Andhra Pradesh

News May 28, 2024

నంద్యాల: హత్య కేసులో నిందితుడు అరెస్ట్

image

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని కనకాద్రిపల్లె గ్రామంలో ఈనెల 26న భార్య వడ్డే సుగుణమ్మను దారుణంగా హత్య చేసిన భర్త వడ్డే రమణయ్యను మంగళవారం అరెస్టు చేసినట్లు కొలిమిగుండ్ల సీఐ గోపీనాథరెడ్డి వెల్లడించారు. తనను ఒంటరి వాడిని చేసి తరచూ గొడవ పడుతుందన్న కారణంతోనే నిద్రిస్తున్న భార్య సుగుణమ్మపై పదునైన కర్రతో కొట్టి చంపాడని వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామన్నారు

News May 28, 2024

MPL: కారులో నుంచి పడి ఒకరి మృతి

image

ప్రమాదవశాత్తు కారు డోర్ ఓపెన్ కావడంతో ఒకరు చనిపోయారు. మదనపల్లె తాలుకా ఎస్ఐ రవికుమార్ వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా గంగవరానికి చెందిన తమిళ సెల్వం(60) మదనపల్లెలోని బంధువుల ఇంటికి కారులో బయల్దేరారు. మార్గమధ్యలో 150వ మైలు వద్ద కారు డోరు ఉన్నట్లుండి ఓపెన్ అయ్యింది. దీంతో సెల్వం కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందాడు.

News May 28, 2024

పవన్ గెలుపుపై వైజాగ్‌లో జోరుగా బెట్టింగ్‌లు..?

image

కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్నకొలదీ MLA, MP అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. గత ఎన్నికల్లో గాజువాకలో పోటీ చేసి ఓడిపోయి ఈ ఎన్నికల్లో పిఠాపురంకలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గెలుపుపై విశాఖలో జోరుగా పందేలు వేస్తున్నట్లు సమాచారం. పవన్ ఓడితే రూ.లక్షకు రూ.4లక్షలు ఇవ్వడానికి రెఢీ అయినట్లు టాక్ నడుస్తోంది. మరి ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చెయ్యండి.

News May 28, 2024

కర్నూలు: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతిచెందిన ఘటన మంగళవారం జరిగింది. మంత్రాలయం మండలం సుగూరు గ్రామానికి చెందిన రాజశేఖర్ (18) రేకుల షెడ్డులోని పశువులకు మేపు వేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. రేకుల షెడ్డుకు విద్యుత్ ఎర్త్ అవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబీకులు తెలిపారు.

News May 28, 2024

పులుల ఫోటోలు తీసిన బేబీనాయన

image

మధ్యప్రదేశ్‌లోని బాంధవగఢ్ టైగర్ ఫారెస్టులో బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన పర్యటిస్తున్నారు. తనకు ఇష్టమైన వన్యప్రాణులకు ఫోటోలు తీస్తూ సేద తీరుతున్నారు. బేబినాయన తీస్తున్న ఫోటోలు ‘కాక ఆంగ్లం మ్యాగజైన్’లో ప్రచురితం అవుతాయి. గతంలో తల్లీపిల్ల పులుల ఫోటోకు అంతర్జాతీయ అవార్డును బేబినాయన సొంతం చేసుకున్నారు.

News May 28, 2024

ఉలవపాడు: బొలెరో వాహనాన్ని ఢీ కొట్టిన కారు

image

ఉలవపాడులోని ఉత్తర బైపాస్‌లో బైక్‌ను తప్పించబోయి బొలెరో వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైపాస్ రోడ్డులో వెళ్తున్న కారుకు సడన్‌గా వచ్చిన బైక్‌ను తప్పించబోయి ముందున్న బొలోరో వాహనాన్ని ఢీకొట్టగా ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. దానితో స్థానికులు పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.

News May 28, 2024

ప.గో.: ACCIDENT.. వ్యక్తి మృతి

image

ప.గో. జిల్లా పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగరాజు రామరాజు (63) బైక్‌పై వెళ్తుండగా.. స్థానిక వంతెన వద్ద ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మరణించాడు. బైక్‌పై ఉన్న మరోవ్యక్తి షేక్ సత్తార్‌కు తీవ్రగాయాలవగా పాలకొల్లు ఆసుపత్రికి తరలించారు.  

News May 28, 2024

శ్రీకాకుళం: ఏజెంట్లుకు కలెక్టర్ కీలక సూచనలు

image

అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు జూన్ 4 తేదీ ఉదయం 6 గంటలకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ స్పష్టం చేశారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని, ప్రతీ ఏజెంటు పెన్ను, పెన్సిల్, నోట్ పేడ్ తీసుకురావాలన్నారు. రిటర్నింగ్ అధికారులు అనుమతి లేకుండా ఏజెంట్లు ఎవరూ లోపలికి బయటకు వెళ్లరాదని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా అంతా సహకరించాలని కోరారు.

News May 28, 2024

నెల్లూరు జైలులో సతీశ్.. విడుదల ఎప్పుడంటే..?

image

విజయవాడలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేయగా సతీశ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. కోర్టు ఇవాళ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. సంబంధిత ఉత్తర్వులు జిల్లా జైలు అధికారులకు అందిన తర్వాత నిందితుడిని విడుదల చేసే అవకాశం ఉంది. సంబంధిత ప్రొసీడింగ్స్ పూర్తి అయితే ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం సతీశ్ జైలు నుంచి బయటకు రావచ్చని తెలుస్తోంది.

News May 28, 2024

ఏయూకు 271వ స్థానం

image

బెస్ట్ వాల్యూ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇన్ ఏషియాలో ఏయూకు మెరుగైన స్థానం లభించింది. ఆసియాలోని 20 దేశాలలో 3,349 ఉన్నత విద్యాసంస్థలను అధ్యయనం చేసి ఈ స్థానాలు ప్రకటించారు. ఏయూ అత్యుత్తమమైన వర్సిటీల్లో మొదటి 9 శాతంతో 271 ర్యాంక్ సాధించింది. అధికారిక ఉత్తర్వులను ఏయూ వీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్‌లకు అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీఎన్ ధనుంజయరావు అందజేశారు.