Andhra Pradesh

News May 29, 2024

కౌంటింగ్ రోజు ప్రకాశం జిల్లాలో ఆంక్షలు

image

జూన్ 4న జిల్లాలో పలు ఆంక్షలు విధించనున్నట్లు SP గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజున ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించి, జాతీయ రహదారిపై ఒకే మార్గంలో రాకపోకలు వచ్చేలా చేస్తామన్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో బాణసంచా కాల్చడం, డ్రోన్ ఎగరవేడయం చేయరాదన్నారు. మద్యం విక్రయించకుండా చేయడంతో పాటు, కేంద్రంలోకి వచ్చే వారికి బ్రీత్ అనలైజ్ పరీక్షీంచనున్నట్లు తెలిపారు.

News May 29, 2024

చిత్తూరు నియోజకవర్గానికి 14 టేబుళ్లు

image

చిత్తూరు నియోజకవర్గంలో ఈవీఎంలో పోలైన ఓట్ల లెక్కింపుకు 14 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు 3 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు జేసి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. జూన్ 4 వ తేదిన ఉదయం 6 గంటలకల్లా ఏజెంట్లు ఎస్వి సెట్ కళాశాల వద్దకు చేరుకోవాలని సూచించారు.

News May 29, 2024

శ్రీకాకుళం: ఇటీవల ఎన్నికల్లో నోటాకు పడిన ఓట్లు ఇవే

image

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నోటాకు పడిన ఓట్లు గణనీయంగా పెరుగుతూ వస్తుంది.నియోజకవర్గం 2014 – 2019 ఇచ్ఛాపురం 845 – 3,880 పలాస 728 – 3,044 టెక్కలి 871 – 2,935 పాతపట్నం 998 – 4,217 శ్రీకాకుళం 875 – 3,082 ఆమదాలవలస 586 – 2,656 ఎచ్చెర్ల 854 – 4,628 నరసన్నపేట 819 – 3,491 మొత్తం 6,576 – 27,993.

News May 29, 2024

గుంటూరు: జాతీయ సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు జిల్లా క్రీడాకారులు

image

జాతీయ సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు గుంటూరు జిల్లాకు చెందిన ఎస్.చరణ్, హాసిని ఎంపికయ్యారని జిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గంగాధరరావు, కడియం జయరావు మంగళవారం పేర్కొన్నారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 2 వరకు పంజాబ్‌లో జరగనున్న జాతీయ పోటీల్లో వీరిద్దరూ పాల్గొంటారన్నారు. ఈనెల 15 నుంచి 17వరకు విజయవాడలో జరిగిన రాష్ట్ర పోటీల్లో చూపిన ప్రతిభ ఆధారంగా వీరి ఎంపిక జరిగిందన్నారు.

News May 29, 2024

కుప్పం: బంగినపల్లి టన్ను రూ.50 వేలు

image

మామిడి పండ్లకు మార్కెట్ లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ ఏడాది మామిడి దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కుప్పం ప్రాంతంలో వేల ఎకరాలలో బంగినపల్లి, తోతాపురి, నీలం, చందూరా తదితర రకాల మామిడికాయలు సాగు చేస్తున్నారు. బంగినపల్లి టన్ను 42 వేల నుంచి 50 వేలు, చందూరా రకం 30 వేల నుంచి 40 వేలు వరకు ధర పలుకుతోంది. క్రిమి సంహారక మందుల ఖర్చు కూడా రావడం లేదని రైతులు అంటున్నారు.

News May 29, 2024

VZM:రూ.91,795 ఈ-చలనాలు విధింపు

image

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఎం.దీపిక పాటిల్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, సిబ్బంది గడచిన 24 గంటల్లో విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. మోటార్ వెహికల్ నిబంధనలు అతిక్రమించిన 287 మందికి రూ.91,795 ఈ-చలానాలను విధించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 11 కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై నమోదు చేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం తెలిపింది.

News May 29, 2024

విజయవాడ: అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కమిషనర్!

image

విజయవాడలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ముగ్గురు అధికారులకు విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొగల్రాజపురంలో కలుషిత నీరు వలన ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్న స్థానికుల ఫిర్యాదుల మేరకు, నీటిని పరీక్షల కోసం అధికారులు గుంటూరు ల్యాబ్స్‌కి పంపించారు. ల్యాబ్ ఫలితాల అనంతరం మీడియాకు వివరాలు వెల్లడిస్తామన్నారు.

News May 29, 2024

తూ.గో జిల్లాలో విస్తృతంగా కార్డెన్ సెర్చ్

image

తూ.గో జిల్లాలో గత పది రోజులుగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు విస్తృతంగా జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ పి.జగదీశ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో మంగళవారం నంబర్లు, రికార్డులులేని 498 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 105 లీటర్ల సారా, 42 మద్యం సీసాలు, రూ.10,950 విలువైన మందుగుండు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ ప్రతి రోజూ ఈ ఆపరేషన్ నిర్వహిస్తామన్నారు.

News May 29, 2024

నేషనల్ టీం బాస్కెట్ బాల్ శిక్షణకు అనంత కుర్రాడు

image

అనంతపురానికి చెందిన ద్వారకానాథ రెడ్డి ఇండోర్‌లో జూన్ 6 నుంచి జులై 6 వరకు జరిగే భారత జూనియర్ బాస్కెట్ బాల్ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యాడు. ఈ శిబిరంలో మంచి ఆట తీరును ప్రదర్శిస్తే దక్షిణాసియా జూనియర్ బాస్కెట్ బాల్ పోటీలకు భారత జట్టుకు ఎంపిక చేస్తారు. ఇటీవల జరిగిన అండర్-18 జాతీయస్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను ఈ శిబిరానికి ఎంపిక చేసినట్లు జిల్లా బాస్కెట్ బాల్ కార్యదర్శి నరేంద్ర చౌదరి తెలిపారు.

News May 29, 2024

కే‌జీహెచ్ సూపరింటెండెంట్‌పై ఫిర్యాదు

image

కేజీహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తనను లైంగికంగా వేధించినట్లు ఇటీవల సరండర్ అయిన ఓ గ్రేడ్-1 నర్సింగ్ సూపరింటెండెంట్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2023 జనవరి నుంచి అశోక్ కుమార్ తనను లైంగికంగా వేధింపులకు గురి చేశారని, కులం పేరుతో దూషించారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై వన్ టౌన్ పోలీసులను వివరణ కోరగా ఫిర్యాదు అందినట్లు తెలిపారు.