Andhra Pradesh

News May 29, 2024

యానాం: గేదెను ఢీకొట్టి యువకుడి మృత్యువాత

image

యానాం ఒబిలిస్క్‌ టవర్‌ వద్ద మంగళవారం బైకుపై వేగంగా వెళుతున్న యువకుడు కర్రి నూకరాజు(21) గేదెను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. గుడికి వెళ్లడం కోసం ఆటోలో బయల్దేరిన నూకరాజు కుటుంబం రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న తమ కుమారుడిని చూసి యానాం ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా వైద్యులు వెంటనే కాకినాడకు తరలించారు. చికిత్సపొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

News May 29, 2024

అనంత: జూన్ 2న తైక్వాండో జట్ల ఎంపికలు

image

అనంతపురంలోని రాంనగర్ చిన్నా బ్యాడ్మింటన్ అకాడమీలో జిల్లా తైక్వాండో సంఘం ఆధ్వర్యంలో జూన్ 2న ఉదయం 10 గంటలకు జిల్లా తైక్వాండో జట్లను ఎంపిక చేయనున్నట్లు ఆ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి కె. శాంతరాజ్ తెలిపారు. ఏపీ తైక్వాండో సంఘం నుంచి రెడ్వన్ బెల్ట్ గ్రేడింగ్ కలిగి 15-17 ఏళ్ల వయసున్న బాలబాలికలు పాల్గొనడానికి అర్హులన్నారు. ఎంపికైన వారు వచ్చే నెలలో విజయనగరంలో జరగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.

News May 29, 2024

తిరువూరు: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

image

ఖమ్మం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని వర్షిత(24)కు ఫిబ్రవరి 14న తిరువూరు మం. ఎరుకపాడుకు చెందిన గోపితో పెళ్లైంది. అనంతరం ఉన్నత చదువుల కోసం గోపి అమెరికా వెళ్లారు. వర్షితకు ఆరోగ్యం బాలేదని తల్లిదండ్రులు HYD నుంచి సొంతూరుకి తీసుకెళ్లారు. సోమవారం రాత్రి ఇంట్లో పడుకున్న ఆమె తెల్లారేసరికి బావిలో శవమై కనిపించింది. అనారోగ్య సమస్యలతోనే వర్షిత సూసైడ్ చేసుకుందని తండ్రి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News May 29, 2024

నెల్లూరు: రౌండ్ల వారిగా నియోజకవర్గ ఫలితాలు

image

కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఫలితాలు 20 రౌండ్లు, కావలి 23, ఆత్మకూరు 20, కోవూరు 24, నెల్లూరు నగరం 18, నెల్లూరు గ్రామీణం 21, ఉదయగిరి 24, సర్వేపల్లి 21 రౌండ్లలో ఫలితాలు వెల్లడవుతాయి. నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపునకు 14టేబుళ్లు ఏర్పాటు చేయగా.. 4 రౌండ్లలో ఫలితాలు వెల్లడవుతాయి. ఎప్పటికప్పుడు ఫలితాలు వెల్లడించేందుకు మీడియా సెంటర్ ఏర్పాటు చేశారు.

News May 29, 2024

విశాఖ: మరో ఐదుగురు ఏజెంట్లు అరెస్టు

image

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని కాంబోడియా పంపించి మోసం చేసిన ఘటనలో మరో ఐదుగురిని అరెస్టు చేసినట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. కమిషన్ కోసం ఆశపడిన ఏజెంట్లు బోనుల జాన్ ప్రసాద్, కింతాడ అశోక్, పప్పల నానాజీ, మండ ప్రదీప్ చంద్ర, పెద్ద పాట విజయ్ కుమార్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల ద్వారా మోసపోయిన బాధితులు 1930కు సంప్రదించాలన్నారు.

News May 29, 2024

పోలాకి: వేట నిషేధకాలంలో భృతి నిధులు విడుదల

image

సముద్ర తీర గ్రామాల్లోని మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో ఇవ్వవలసిన భృతి నిధులు మంజూరు అయ్యాయని పోలాకి మత్స్యశాఖ విస్తరణ అధికారి డా. ఢిల్లేశ్వరరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వేట నిషేధకాలం 61 రోజులు పాటు వేటకు వెళ్లని వారికి పరిహారంగా ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేలు వంతున రూ.1.47 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ఓట్లులెక్కింపు అనంతరం మత్స్యకారులకు వారి బ్యాంకు ఖాతాలో నిధులు జమచేస్తామన్నారు.

News May 29, 2024

శింగనమల: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

శింగనమల మండలం ఉల్లికల్లుకి చెందిన రైతు బాలకృష్ణ(41) విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. రైతు పంట సాగు కోసం ఐదు లక్షల రూపాయలు అప్పు చేశాడు. సరైన దిగుబడులు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పు తీర్చే మార్గం లేక సోమవారం విషపు గుళికలు మింగాడు. మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 29, 2024

మరో 5 రోజులే.. కృష్ణా జిల్లాలో ఆధిపత్యం ఎవరిది.?

image

ఓట్ల లెక్కింపు తేదీ జూన్ 4 వచ్చేస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. ఫలితాలకు మరో 5 రోజుల సమయమే ఉంది. ఓ వైపు ఉత్కంఠ నెలకొనగా, మరోవైపు బెట్టింగులు జోరందుకున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో YCP 14 అసెంబ్లీ, 1 MP స్థానాలు గెలుచుకోగా, తాజా ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఇరుపార్టీల నేతలు గెలుపుపై ధీమాగా ఉండగా, ఏ పార్టీది ఆధిపత్యం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News May 29, 2024

విజయనగరం: కలవరపెడుతున్న టీనేజీ ప్రెగ్నెన్సీ

image

ఉమ్మడి జిల్లాలో బాల్య వివాహాలకు అడ్డుకట్టపడడంలేదు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు, అవగాహన లేకపోవడం వంటి కారణాలతో చిన్న వయసులో అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసేస్తున్నారు. దీంతో జిల్లాలో టీనేజీ ప్రెగ్నెన్సీ శాతం క్రమేపి పెరిగి వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. 2023-24లో గర్భందాల్చిన వారిలో బాలికల శాతం పార్వతీపురం మన్యం జిల్లాలో 9.71% ఉండగా.. విజయనగరం జిల్లాలో 8.41 శాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

News May 29, 2024

గుంటూరు: గురుకులాల ఉపాధ్యాయుల సేవల పునరుద్ధరణ

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బీఆర్ అంబేడ్కర్ గురుకులాల ఒప్పంద ఉపాధ్యాయుల సేవలను పునరుద్ధరిస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 23న 2023-24 విద్యా ఏడాది చివరి పనిదినం కావడంతో ఆరోజు వారిని విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఒప్పంద ఉపాధ్యాయుల సేవలను కొనసాగిస్తూ విధుల్లోకి తీసుకోవాలని జిల్లా సమన్వయకర్త, ప్రిన్సిపాల్స్‌ని ఆదేశించారు.