Andhra Pradesh

News September 11, 2025

చట్ట వ్యతిరేక శక్తులపై ఎస్పీ సీరియస్

image

పోలీసులపై దాడి చేసిన ఘటనను ఎస్పీ నరసింహ కిషోర్ సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లాలో చట్ట వ్యతిరేక శక్తులను అరికట్టేందుకు 28 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దాడి జరిగిన తర్వాత జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రికార్డులు సరిగా లేని 90 వాహనాలపై కేసులు నమోదు చేశారు. 23 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 110 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదయ్యాయి.

News September 10, 2025

డ్రాపౌట్స్ రహిత బడులుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

డ్రాపౌట్స్ రహిత బడులుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం సమగ్ర శిక్ష APC మద్దిపట్ల వెంకటరమణతో కలిసి MEO, CRC హెచ్ఎంలతో రివ్యూ నిర్వహించారు. పాఠశాల వారీగా డ్రాప్స్ జాబితా ఇవ్వాలని సూచించారు. పిల్లలు 100% పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. మిడ్ డే మీల్స్, హ్యాండ్ బుక్, FA-1 మార్కులు, CRC గ్రాండ్స్, MRC గ్రాండ్స్ పై రివ్యూ చేపట్టారు.

News September 10, 2025

హెక్తాన్-25 విజేతలకు బహుమతుల ప్రదానం

image

ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి బుధవారం రాత్రి భీమవరంలో నిర్వహించిన అమరావతి క్వాంటం వ్యాలీ హెక్తాన్-25 సెమీఫైనల్స్‌లో విన్నర్స్‌, రన్నర్స్‌కు కలెక్టర్ నాగరాణి బహుమతులు అందించారు. విన్నర్స్‌గా భీమవరం, రాజమండ్రి, సూరంపాలెం, కాకినాడ కళాశాలలు దక్కించుకున్నాయి. రన్నర్స్‌గా తుని, రాజమండ్రి, భీమవరం, సూరంపాలెం, గైడ్ ఇంజినీరింగ్ కాలేజీ, రాజమండ్రి కళాశాల నిలిచాయి.

News September 10, 2025

గుడ్లూరులో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

image

గుడ్లూరు ఉప్పుటేరు బ్రిడ్జి వద్ద బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న ఆటోను అటుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆటో వద్ద నిలబడి ఉన్న ఇద్దరి మహిళలకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను గుడ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఓ మహిళ చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. మరొకరు వైద్యం పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 10, 2025

కృష్ణా: ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులతో SP సమావేశం

image

ఎస్పీ ఆర్. గంగాధరరావు ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశం బుధవారం నిర్వహించారు. పోలీస్‌ సూచనల ప్రకారం వివాదాస్పద, వ్యక్తిగత దూషణల ఫ్లెక్సీలు ముద్రించకూడదని, ఆర్డర్ ఇచ్చిన వారి పూర్తి వివరాలు నమోదు చేయాలిని సూచించారు. అసోసియేషన్ సభ్యులు చట్టపరంగా సహకరించి సమాజ శాంతికి కృషి చేయమని ప్రతిజ్ఞ చేసుకున్నారు.

News September 10, 2025

VZM: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

విజయనగరం మండలం రీమా పేట సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీ.టీ.అగ్రహారానికి చెందిన సిమ్మ రాము(50) మృతి చెందాడు. మృతుడు బండిపై ఐస్‌లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు. బుధవారం ఐస్‌లు అమ్ముకుని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై రూరల్ ఎస్‌ఐ వి.అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 10, 2025

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్‌లో వర్క్ ఫ్రం హోం, ఈ కేవైసీ, వాహనాల ఆధార్ సీడింగ్, తల్లికి వందనం, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో బుధవారం సమీక్షించారు. కౌశలం సర్వే, పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్, వాట్సాప్ గవర్నెన్స్, ఈపీటీఎస్ ఫైల్స్ అప్‌లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.

News September 10, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤నరసన్నపేట: గ్యాస్ లీకై.. వ్యాపించిన మంటలు
➤పాతపట్నం: బురదలో కూరుకుపోయిన లారీ.. ట్రాఫిక్ జామ్
➤టెక్కలి: మండుటెండలో విద్యార్థుల అవస్థలు
➤ఎచ్చెర్ల: అంబేడ్కర్ వర్శిటీ నూతన రిజిస్ట్రార్‌గా అడ్డయ్య
➤సరుబుజ్జిలి: ధర్మల్ ప్లాంట్‌ను వ్యతిరేకించిన ఆదివాసీలు
➤శ్రీకాకుళం: 11న డయల్ యువర్ ఆర్ఎం
➤ఆమదాలవలస: వివాహిత ఆత్మహత్య..నలుగురికి రిమాండ్

News September 10, 2025

VZM: ‘నేపాల్‌లో జిల్లా యాత్రికులు సురక్షితం’

image

విజయనగరం జిల్లా నుంచి మానస సరోవర యాత్రకు వెళ్లిన 61 మందీ క్షేమంగా ఉన్నారని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. వీరిని సురక్షితంగా జిల్లాకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. యాత్రికులతో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనిత స్వయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారని, వారిని రప్పించేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. మంత్రి లోకే‌శ్‌కు జిల్లాకు చెందిన యాత్రికులు 61 మంది జాబితాను పంపించామన్నారు.

News September 10, 2025

రేపు ప్రకాశం జిల్లాకు వర్ష సూచన

image

దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ప్రభుత్వం బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రభావం ప్రకాశం జిల్లాపై సైతం పడుతుందని పేర్కొంది. దీంతో ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. పశ్చిమ ప్రకాశంలో నేటి సాయంత్రం మోస్తరు వర్షాలు కురిశాయి.