Andhra Pradesh

News May 28, 2024

ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్‌గా పరమేశ్వర్ ఫంక్వల్ నియామకం

image

శ్రీకాకుళం – ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్‌గా పరమేశ్వర్ ఫంక్వల్ నియమితులయ్యారు. ఈ మేరకు సంబంధిత అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. పరమేశ్వర్ 1998 బ్యాచ్ ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్(IRSE)కు చెందినవారు. గతంలో ఈయన రాజ్‌కోట్, అహ్మదాబాద్ రైల్వే డివిజన్లలో కీలక పదవుల్లో పనిచేశారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) తెలిపింది.

News May 28, 2024

కృష్ణా: డిప్లమా విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(దూరవిద్య) పరిధిలో ఫిబ్రవరి/మార్చి 2024లో నిర్వహించిన డిప్లమా పరీక్షలకు(ఇయర్ ఎండ్) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా నిర్ణీత ఫీజు రూ.960 చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News May 28, 2024

కదిరి నారాయణ పాఠశాలను సీజ్ చేసిన డీఈఓ

image

కదిరిలోని నారాయణ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అడ్మిషన్స్ నిర్వహిస్తూ పాఠ్య పుస్తకాలను యూనిఫామ్‌లు విక్రయిస్తున్న స్కూల్‌ను డీఈవో మీనాక్షి మంగళవారం సీజ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో అక్రమ పద్ధతుల్లో అడ్మిషన్స్ నిర్వహిస్తూ అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తునందుకు స్కూల్ సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

News May 28, 2024

బి.మఠం: భయంతో విద్యార్థిని ఆత్మహత్య

image

ఎంసెట్‌లో తక్కువ మార్కులు వస్తాయన్న భయంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన బ్రహ్మంగారిమఠంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గొడ్లవీడుకు చెందిన లక్కినేని చిన్నయ్య కూతురు ప్రతిభ (19) పులివెందులలో ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ పరీక్ష రాసింది. తాజాగా ఆమె ఎంసెట్‌ ‘కీ’ చూసుకోగా తక్కువ మార్కులు వస్తాయని భయపడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 28, 2024

శ్రీకాకుళం: ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఏపీ సార్వత్రిక విద్యాపీఠం(APOSS) నిర్వహించే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 1,3, 5, 6, 7, 8 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల ఉంటాయి. సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://apopenschool.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని APOSS వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసాయి.

News May 28, 2024

కృష్ణా: ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఏపీ సార్వత్రిక విద్యాపీఠం(APOSS) నిర్వహించే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 1, 3, 5, 6, 7, 8వ తేదీల్లో మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://apopenschool.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని APOSS వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి.
– SHARE IT

News May 28, 2024

అనంత: ఒకేరోజు 30 XUV 3XO వాహనాల డెలివరీ

image

ఇటీవల మార్కెట్‌లోకి విడుదలైన XUV 3XO శ్రేణి వాహనాలను అనంతపురం ఎంజీబీ మొబైల్స్ వారు ఒకేరోజు 30 డెలివరీ చేశారు. ఆదివారం ఒక్కరోజే ఈ ఘనత సాధించినట్లు ఎంజీబీ మొబైల్స్ సీఈఓ ఆదిత్య మాచాని తెలిపారు. కార్యక్రమంలో సేల్స్ జనరల్ మేనేజర్ వంశీకృష్ణ, సేల్స్ మేనేజర్ మస్తాన్ వలీఖాన్, పీవీకేకే ఐటీ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ జీఎన్ఎస్ వైభవ్ తదితరులు పాల్గొన్నారు.

News May 28, 2024

నెల్లూరు జిల్లా అంతటా 144 సెక్షన్ అమలు

image

ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ స్పష్టం చేశారు. కౌంటింగ్ సెంటర్ వద్ద మీడియా సెంటర్, పార్కింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం మూడంచెల సెక్యూరిటీ నియామించామన్నారు . ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీన జిల్లా మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంటుందని SP ఆరీఫ్ హఫీజ్ వెల్లడించారు. ఎవరూ గుంపులుగా తిరగ వద్దని సూచించారు.

News May 28, 2024

చంద్రగిరి ఘర్షణలో నిందితుల పేర్లు (2/2)

image

➤ జేబీ రమణ ➤ జేబీ శ్రీనివాస్
➤ పురపర్తివారిపల్లె మధు ➤ యశ్వంత్
➤ బాబు రెడ్డి ➤ నరసింహారెడ్డి
➤ బాబు యాదవ్ ➤ తిరుమల రెడ్డి
➤ రాశెట్టి మోహన్ ➤ జలిజపల్లె రెడ్డి
➤ ధర్మతేజ ➤ ఎస్.అఫ్రీద్
➤ భాస్కరపేట దామోదర్ ➤ వి.గురవయ్య
➤ సురేశ్ ➤ శ్రీధర్ ➤ గురుప్రకాశ్
➤ ప్రతాప్ ➤ దాము ➤ రాకేశ్
➤ హేమాంభర రావు ➤ చిన్నబాబు
➤ కేశవులు నాయుడు ➤ ఏజేపల్లె బాల

News May 28, 2024

చందగ్రిరి ఘర్షణలో నిందితుల పేర్లు(1/2)

image

వైసీపీ నాయకుడి ఫిర్యాదు మేరకు చంద్రగిరి, తిరుపతి ఘర్షణలకు సంబంధించి 37 మందిపై హత్యాయత్నం కేసు పెట్టారు. వారి పేర్లు ఇవే
➤ మబ్బు దేవనారాయణ రెడ్డి ➤ సురేశ్ రెడ్డి
➤ డాలర్స్ దివాకర్ రెడ్డి ➤ దేవర మనోహర్
➤ బడి సుధాయాదవ్ ➤ పులిగోరు మురళీకృష్ణారెడ్డి
➤ సి.మనోహర్ రెడ్డి ➤ గణపతి నాయకుడు
➤ గౌస్ బాషా ➤ మొగరాల మధు
➤ పనబాకం సుబ్రహ్మణ్యం నాయుడు
➤ సురేశ్ నాయుడు ➤ నాగరాజు నాయుడు