Andhra Pradesh

News May 29, 2024

జూన్ 3న మంగళగిరికి పవన్ కళ్యాణ్ 

image

జూన్ 3న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అంతా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పవన్ పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ ముగిసే వరకు కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పవన్ పిలుపునిచ్చారు.

News May 29, 2024

సింహాచలంలో నేత్ర పర్వంగా అప్పన్న నిత్య కల్యాణం

image

సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండ పంలో అధిష్టింపజేశారు. పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.

News May 29, 2024

వెంకటాచలం: అటువైపు వెళ్లే వారు జాగ్రత్త

image

తిక్కవరప్పాడు-కంటేపల్లి మార్గంలో తిక్కవరప్పాడు బ్రాంచ్ కెనాల్‌పై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. నిత్యం పలు గ్రామాల రైతులు, ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. అయితే ఈ మార్గంలో నిర్మించిన కల్వర్టు శిథిలమై సగంపైగా కూలిపోవడంతో బైకులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. అదుపుతప్పితే ప్రమాదం జరిగేలా ఉంది. సంబంధిత అధికారులు స్పందించి కల్వర్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News May 29, 2024

మైదుకూరు: మిస్ ఆంధ్రప్రదేశ్ రన్నర్‌గా గాయత్రిరెడ్డి

image

మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేట మండలం తవ్వారుపల్లి గ్రామానికి చెందిన హోంగార్డ్ చంద్రమోహన్ రెడ్డి కుమార్తె గాయత్రి రెడ్డి మిస్ ఆంధ్రప్రదేశ్ రన్నర్‌గా ఎంపికైంది. ఈ సందర్భంగా బుధవారం మండల ప్రజలు, చంద్రమోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. గాయత్రిరెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

News May 29, 2024

కర్నూలు: 27,998 ఆరోగ్య శ్రీ కేసులతో ప్రథమ స్థానం

image

కర్నూలు సర్వజన వైద్యశాలలో గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది మే వరకు 27,998 ఆరోగ్యశ్రీ కింద కేసులు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటరంగారెడ్డి తెలిపారు. ఆస్పత్రిలోని ధన్వంతరీ హాలులో అన్ని విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సుమారు రూ.2 కోట్ల విలువైన ఆధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

News May 29, 2024

కర్నూలు: 19 లక్షల పత్తి విత్తన ప్యాకెట్ల సరఫరాకు చర్యలు

image

కర్నూలు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 2.50 లక్షల హెక్టార్లకుపైగా పత్తి సాగయ్యే అవకాశాలున్నాయి. 450 గ్రాముల విత్తన ప్యాకెట్లు హెక్టార్ కు 8 అవసరం కాగా, జిల్లాలో సాగుకు సంబంధించి 20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరం ఉంది. జిల్లాకు 16 పత్తి విత్తన కంపెనీలు 19 లక్షల విత్తన ప్యాకెట్లను సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు నివేదించాయి.

News May 29, 2024

వ్యభిచారం కేసులో రావులపాలెం మహిళ అరెస్ట్

image

వ్యభిచారం కేసులో రావులపాలేనికి చెందిన ఓ మహిళను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నాగోలు శ్రీసాయి నగర్ కాలనీలోని ఓ భవనంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు మంగళవారం నాగోలు పోలీసులు దాడి చేశారు. ఇందులో వ్యభిచార గృహం నిర్వాహకురాలు కోనసీమ జిల్లా రావులపాలేనికి చెందిన కృష్ణవేణి (29)తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. అందులో బాధిత యువతిని సంరక్షణ గృహానికి తరలించామని పోలీసులు తెలిపారు.

News May 29, 2024

కౌంటింగ్ రోజు ప్రకాశం జిల్లాలో ఆంక్షలు

image

జూన్ 4న జిల్లాలో పలు ఆంక్షలు విధించనున్నట్లు SP గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజున ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించి, జాతీయ రహదారిపై ఒకే మార్గంలో రాకపోకలు వచ్చేలా చేస్తామన్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో బాణసంచా కాల్చడం, డ్రోన్ ఎగరవేడయం చేయరాదన్నారు. మద్యం విక్రయించకుండా చేయడంతో పాటు, కేంద్రంలోకి వచ్చే వారికి బ్రీత్ అనలైజ్ పరీక్షీంచనున్నట్లు తెలిపారు.

News May 29, 2024

చిత్తూరు నియోజకవర్గానికి 14 టేబుళ్లు

image

చిత్తూరు నియోజకవర్గంలో ఈవీఎంలో పోలైన ఓట్ల లెక్కింపుకు 14 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు 3 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు జేసి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. జూన్ 4 వ తేదిన ఉదయం 6 గంటలకల్లా ఏజెంట్లు ఎస్వి సెట్ కళాశాల వద్దకు చేరుకోవాలని సూచించారు.

News May 29, 2024

శ్రీకాకుళం: ఇటీవల ఎన్నికల్లో నోటాకు పడిన ఓట్లు ఇవే

image

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నోటాకు పడిన ఓట్లు గణనీయంగా పెరుగుతూ వస్తుంది.నియోజకవర్గం 2014 – 2019 ఇచ్ఛాపురం 845 – 3,880 పలాస 728 – 3,044 టెక్కలి 871 – 2,935 పాతపట్నం 998 – 4,217 శ్రీకాకుళం 875 – 3,082 ఆమదాలవలస 586 – 2,656 ఎచ్చెర్ల 854 – 4,628 నరసన్నపేట 819 – 3,491 మొత్తం 6,576 – 27,993.