Andhra Pradesh

News May 29, 2024

కృష్ణా: అంతర్ కళాశాలల క్రాస్‌వర్డ్ పజిల్ పోటీలు

image

ఆన్‌లైన్ విధానంలో అంతర్ కళాశాలల క్రాస్‌వర్డ్ పజిల్ పోటీలను కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు https://nice.crypticsingh.com/ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కోరుతూ.. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన వారితో జోనల్, జాతీయ స్థాయిలో పోటీలను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ తెలిపింది.

News May 29, 2024

అవినాష్ రెడ్డి బండి భలే ఉంది: టీడీపీ

image

ఇటీవల కాలంలో ఎమ్మెల్యే తాలుకా అంటూ పలువురు వాహనాల నంబర్ ప్లేట్లను తయారు చేసి వైరల్ చేస్తున్నారు. ఈక్రమంలో ‘బాబాయిని లేపినోడి తాలూకా’ అని ఉన్న ఓ ప్లేట్‌ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఇదే ఫొటోను టీడీపీ X(ట్విటర్)లో పోస్ట్ చేసింది. దానికి ‘అవినాష్ రెడ్డి బండి భలే ఉంది’ అంటూ కామెంట్ చేసింది.

News May 29, 2024

ముగిసిన కల్యాణ వేంకన్న వసంతోత్సవాలు

image

శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వసంతోత్సవాలు బుధవారం ముగిశాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం వేంకటేశ్వర స్వామి, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుని ఉత్సవమూర్తులను వసంత మండపంలోకి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.

News May 29, 2024

జొన్నవాడ: కొడిముద్ద తింటే సంతానం కలిగినట్టే..!

image

నెల్లూరు జిల్లా జొన్నవాడ కామాక్షమ్మ కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారు దేవతగా పేరు పొందారు. అమ్మను దర్శిస్తే అన్ని కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. సంతానం కోసం పూజలు చేసి అమ్మవారిని దర్శిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అమ్మవారి ఆలయంలో ఇచ్చే కొడి ముద్దలు స్వీకరించడానికి సంతానం లేని జంటలు ఇక్కడ పోటీ పడుతుంటారు. ప్రస్తుతం అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

News May 29, 2024

తూ.గో.: 28, 29వ తేదీల్లో కౌన్సెలింగ్

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని డా.బీ.ఆర్.అంబేడ్కర్ గురుకుల బాలుర, బాలికల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి మొదటి, 2వ విడత ప్రవేశాల అనంతరం మిగిలి ఉన్న సీట్లకు ఈ నెల 28, 29 తేదీలలో కాకినాడ రూరల్ మండలం పి.వెంకటాపురంలో గల డా.బీఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించినట్లు సంస్థ జిల్లా సమన్వయాధికారి జి.వెంకటరావు తెలిపారు.

News May 29, 2024

NTR: జిల్లాలో దారుణం.. కన్నతల్లిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

image

ఏ.కొండూరు మండలం వాళ్లంపట్ల గ్రామంలో తల్లిని కన్న కొడుకు బుధవారం గొడ్డలితో నరికి చంపాడు. పోలీసుల వివరాలు ప్రకారం.. బుజ్జమ్మ(65)ను మద్యం మత్తులో కిరాతకంగా కొడుకు వెంకటేశ్వరరావు బుధవారం సాయంత్రం హత్య చేశాడన్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్ల కృష్ణా తెలిపారు.

News May 29, 2024

పలాస: విశాఖ-పలాస రైళ్లు రద్దు

image

పలాస-విశాఖ-పలాస పాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఈనెల 31న పలాస నుంచి విశాఖ వెళ్లే పాసింజర్ రైలును, విశాఖ నుంచి పలాస వచ్చే పాసింజర్ రైలును రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News May 29, 2024

ఏలూరు: ACCIDENT.. వ్యక్తి మృతి

image

ఏలూరు జిల్లా తాళ్ళపూడిలో మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందినట్లు SI శ్యాంసుందర్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చిడిపి గ్రామానికి చెందిన బండారు శ్రీనివాస్, స్నేహితుడు లక్ష్మణ్‌తో కలిసి సురయ్యపేట వైపు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. లక్ష్మణ్‌కు తీవ్రగాయాలు కావడంతో రాజమండ్రి ఆస్పత్రికి తరలించామన్నారు.

News May 29, 2024

కందుకూరు: పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

image

గుర్తు తెలియని వ్యక్తి పురుగు ముందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం కందుకూరు పట్టణ శివారు ధూబగుంట ప్రాంతంలోని వైఎస్సార్ కాలనీలో వెలుగు చూసింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని కేసు నమో చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 29, 2024

రామతీర్థానికి హుండీల ద్వారా వచ్చిన ఆదాయం

image

రామతీర్థం దేవస్థానానికి హుండీల ద్వారా రూ.27.36 లక్షలు ఆదాయం వచ్చినట్లు దేవాదాయశాఖ అధికారిణి పీవీ.లక్ష్మి తెలిపారు. ఆమె పర్యవేక్షణలో గురువారం హుండీలు లెక్కించారు. మార్చి 11 నుంచి మే నెల 28 వరకు గల ఆదాయాన్ని లెక్కించినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వాహణ అధికారి వై.శ్రీనివాసరావు వెల్లడించారు.