Andhra Pradesh

News May 29, 2024

శ్రీకాకుళం: ఓట్ల లెక్కింపు పక్కాగా ఉండాలి: కలెక్టర్

image

కౌటింగ్‌ పక్కాగా జరగాలని, ఎన్నికల ఫలితాలను రౌండ్ల వారీగా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నమోదు చేసే సిబ్బంది, అలాగే వాటిని క్రాస్ చెక్ చేసే మరో బృందం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌ సిబ్బందితో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు వివరాలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు.

News May 29, 2024

అనంత: రెండవ రోజు ఎంపీ అభ్యర్థుల సమావేశం

image

అనంతపురము నగరంలోని కలెక్టరేట్‌లోని మినీ హాలులో మంగళవారం రెండవ రోజు ఎంపీ అభ్యర్థుల సమావేశం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్ల నియామకం & విధులపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.

News May 29, 2024

కృష్ణా: నేడు పాలీసెట్ కౌన్సిలింగ్ వీరికే..

image

ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి నేడు (బుధవారం) పాలీసెట్-2024లో 27,001- 43,000 వరకు ర్యాంక్ పొందినవారికి సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. పైన తెలిపిన ర్యాంకులు పొందిన విద్యార్థులు విజయవాడలోని 3 హెల్ప్‌లైన్ కేంద్రాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుందని కౌన్సిలింగ్ నిర్వాహకులు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ర్యాంక్, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం సీట్లు కేటాయిస్తామన్నారు.

News May 29, 2024

ప.గో.: 6 రోజుల్లో నేతల భవితవ్యం.. గెలుపుపై టెన్షన్

image

ప్రజలు ఎన్నికల తీర్పునిచ్చి 15 రోజులైంది. మరో 6 రోజుల్లో నేతల భవితవ్యం వెలువడనుంది. రోజులు గడుస్తున్నా కొద్దీ ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లోని అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. కార్యకర్తలు, అభిమానులు ఎవరికి వారు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యర్థే MLA అంటూ వాహనాలకు ముందస్తుగానే స్టిక్కర్లు అతికించేస్తున్నారు. మరోవైపు బెట్టింగుల జోరు నడుస్తోంది. – మీ వద్ద పరిస్థితి ఏంటి.?

News May 29, 2024

ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆంక్షలు కఠినతరం: కడప కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సజావుగా, పారదర్శకంగా, పటిష్టంగా నిర్వహించేందుకు శాంతి భద్రతల దృష్ట్యా ఆంక్షలను కఠినతరం చేయడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఎంసీసీ అమలు, 144 సెక్షన్ పాటింపుపై ఎస్పీ సిద్దార్థ్ కౌశల్‌తో కలిసి రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

News May 29, 2024

తూ.గో.: 6 రోజుల్లో నేతల భవితవ్యం.. గెలుపుపై టెన్షన్

image

ప్రజలు ఎన్నికల తీర్పునిచ్చి 15 రోజులైంది. మరో 6 రోజుల్లో నేతల భవితవ్యం వెలువడనుంది. రోజులు గడుస్తున్నా కొద్దీ తూ.గో. జిల్లాలోని 19 నియోజకవర్గాల్లోని అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. కార్యకర్తలు, అభిమానులు ఎవరికి వారు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ అభ్యర్థే MLA అంటూ వాహనాలకు ముందస్తుగానే స్టిక్కర్లు అతికించేస్తున్నారు. మరోవైపు బెట్టింగుల జోరు నడుస్తోంది.
– మీ వద్ద పరిస్థితి ఏంటి.?

News May 28, 2024

గుంటూరు: ఫలితాలు వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి: కలెక్టర్

image

ఈవీఎం ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటిస్తూ కంట్రోల్ యూనిట్‌లో పోటీలో ఉన్న అభ్యర్థుల సీరియల్ నంబర్ వారీగా ఫలితాలను జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు బాధ్యతగా ఓట్ల లెక్కింపు నిర్వహించాలని స్పష్టం చేశారు.

News May 28, 2024

అనకాపల్లి: ఏలేరు కాలువలో మృతదేహం

image

తుమ్మపాల-ఏలేరు కాలువ మొదటి ఖానా నీటిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు అనకాపల్లి పట్టణ ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. చనిపోయిన వ్యక్తికి సుమారు 35-40 సంవత్సరాల వయసు ఉంటుందన్నారు. అతని శరీరంపై బ్రౌన్ కలర్‌పై నీలి రంగు చెక్స్ కలిగిన ఫుల్ హాండ్స్ షర్టు, బ్రౌన్ కలర్ ఫుల్ పాంట్ ఉన్నట్లు తెలిపారు. శరీరంపై ఎటువంటి గాయాలు లేవని వెల్లడించారు.

News May 28, 2024

స్వర్ణరథంపై కల్యాణ వేంకన్న దర్శనం

image

తిరుపతి జిల్లా శ్రీనివాసమంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం సాయంత్రం స్వామివారి స్వర్ణరథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని ర‌థాన్ని లాగారు.

News May 28, 2024

నంద్యాల: హత్య కేసులో నిందితుడు అరెస్ట్

image

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని కనకాద్రిపల్లె గ్రామంలో ఈనెల 26న భార్య వడ్డే సుగుణమ్మను దారుణంగా హత్య చేసిన భర్త వడ్డే రమణయ్యను మంగళవారం అరెస్టు చేసినట్లు కొలిమిగుండ్ల సీఐ గోపీనాథరెడ్డి వెల్లడించారు. తనను ఒంటరి వాడిని చేసి తరచూ గొడవ పడుతుందన్న కారణంతోనే నిద్రిస్తున్న భార్య సుగుణమ్మపై పదునైన కర్రతో కొట్టి చంపాడని వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామన్నారు