Andhra Pradesh

News May 29, 2024

ఏజెంట్లకై 30లోపు దరఖాస్తు చేసుకోండి: కడప కలెక్టర్

image

రాజకీయ పార్టీల తరఫున కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ విజయరామరాజు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఏజెంట్ల కోసం డీఆర్వోలను, ఈవీఎంల లెక్కిపునకు సంబంధించి ఆర్వోలను సంప్రదించాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఏజెంట్లు ఉదయం 7 గంటల్లోపు హాజరుకావాలని, పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలన్నారు. 4వ తేదీ సాయంత్రం వరకు రాయకీయ ప్రతినిధుల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.

News May 29, 2024

విశాఖ: మత్స్యకార భరోసా పథకానికి లబ్ధిదారులు ఎంపిక

image

మత్స్యకార భరోసా పథకానికి లబ్ధిదారుల ఎంపికను అధికారులు పూర్తి చేశారు. విశాఖ జిల్లాలో 13,530 కుటుంబాలను ఈ పథకానికి అర్హులుగా అధికారులు గుర్తించారు. ఒక్కొక్కరికి రూ.పదివేలు చొప్పున మొత్తం రూ.13.53 కోట్లను అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా పంపిణీలో జాప్యం జరుగుతుంది. జూన్ 4 తర్వాత పంపిణీ చేస్తారు.

News May 29, 2024

ఇబ్రహీంపట్నంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

image

ఇబ్రహీంపట్నం సమీపంలో హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు, జాతీయ రహదారి సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేశారు.

News May 29, 2024

ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం ఆమదాలవలస

image

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడికి సమయం దగ్గర పడుతోంది. ఇందులో భాగంగా నిబంధన ప్రకారం తక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న నియోజకవర్గం లెక్కింపు ముందుగా చేపట్టాలి. అతి తక్కువ పోలింగ్ కేంద్రాల 259 ఉన్న ఆమదాలవలసలో ఈవీఎంలను తెరిచి ముందుగా ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, నరసన్నపేట, ఎచ్చెర్ల, టెక్కలి చివరిగా అధికంగా 332 పోలింగ్ కేంద్రాల ఉన్న పాతపట్నం నియోజకవర్గం ఫలితాలు వస్తాయి.

News May 29, 2024

కొలిమిగుండ్ల : పెట్నికోట కేసులో మొత్తం 54మంది నిందితుల అరెస్ట్

image

కొలిమిగుండ్ల మండలంలోని పెట్నికోట గ్రామంలో మే-13న పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న గొడవకు సంబంధించి మొత్తం 54మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు కొలిమిగుండ్ల సీఐ గోపీనాథ్ రెడ్డి వెల్లడించారు. ఇందులో టీడీపీ, వైసీపీ వర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారని పేర్కొన్నారు. మంగళవారం అరెస్టు చేసిన నిందితులతో కలిపి ఇప్పటివరకు మొత్తం 54మంది నిందితులను రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.

News May 29, 2024

కుప్పం: శానిటరీ ఇన్‌స్పెక్టర్ సస్పెండ్

image

కుప్పం మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ సంతోష్‌ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. మూడు నెలలుగా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న సంతోష్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనిపై ఆయన స్పందించకపోవడంతోపాటు మద్యం సేవించి విధులకు హాజరుకావడం, పారిశుద్ధ్య సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంపై చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News May 29, 2024

అనంత: పది ఫలితాల్లో ముందు 18.. రీ వెరిఫికేషన్‌లో 82 మార్కులు

image

10వ తరగతి మూల్యాంకనంలో జరిగిన తప్పిదాల వల్ల బత్తలపల్లి విద్యార్థి అంజికి ఇంగ్లిష్ సబ్జెక్టులో తొలుత 18 మార్కులు వచ్చాయి. రీ వెరిఫికేషన్‌లో 82 మార్కులు వచ్చాయి. ఈ తప్పిదాల వల్ల విద్యార్థులు మానసికంగా బాధ పడుతూ, అందరి చేత అవమానాలకు గురవుతున్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

News May 29, 2024

నెల్లూరు: 4న మద్యం విక్రయాలు బంద్

image

ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జూన్ 4వ తేదీన జిల్లాలోని మద్యం దుకాణాలను మూత వేయడంతో పాటు కల్లు విక్రయాలను నిలిపివేయనున్నారు. ఆ రోజు పూర్తిగా డ్రైడేగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణ్ ఆదేశించారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.

News May 29, 2024

విశాఖ: బాలికపై అత్యాచారం.. 20ఏళ్ల జైలు శిక్ష

image

విశాఖలో 2017లో సంచలనం రేపిన కిడ్నాప్, రేప్ కేసులో పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆనంది మంగళవారం సంచలన తీర్పు వెల్లడించారు. 5వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో నిందితుడు గణేశ్‌కి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. బాధితురాలికి రూ.4 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు. న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News May 29, 2024

VZM: ‘గర్భిణుల సేవలపై నిరంతరం నిఘా ఉంచాలి’

image

గర్భిణులు పొందుతున్న సేవలపై నిరంతరం నిఘా ఉంచాలని జిల్లా మాతృ, శిశు మరణాలు సమీక్ష ఉప కమిటీ చైర్మన్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఎస్.భాస్కరరావు అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో మార్చి, ఏప్రిల్ నెలలో జిల్లాలో సంభవించిన మాతృ, శిశు మరణాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గర్భిణులపై పర్యవేక్షణ ఉండాలని చెప్పారు.