Andhra Pradesh

News May 29, 2024

శ్రీకాకుళం: ఓట్లు లెక్కింపు ప్రక్రియపై శిక్షణ

image

జూన్ 4వ తేదీన జరుగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఓట్లు లెక్కింపు ప్రక్రియపై సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్‌లకు శిక్షణ ఇచ్చారు . పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్లు ఓట్లు లెక్కింపు ఎలా చేయాలన్న దానిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. దీనికి సంబంధించి మాక్ డ్రిల్ జూన్ 3వ తేదీన ఉంటుందని తెలిపారు.

News May 29, 2024

మచిలీపట్నం: లాడ్జీలలో ఎస్పీ అద్నాన్ ఆకస్మిక తనిఖీలు

image

ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మచిలీపట్నంలోని పలు లాడ్జ్‌లలో తనిఖీలు చేపట్టారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో అనుమానిత వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు గాను ఆయన ఆ తనిఖీలు చేస్తున్నామని తెలపారు. లాడ్జ్‌లలో ఉంటున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానితులపై పోలీసు నిఘా నిరంతరం ఉంటుందన్నారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తదితరులు ఉన్నారు.

News May 29, 2024

కృష్ణా: ‘పొరపాట్లకు అస్కారం లేకుండా పోస్టల్ ఓట్ల లెక్కింపు’

image

పొరపాట్లకు అవకాశం లేకుండా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును సక్రమంగా చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై అవగాహన కల్పించారు. కృష్ణా వర్సిటీలో జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్, తర్వాత EVM ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.

News May 29, 2024

గుంటూరు: పాలిసెట్ అడ్మిషన్ల ప్రక్రియలో మార్పులు

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ఉన్నందున జూన్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు 144 సెక్షన్ విధింపు కారణంగా.. గుంటూరు జిల్లాలో పాలిసెట్-2024 అడ్మిషన్ల ప్రక్రియలో మార్పులు చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు బుధవారం సవరణ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. జూన్ 3న జరగాల్సిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 6న నిర్వహిస్తామని పేర్కొన్నారు.

News May 29, 2024

ఒంగోలు: ఉద్యోగం ఇప్పిస్తానని రూ.10 లక్షల మోసం

image

తన భర్తకు ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ప్రధానోపాధ్యాయుడికి రూ.10లక్షలు ఇచ్చి మోసపోయినట్టు సంధ్యలత అనే మహిళ మీడియా ముందు వాపోయారు. కనిగిరికి చెందిన విజయభాస్కర్‌ రెడ్డి అనే వ్యక్తి కుంచనపల్లి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారని, ఒంగోలులో తన ఇంటి పక్కన వారి ద్వారా పరిచయమయ్యారని చెప్పారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.

News May 29, 2024

కడప నుంచి విమానాల రాకపోకల వివరాలు

image

కడప నుంచి విమానాల రాకపోకల వివరాలు ఈ విధంగా ఉన్నట్లు ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్ శివప్రసాద్‌ తెలిపారు. 
✈ కడప-హైదరాబాద్‌: ప్రతిరోజు
✈ కడప-విజయవాడ-కడప: సోమ, బుధ, శుక్ర, ఆదివారం
✈ చెన్నై-కడప-చెన్నై: సోమ, బుధ, శుక్ర, ఆదివారం
✈ బెంగళూరు-కడప-బెంగళూరు: మంగళ, గురు, శనివారం 
✈ కడప-విశాఖపట్నం-కడప: మంగళ, గురు, శనివారం

News May 29, 2024

అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష

image

దీల్లీ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ఎన్నికల కౌంటింగ్, భద్రతా ఏర్పాట్లపై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డా.జి.సృజన, ఎస్పీ జి.కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, తదితరులు పాల్గొన్నారు.

News May 29, 2024

జంగారెడ్డిగూడెం: మహిళతో రాసలీలలు.. డిస్మిస్

image

జంగారెడ్డిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ మహేష్ రెడ్డిని శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఏఈ రాధాకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. 29వ తేదీ ఉదయం 3 గంటల సమయంలో విద్యుత్ అంతరాయం కలిగిందని స్థానికులు కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ మద్యం మత్తులో స్పృహ లేకుండా మహిళతో ఉన్నట్లు రుజువు కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

News May 29, 2024

చింతపల్లిలో బాణంతో దాడి.. వ్యక్తి మృతి

image

చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ పెడకొండలో బాణం తగిలి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. బుధవారం గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న వంతాల సోనిపై కాకరి బాబ్జీ బాణంతో దాడి చేశాడు. అది గుండెల్లో దిగడంతో సోని అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు. నిందితుడు స్థానికుల నుంచి తప్పించుకొని పరారయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 29, 2024

అలనాటి వైభవానికి సాక్షి.. తెనాలిలోని శంకరమఠం

image

జగద్గురు ఆదిశంకరాచార్యులు పేరిట తెనాలి రామలింగేశ్వరపేటలోనూ శంకర మఠం ఏర్పాటైంది. దేవీచౌక్‌లోని చినరావూరు పార్కు రోడ్డులో కుడిపక్క 10 సెంట్ల విస్తీర్ణంలో ఈ మఠం విస్తరించి ఉంది. మఠం వ్యవస్థాపకురాలు వేల­మూరి లింగమ్మ కాషాయధారి.  ఎవ­రొచ్చినా మ­ఠం­లోనే బస చేసేవారు. అప్పట్లో ఇక్కడ హోమా­లు, యజ్ఞాలతో పాటు మాఘ మా­సంలో ముద్దపప్పు సప్తాహాలు నిర్వహించే­వారు. 50 ఏళ్ల క్రితం వరకూ ఈ సప్తాహాలు జరిగేవి.