Andhra Pradesh

News May 29, 2024

బొండపల్లి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

బొండపల్లి మండలం నెలివాడ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆగి ఉన్న ఆటోని ఒడిశా లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో పలువురు గాయపడగా చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. వారిలో విశాఖకు చెందిన డెంకాడ సూరిబాబు (45) బుధవారం మృతిచెందినట్లు బొండపల్లి ఎస్సై కె.లక్ష్మణరావు తెలిపారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశామన్నారు.

News May 29, 2024

కృష్ణా: బీటెక్ పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన బీటెక్ ఎనిమిదవ, బీటెక్ ఏడవ సెమిస్టర్(స్పెషల్) పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News May 29, 2024

సాంకేతిక లోపంతో ఆగిన రేపల్లె ఎక్స్ ప్రెస్

image

సాంకేతిక లోపంతో సికింద్రాబాద్- రేపల్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు బుధవారం గుంటూరు బైపాస్ వద్ద నిలిచిపోయింది. రైలు వెళ్తున్న సమయంలో పెద్ద శబ్దం వచ్చి నిప్పురవ్వలు ఎగిసి పడటంతో ప్రయాణికులు భయపడ్డారు. దీంతో చైన్ లాగి రైలును నిలిపి వేశారు. గంటకు పైగా రైలు అక్కడే ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 29, 2024

కృష్ణా: రేపు పాలీసెట్ కౌన్సిలింగ్ జరిగే ర్యాంకుల వివరాలు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి రేపు గురువారం పాలీసెట్-2024లో 43,001- 59,000 వరకు ర్యాంక్‌లు పొందినవారికి సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. పైన తెలిపిన ర్యాంకులు పొందిన విద్యార్థులు విజయవాడలోని మూడు హెల్ప్‌లైన్ కేంద్రాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ర్యాంక్, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం జూన్ 7 సీట్లు కేటాయిస్తామని వారు స్పష్టం చేశారు.

News May 29, 2024

నంద్యాల: ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు

image

ప్రతి హాల్ కు 14 టేబుళ్లు చొప్పున రౌండ్ల వారిగా అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలను వెల్లడిస్తామని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లీకి 74, పార్లమెంటుకు 75 టేబుళ్లు, పోస్టల్ ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లీకి 21, పార్లమెంటుకు 17 టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేశామన్నారు. 12 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. అసెంబ్లీ, పార్లమెంట్ వారీగా ఉంటాయన్నారు.

News May 29, 2024

ప.గో.: 60 మందిపై కేసులు: DSP

image

ప.గో. జిల్లా పెంటపాడు మండలం రావిపాడులో పోలీసులపై జరిగిన దాడి ఘటనలో 60 మందిపై కేసులు నమోదు చేసినట్లు తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి తెలిపారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దాడిలో ఒక SI, నలుగురు కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయపడ్డారన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు 60 మందిపై కేసులు పెట్టామని, ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. CI రమేశ్ ఉన్నారు.

News May 29, 2024

తూ.గో.: ఖైదీలకు VIDEO CALL సదుపాయం

image

ఖైదీల సంక్షేమంలో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో బుధవారం నుండి ఈ-ములాఖత్
వీడియో కాలింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కారాగార పర్యవేక్షణాధికారి రాహుల్ దీనిని ప్రారంభించారు. ఇప్పటివరకు జైలులో ఉన్న ఖైదీలతో ములాఖత్‌కు వచ్చిన వారు మాత్రమే మాట్లాడేవారు. కొత్తగా ఏర్పాటుచేసిన ఈ సదుపాయం వల్ల ఖైదీలు.. ఎక్కడెక్కడో ఉన్న తమ కుటుంబీకులందరినీ ఒకేసారి వీడియోలో చూస్తూ మాట్లాడవచ్చని తెలిపారు.

News May 29, 2024

శ్రీకాకుళం: అంతర్ కళాశాలల క్రాస్ వర్డ్ పజిల్ పోటీలు

image

ఆన్‌లైన్ విధానంలో అంతర్ కళాశాలల క్రాస్ వర్డ్ పజిల్ పోటీలను కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు https://nice.crypticsingh.com/ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కోరుతూ ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన వారితో జోనల్, జాతీయ స్థాయిలో పోటీలను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ తెలిపింది.

News May 29, 2024

శ్రీకాకుళం: బత్తిలి- భీమవరం బస్సు సర్వీసులను ఆదరించండి

image

ప్రయాణికుల సౌకర్యార్థం బత్తిలి నుంచి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు ప్రతిరోజూ 2 సూపర్ లగ్జరీ బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం 5, 6 గంటలకు ఈ బస్సులు బత్తిలిలో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 06.35, 07.35 గంటలకు భీమవరం చేరుకుంటాయని, ప్రయాణికులు ఈ సర్వీసులను ఆదరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

News May 29, 2024

కువైట్‌లో పీలేరు వాసి మృతి

image

బతుకుదెరువు కోసం కువైట్‌కి వెళ్లిన ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసి అక్కడే మృతిచెందారు. పీలేరు పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన షేక్షావలి కువైట్ వెళ్లారు. అక్కడ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతూ అక్కడ మృతిచెందారు. అతని మృతదేహాన్ని పీలేరుకు బుధవారం తీసుకొచ్చారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.