Andhra Pradesh

News May 29, 2024

ఎన్నికల్లో నాదే విజయం: బుడ్డా రాజశేఖర్ రెడ్డి

image

జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్‌లో విజయం తనదేనని శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆత్మకూరు టీడీపీ కార్యాలయంలో శ్రీశైలం నియోజకవర్గ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తాను ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. తనకోసం పనిచేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

News May 29, 2024

పలాస గెలుపుపై ఒడిశాలో బెట్టింగులు?

image

జిల్లాలో పలాస నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గం గురించి ఒడిశాలో కూడా బెట్టింగులు జోరందుకున్నాయి. పలాసలో వైసీపీ నుంచి సీదిరి అప్పలరాజు, కూటమి నుంచి గౌతు శీరిష బరిలో ఉన్నారు. గత ఎన్నికలో సీదిరి 16,000 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019లో 73.35శాతం ఓటింగ్ నమోదవ్వగా, ఈసారి 76.42శాతం నమోదైంది. పెరిగిన 3శాతం పోలింగ్ ఎవరికి కలిసివస్తుందో జూన్4 వరకు వేచి చూడాల్సిందే.

News May 29, 2024

ఏయూకు 271వ స్థానం

image

బెస్ట్ వాల్యూ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇన్ ఏషియాలో ఏయూకు మెరుగైన స్థానం లభించింది. ఆసియాలోని 20 దేశాలలో 3,349 ఉన్నత విద్యాసంస్థలను అధ్యయనం చేసి ఈ స్థానాలు ప్రకటించారు. ఏయూ అత్యుత్తమమైన వర్సిటీల్లో మొదటి 9 శాతంతో 271 ర్యాంక్ సాధించింది. అధికారిక ఉత్తర్వులను ఏయూ వీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్‌లకు అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీఎన్ ధనుంజయరావు అందజేశారు.

News May 29, 2024

నెల్లూరులో తొలి ఫలితం ఆ నియోజకవర్గానిదే..

image

జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నెల్లూరు జిల్లాలో తొలి ఫలితం 2 గంటలకు నెల్లూరు సిటీ నియోజకవర్గానిది వెలువడనుంది. ఆఖరుగా ఉదయగిరి, కోవూరు నియోజకవర్గాల ఫలితాలు 4 గంటలకు వెలువడనున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్ లెక్కన కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

News May 29, 2024

విజయనగరం: కన్నపేగుకు కడుపుకోత

image

పిల్లల సరదాలు కన్నపేగుకు కడుపుకోతను మిగిలుస్తున్నాయి. బొబ్బిలి మండలంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తోనంగి సాయి ఏకైక సంతానం కావడంతో అతని తల్లిదండ్రుల ఆర్తనాదాలకు అవధులు లేవు. అటు జామి ఘటనలో మరణించిన షాకిద్ ఖాన్ తల్లిదండ్రులు రోజువారీ కూలీ చేసుకుంటూ చదిస్తున్నారు. ముగ్గురు కుమార్తెల తర్వాత పుట్టిన ఏకైక మగ సంతానం మహమ్మద్ అస్రాఫ్ మరణవార్త విన్న అతని అమ్మానాన్న శోక సంద్రంలో మునిగిపోయారు.

News May 29, 2024

విశాఖ: లవర్ బర్త్‌డే.. ఫోన్ తియ్యలేదని సూసైడ్

image

ప్రియురాలు పుట్టినరోజు నాడు యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎలమంచిలిలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన రోమాల గంగాధర్(24) చాలా కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఏడాదిగా వీరు మాట్లాడుకోవడం లేదు. సోమవారం ఆమె పుట్టినరోజు కావడంతో ఆ అమ్మాయికి ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు చేసినా.. ఆమె ఫోన్ తియ్యకపోవడంతో మనస్తాపం చెంది అదే రోజు రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్సై పాపినాయుడు వెల్లడించారు.

News May 29, 2024

దర్శి: స్నేహితులతో సరదా ఈత.. ప్రాణం తీసింది

image

తాళ్లూరు మండలంలోని రామభద్రపురానికి చెందిన మణికంఠరెడ్డి ఆదివారం రామతీర్థం రిజర్వాయర్లో గల్లంతైన విషయం తెలిసిందే. మణికంఠరెడ్డి తన మిత్రులతో కలిసి ఆదివారం రామతీర్థం రిజర్వాయర్లో సరదాగా ఈతకెళ్లి అక్కడ ఈతకొడుతూ లోపలికి వెళ్లి కనిపించకుండా పోయాడు. ఆరోజు నుంచి గాలింపు చర్యలు చేపట్టగా, మంగళవారం మృతదేహం ఒకపక్కకు కొట్టుకొని వచ్చింది. మణికంఠ మృతితో రామభద్రపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 29, 2024

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏలూరు ఖైదీ మృతి

image

చెట్టుపై నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఖైదీ చింతారావు (44) మంగళవారం మృతి చెందారు. ఈ నెల 26న ఏలూరుకు చెందిన చింతారావు చెట్టుపై నుంచి పడ్డారు. ఐదేళ్ల క్రితం హత్య కేసులో సెంట్రల్ జైలుకు వచ్చిన ఆయన.. సత్ప్రవర్తన ఉండటంతో ఓపెన్ ఎయిర్ జైల్లో ఉంచారు.

News May 29, 2024

రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీ మృతి

image

చెట్టుపై నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఖైదీ చింతారావు (44) మంగళవారం మృతి చెందారు. ఈ నెల 26న ఏలూరుకు చెందిన చింతారావు చెట్టుపై నుంచి పడ్డారు. ఐదేళ్ల క్రితం హత్య కేసులో సెంట్రల్ జైలుకు వచ్చిన ఆయన.. సత్ప్రవర్తన ఉండటంతో ఓపెన్ ఎయిర్ జైల్లో ఉంచారు.

News May 29, 2024

విశాఖ: ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎంగా పరమేశ్వర్

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ గా పరమేశ్వర్ ఫంక్వాల్ నియమితులయ్యారు. ఆయన కాన్పూర్ ఐఐటీలో చదివి 1998లో ఇండియన్ రైల్వే సర్వీస్ ఇంజనీర్‌గా రైల్వే శాఖలో చేరారు. రైల్వే ట్రాక్ వంతెనలు పర్యావరణ ఇంజనీరింగ్‌పై ఆయన రాసిన పరిశోధన పత్రాలు పలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితం అయ్యాయి. డెన్మార్క్ స్వీడన్ ఫ్రాన్స్ జర్మనీ చైనా సింగపూర్ తదితర దేశాల్లో పర్యటించి పలు అధ్యయనాలు నిర్వహించారు.