Andhra Pradesh

News May 29, 2024

అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష

image

దీల్లీ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ఎన్నికల కౌంటింగ్, భద్రతా ఏర్పాట్లపై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డా.జి.సృజన, ఎస్పీ జి.కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, తదితరులు పాల్గొన్నారు.

News May 29, 2024

జంగారెడ్డిగూడెం: మహిళతో రాసలీలలు.. డిస్మిస్

image

జంగారెడ్డిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ మహేష్ రెడ్డిని శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఏఈ రాధాకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. 29వ తేదీ ఉదయం 3 గంటల సమయంలో విద్యుత్ అంతరాయం కలిగిందని స్థానికులు కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ మద్యం మత్తులో స్పృహ లేకుండా మహిళతో ఉన్నట్లు రుజువు కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

News May 29, 2024

చింతపల్లిలో బాణంతో దాడి.. వ్యక్తి మృతి

image

చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ పెడకొండలో బాణం తగిలి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. బుధవారం గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న వంతాల సోనిపై కాకరి బాబ్జీ బాణంతో దాడి చేశాడు. అది గుండెల్లో దిగడంతో సోని అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు. నిందితుడు స్థానికుల నుంచి తప్పించుకొని పరారయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 29, 2024

అలనాటి వైభవానికి సాక్షి.. తెనాలిలోని శంకరమఠం

image

జగద్గురు ఆదిశంకరాచార్యులు పేరిట తెనాలి రామలింగేశ్వరపేటలోనూ శంకర మఠం ఏర్పాటైంది. దేవీచౌక్‌లోని చినరావూరు పార్కు రోడ్డులో కుడిపక్క 10 సెంట్ల విస్తీర్ణంలో ఈ మఠం విస్తరించి ఉంది. మఠం వ్యవస్థాపకురాలు వేల­మూరి లింగమ్మ కాషాయధారి.  ఎవ­రొచ్చినా మ­ఠం­లోనే బస చేసేవారు. అప్పట్లో ఇక్కడ హోమా­లు, యజ్ఞాలతో పాటు మాఘ మా­సంలో ముద్దపప్పు సప్తాహాలు నిర్వహించే­వారు. 50 ఏళ్ల క్రితం వరకూ ఈ సప్తాహాలు జరిగేవి.

News May 29, 2024

విశాఖ: ఐదేళ్లలో రాష్ట్రంలో భూదోపిడీ పెరిగింది.. లంకా దినకర్

image

గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో భూదోపిడీ బాగా పెరిగిందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. బుధవారం విశాఖ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ, వైసీపీ నాయకుల ప్రోద్బలంతో భూకబ్జాలు జరిగాయన్నారు. బెదిరించి తక్కువ ధరకు లాగేసుకోవడం, డీ పట్టా భూములు సొంతం చేసుకోవడంతో పాటు అక్రమ డెవలప్మెంట్ అగ్రిమెంట్ల ద్వారా దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు.

News May 29, 2024

కడప: యాసిడ్ తాగి యువతి ఆత్మహత్యాయత్నం

image

జిల్లాలోని అట్లూరులో నివాసముంటున్న యువతి(22) యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు అంబులెన్స్‌కి సమాచారం ఇవ్వటంతో వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News May 29, 2024

బాపట్ల: గల్లంతైన యువకుల వివరాల గుర్తింపు

image

బాపట్ల మండలం యార <<13337176>>కాలువలో గల్లంతైన<<>> వారు హైదరాబాద్ కూకట్‌పల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరు ఉదయం బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలో గడిపి తిరుగు ప్రయాణంలో యార కాలువ నందు ఈతకు దిగి గల్లంతయ్యారు. మొత్తం ఆరుగురు కాలువలో దిగగా సన్నీ, సునీల్, కిరణ్, నందు అనే నలుగురు యువకులు గల్లంతయ్యారు. పోలీసులు పడవల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.

News May 29, 2024

గొడవలు జరగకుండా ప్రత్యేక చర్యలు: ఎస్పీ

image

ఓట్ల లెక్కింపు రోజున జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునిల్ తెలిపారు. బుధవారం కనిగిరిలో రాజకీయ నాయకులు, ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో కౌంటింగ్ తర్వాత ఎటువంటి గొడవలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాలలో బాణసంచా కాల్చడం, డ్రోన్ ఎగురవేయడం చేయరాదని స్పష్టం చేశారు.

News May 29, 2024

గూడూరు: తమ్ముడిని చంపిన అన్న

image

గూడూరు మండలం చంబడిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు దాడి చేసుకునే క్రమంలో అడ్డువచ్చిన తమ్ముడు పురిణి అశోక్‌ను అన్న క్షణికావేశంలో కర్రతో కొట్టాడు. దాడిలో గాయపడిన తమ్ముడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న గూడూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 29, 2024

శ్రీకాకుళం: ప్రజానీకానికి SP రాధిక కీలక హెచ్చరికలు

image

జూన్ 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి రానుందని జిల్లా ఎస్పీ రాధిక తెలిపారు. ఈ మేరకు ఆమె తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ చట్ట ప్రకారం మైనర్లు వాహనాలు నడిపితే రూ.25,000 జరిమానా, మద్యం సేవించి వాహనాన్ని నడిపితే 6 నెలల జైలు, రూ.10,000 ఫైన్ విధిస్తామన్నారు. మైనర్లయిన పిల్లలకు వాహనాలను ఇస్తే కొత్త నిబంధనలు మేరకు తల్లిదండ్రులకు శిక్ష తప్పదని, ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.