Andhra Pradesh

News September 24, 2024

ATP: క్రికెట్ బెట్టింగ్.. 19 మంది అరెస్ట్

image

అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసులు ఉక్కు పాదం మోపారు. బెట్టింగ్‌కు పాల్పడిన 19 మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు. వీరిలో ఏడుగురు హరియాణాకు చెందిన వారని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.8,60,000ల నగదు, 19 సెల్ ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇటుకులపల్లి సీఐ హేమంత్ కుమార్, రాప్తాడు సీఐ వెంకట శ్రీ హర్ష, ఎస్ఐ విజయ్ కుమార్‌లను అభినందించారు.

News September 24, 2024

ఏపీ మార్కెఫెడ్ డైరెక్టర్‌గా పరసా వెంకటరత్నం

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన రాష్ట్రస్థాయి చైర్మన్ పదవులతో పాటు కొంతమంది డైరెక్టర్ల పేర్లను కూడా ప్రకటించింది. ఏపీ మార్క్‌ఫెడ్ డైరెక్టర్‌గా తిరుపతి పార్లమెంటు పరిధిలోని సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరసా వెంకటరత్నం పేరును ప్రకటించారు. దీంతో ఆయనకు సుళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, ఇతర టీడీపీ నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

News September 24, 2024

కుప్పం: ఆర్టీసీ వైస్ ఛైర్మన్‌గా మునిరత్నం

image

ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్‌గా కుప్పం టీడీపీ ఇన్‌ఛార్జ్ మునిరత్నంను ప్రభుత్వం నియమించింది. సీఎం చంద్రబాబు నాయుడు క్లాస్‌మెంట్ అయిన మునిరత్నం గడిచిన నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబుతో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కుప్పం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మునిరత్నంను ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించడం పట్ల కుప్పం టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News September 24, 2024

ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా వజ్జ

image

పలాసకు చెందిన వజ్జ బాబురావుని ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APTPC)కి ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవి వజ్జ బాబురావు విధేయతకు దక్కిన గౌరవంగా పార్టీ శ్రేణులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆయన ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

News September 24, 2024

ఉమ్మడి ప.గో.జిల్లా నేతలకు టీడీపీలో కీలక పదవులు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు టీడీపీ నేతలకు నామినేటెడ్ పదవులు వరించాయి. ఏపీ ట్రైకార్ ఛైర్మన్‌గా పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు, ఏపీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఛైర్మన్‌గా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత, ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉండి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు నియమితులయ్యారు.

News September 24, 2024

ప్రకాశం జిల్లాకు అధిక ప్రాధాన్యత

image

రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల జాబితాలో ప్రకాశం జిల్లాకు ప్రాధాన్యం కనిపించింది. జిల్లా నుంచి ఏకంగా ముగ్గురికి నామినేటెడ్ పదవులు వరించాయి. తొలి జాబితాలో ఏ జిల్లాలోనూ ముగ్గురికి పదవులు దక్కలేదు. దామచర్ల సత్యకు AP మారిటైమ్ బోర్డ్ ఛైర్మన్, 20 సూత్రాల ఫార్ములా ఛైర్మన్‌గా లంకా దినకర్, నూకసాని బాలాజీకి AP టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పదవి వరించిన విషయం తెలిసిందే.

News September 24, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ఎస్‌ఎం‌ఎస్-1లో ప్రమాదం జరగడంతో షిఫ్ట్ ఇన్ ఛార్జ్ మల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఎల్‌పి బే స్టీల్ ల్యాడిల్ బ్లాస్ట్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు చెప్తున్నారు. గాయపడిన మల్లేశ్వరరావును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్లు చేరుకోగా.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

News September 24, 2024

సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా సుబ్బారెడ్డి

image

డోన్ నియోజకరవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ సుబ్బారెడ్డికి కీలక నామినేటెడ్ పదవి వరించింది. సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ప్రభుత్వం ఆయనను నియమించింది. ఎన్నికల ముంగిట సీనియర్ నేత కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి కోసం ఎమ్మెల్యే సీటును త్యాగం చేయడం, వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించి కార్యకర్తలకు అండగా ఉండటంతో ఆయనకు టీడీపీ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది.

News September 24, 2024

SEEDAP ఛైర్మన్‌గా దీపక్ రెడ్డి

image

అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన గూనపాటి దీపక్ రెడ్డిని ప్రభుత్వం SEEDAP ఛైర్మన్‌గా నియమించింది. ఆయన 2021లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో అనంతపురం స్థానిక సంస్థల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీపక్ రెడ్డి 2020లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏర్పాటు చేసిన సెలక్ట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. జేసీ బ్రదర్స్‌కి అల్లుడు. టీడీపీలో కీలకంగా ఉన్నారు.

News September 24, 2024

కడప జిల్లాలో వైసీపీకి మరో షాక్

image

క‌డ‌ప జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా మరో ఇద్ద‌రు కీల‌క నేత‌లు పార్టీని వీడారు. మాజీ ఏపీపీఎస్సీ స‌భ్యులు నిమ్మ‌కాయ సుధాక‌ర్ రెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి వీర‌పునాయునిప‌ల్లె జ‌డ్పీటీసీ నిమ్మ‌కాయ‌ల రాజేశ్వ‌ర‌మ్మ పార్టీకి, ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్య‌వ‌హార శైలి న‌చ్చ‌క‌, అసంతృప్తితో పార్టీ వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.