పెట్రోల్ బాంబులు కలకలం రేపాయి. గంగిరెడ్డి రామిరెడ్డి అనే రైతు పొలంలో ఉన్న గడ్డివామిని విక్రయించి.. ట్రాక్టర్‌లో గడ్డిని లోడ్ చేస్తుండగా నాలుగు పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. రైతు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. బెల్లంకొండ ఎస్సై రాజేశ్ సిబ్బందితో అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

నంద్యాల: ఓట్ల లెక్కింపు .. పకడ్బందీ ఏర్పాట్లు

image

జూన్ 4వ తేదీన నిర్వహించే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు నంద్యాల కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి సంబంధించి 75% పూర్తయిందన్నారు. ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News May 30, 2024

శ్రీసత్యసాయి: ఎన్నికల కౌంటింగ్‌పై డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సమీక్ష

image

శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురం, లేపాక్షి మండలాల్లో జరగనున్న ఎన్నికల కౌంటింగ్ సన్నద్ధతపై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సత్యసాయి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.