Andhra Pradesh

News May 29, 2024

మారేడుమిల్లి: అటవీ అధికారులు సస్పెండ్

image

మారేడుమిల్లి పరిధిలో ఇటీవల వెలుగుచూసిన టేకు చెట్ల గల్లంతు వ్యవహారంలో మారేడుమిల్లి రేంజ్‌ అధికారి ఆజాద్‌, సెక్షన్‌ అధికారి సుమంత్‌, బీట్‌ అధికారి శివారెడ్డిని సస్పెండ్‌ చేస్తూ అటవీ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రంపచోడవరం డివిజన్‌ పరిధిలో టేకు ప్లాంటేషన్‌లో చెట్ల గల్లంతుపై అటవీ శాఖ రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాల మేరకు విచారణ చేసి నిర్ణయం తీసుకున్నారు.

News May 29, 2024

రాయచోటి: గంగమ్మ తల్లి జాతరలో అపశృతి

image

రాయచోటి నియోజకవర్గంలోని మాధవరం గ్రామంలోని మూల మురికివాళ్లపల్లెలో జరుగుతున్న గంగమ్మ తల్లి జాతరలో అపశృతి చోటు చేసుకుంది. గ్రామస్థులు చాందిని బండ్లు ఊరేగింపు సమయంలో రోడ్డు ప్రక్కనే పెద్ద పెద్ద మంటలు చెలరేగాయి. గమనించిన ఎస్సై భక్తవత్సలం, సిబ్బంది సమయస్ఫూర్తితో హుటాహుటిన నీళ్ల ట్యాంకర్‌ను తీసుకువచ్చి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

News May 29, 2024

తెనాలి యువకుడు హైదరాబాద్‌లో దుర్మరణం

image

తెనాలి గాంధీనగర్‌కు చెందిన మహమ్మద్ హుస్సేన్ బేగ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇతను తన సోదరుడితో పాటు ఆదిభట్ల ప్రాంతంలో రూములో ఉంటున్నాడు. సోమవారం ఉదయం వీళ్లిద్దరితో పాటు మరో యువకుడు బైకు మీద ఉద్యోగాలకు బయల్దేరారు. ఈ క్రమంలో మీర్‌పేట్ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఘటనలో హుస్సేన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అతని సోదరుడు ఇస్మాయిల్ కోమాలోకి వెళ్లాడు.

News May 29, 2024

పెంటపాడులో హై టెన్షన్

image

పెంటపాడు మండలం రావిపాడులో <<13329601>>తీవ్ర ఉద్రిక్తత<<>> నెలకొంది. రావిపాడులో జరిగిన అల్లర్లకు తాడేపల్లిగూడెం ఆర్డీవో కే.చెన్నయ్య, తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి రంగంలోకి దిగారు. పోలీసులు ఉన్నతాధికారులపై దళిత సంఘాలు రాళ్లు విసిరారు. దాడిలో పెంటపాడు ఎమ్మార్వో , తాడేపల్లిగూడెం ఎస్సై, ముగ్గురు కానిస్టేబుల్ కు గాయాలు అయినట్లు సమాచారం.

News May 29, 2024

ఎచ్చెర్ల: కొనసాగుతున్న పాలిటెక్నిక్ కౌన్సిలింగ్

image

పాలిసెట్-2024 కౌన్సిలింగ్ 12001నుంచి 27000మధ్య ర్యాంకు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరీశీలించారు. పరీశీలనకు 372 మంది విద్యార్థులు హాజరయ్యారు. బుధవారం 27001నుంచి 43000ర్యాంకు మధ్య ధ్రువీకరణ పత్రాలు పరీశీలించనున్నారు. కౌన్సిలింగ్ 27న ప్రారంభించగా, ఇప్పటి వరకు 615 మంది హాజరయ్యారు. కౌన్సిలింగ్ జూన్ 3వ తేదీ వరకు కొనసాగనుంది. ఈనెల 31నుంచి జూన్ 4వ తేదీ వరకు కళాశాలలు, బ్రాంచ్‌ల ఆప్షన్ల ఎంచుకోవాలి.

News May 29, 2024

తిరుమల: నకిలీ వీఐపీ బ్రేక్ టికెట్లతో మోసం

image

భక్తులకు శ్రీవారి VIP బ్రేక్ దర్శన టికెట్ల స్థానంలో నకిలీ దర్శన టికెట్లను అంటగట్టి మోసగించాడు తిరుపతికి చెందిన రఘు సాయి తేజ అనే దళారీ. ఆయన వద్ద టికెట్లను తీసుకున్న శ్రీనివాస్ మంగళవారం ఉదయం శ్రీవారి దర్శనానికి వెళ్లగా స్కానింగ్ కాలేదు. దీంతో తాము మోసపోయామని భక్తులు గుర్తించారు. వెంటనే విజిలెన్స్ వింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి నివేదిక ఆధారంగా తిరుమల వన్ టౌన్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 29, 2024

అనంతపురం: వేరుశనగ విత్తనాల కోసం 60,578 మంది దరఖాస్తు

image

జిల్లాలో ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం 60,578 మంది రైతులు 53,475 క్వింటాళ్ల విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. కాగా ఇప్పటి వరకు 29 మండలాల్లో 38,419 మంది రైతులకు 33,895 క్వింటాళ్ల వేరుశనగ కాయలు పంపిణీ చేసినట్లు తెలిపారు.

News May 29, 2024

ఎన్నికల్లో నాదే విజయం: బుడ్డా రాజశేఖర్ రెడ్డి

image

జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్‌లో విజయం తనదేనని శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆత్మకూరు టీడీపీ కార్యాలయంలో శ్రీశైలం నియోజకవర్గ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తాను ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. తనకోసం పనిచేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

News May 29, 2024

పలాస గెలుపుపై ఒడిశాలో బెట్టింగులు?

image

జిల్లాలో పలాస నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గం గురించి ఒడిశాలో కూడా బెట్టింగులు జోరందుకున్నాయి. పలాసలో వైసీపీ నుంచి సీదిరి అప్పలరాజు, కూటమి నుంచి గౌతు శీరిష బరిలో ఉన్నారు. గత ఎన్నికలో సీదిరి 16,000 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019లో 73.35శాతం ఓటింగ్ నమోదవ్వగా, ఈసారి 76.42శాతం నమోదైంది. పెరిగిన 3శాతం పోలింగ్ ఎవరికి కలిసివస్తుందో జూన్4 వరకు వేచి చూడాల్సిందే.

News May 29, 2024

ఏయూకు 271వ స్థానం

image

బెస్ట్ వాల్యూ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇన్ ఏషియాలో ఏయూకు మెరుగైన స్థానం లభించింది. ఆసియాలోని 20 దేశాలలో 3,349 ఉన్నత విద్యాసంస్థలను అధ్యయనం చేసి ఈ స్థానాలు ప్రకటించారు. ఏయూ అత్యుత్తమమైన వర్సిటీల్లో మొదటి 9 శాతంతో 271 ర్యాంక్ సాధించింది. అధికారిక ఉత్తర్వులను ఏయూ వీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్‌లకు అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీఎన్ ధనుంజయరావు అందజేశారు.