Andhra Pradesh

News May 29, 2024

విజయనగరంలో ఎవరికి ఎక్కువ సీట్లు.. మీ కామెంట్?

image

ఇంకో ఐదు రోజుల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఈ తరుణంలో విజయావకాశాలపై ఎరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిది స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ఇటీవల బొత్స సత్యన్నారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో గెలుస్తామని నిన్న తిరుపతిలో కోలగట్ల అన్నారు. మరి విజయనగరంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.

News May 29, 2024

చార్‌ధామ్ యాత్రలో అనంతపురం వాసి మృతి

image

అనంతపురానికి చెందిన హనుమంతకారి సురేశ్ రావు బుధవారం తెల్లవారుజామున గంగోత్రిలో అనారోగ్యంతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. 12 రోజులుగా ఆయన చార్‌ధామ్ యాత్రలో ఉన్నారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థకు గురి కావడంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గంగోత్రిలోనే హనుమంతకారి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న కుటుంబీకులు తెలిపారు.

News May 29, 2024

అత్తిలి: రైల్వే గేటు మూసివేత

image

అత్తిలి మండలం పరిధిలోని గవర్లపాలెం రైల్వే గేటు వద్ద రాకపోకలు ఈనెల 31వరకు నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతుల నిమిత్తం రైల్వే గేటు మూసివేస్తున్నట్లు చెప్పారు. బుధవారం నుంచి 31సాయంత్రం 7 గంటల వరకు రాకపోకలు నిలిపివేస్తున్నామన్నారు. వాహనదారులు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని కోరారు.

News May 29, 2024

YSR పాపాలే.. చనిపోవడానికి కారణం: బీటెక్ రవి

image

మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డిపై పులివెందుల TDP MLA అభ్యర్థి బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రాజశేఖర్ రెడ్డి సీఎం అవడం కోసం పులివెందులలో కొన్ని తప్పులు చేశారు. ఆ తప్పుల వలనే ప్రకృతి కూడా పసిగట్టి హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. సీఎం అయ్యాక YSR మారినారన్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రారని అన్నారు.

News May 29, 2024

బాపట్ల: నలుగురు యువకులు గల్లంతు

image

బాపట్ల రూరల్ పరిధిలోని నాగరాజు కాలువలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. స్థానికులు సమాచారం మేరకు.. హైదరాబాద్ నుంచి సూర్యలంక తీరానికి వచ్చిన యువకులు బాపట్ల అప్పికట్ల రహదారిలో ఉన్న యార కాలువలో ఈత కోసం దిగారు. లోతు ఎక్కువ ఉండటంతో గల్లంతు అయినట్లు స్థానికులు చెబుతున్నారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, గాలింపు చర్యలు చేపట్టారు.

News May 29, 2024

విశాఖ: ఫోన్ చూడొద్దన్నందుకు బాలిక సూసైడ్

image

విశాఖ వాంబే కాలనీలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ఫోన్ చూడొద్దని తల్లి మందలించడంతో ఓ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మరణించడంతో తల్లితో కలిసి బాలిక(15) వాంబే కాలనీలో నివాసం ఉంటుంది. బాలికను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు.

News May 29, 2024

మరో 6 రోజులే.. శ్రీకాకుళంలో ఆధిపత్యం ఎవరిది.?

image

సార్వత్రిక ఓట్ల లెక్కింపు తేదీ జూన్ 4 వచ్చేస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. ఫలితాలకు మరో 6 రోజులే ఉంది. ఓ వైపు ఉత్కంఠ నెలకొనగా, మరోవైపు బెట్టింగులు జోరందుకున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో YCP 8 అసెంబ్లీ, టీడీపీ 1 MP, 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోన్నాయి. ఇరుపార్టీల నేతలు గెలుపుపై ధీమాగా ఉండగా, ఏ పార్టీది ఆధిపత్యం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News May 29, 2024

జూన్ 3న మంగళగిరికి పవన్ కళ్యాణ్ 

image

జూన్ 3న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అంతా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పవన్ పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ ముగిసే వరకు కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పవన్ పిలుపునిచ్చారు.

News May 29, 2024

సింహాచలంలో నేత్ర పర్వంగా అప్పన్న నిత్య కల్యాణం

image

సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండ పంలో అధిష్టింపజేశారు. పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.

News May 29, 2024

వెంకటాచలం: అటువైపు వెళ్లే వారు జాగ్రత్త

image

తిక్కవరప్పాడు-కంటేపల్లి మార్గంలో తిక్కవరప్పాడు బ్రాంచ్ కెనాల్‌పై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. నిత్యం పలు గ్రామాల రైతులు, ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. అయితే ఈ మార్గంలో నిర్మించిన కల్వర్టు శిథిలమై సగంపైగా కూలిపోవడంతో బైకులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. అదుపుతప్పితే ప్రమాదం జరిగేలా ఉంది. సంబంధిత అధికారులు స్పందించి కల్వర్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.