Andhra Pradesh

News May 28, 2024

సంబల్పూర్-కాచిగూడ-సంబల్పూర్ ప్రత్యేక రైళ్లు రద్దు

image

సంబల్పూర్ కాచిగూడ సంబల్పూర్ వేసవి ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. వచ్చే నెల 17, 24 (2 ట్రిప్పులు) తేదీల్లో నడపనున్న సంబల్పూర్ కాచిగూడ రైళ్లను రద్దు చేసామన్నారు. అలాగే కాచిగూడ సంబల్పూర్ వేసవి ప్రత్యేక రైళ్లను వచ్చే నెల 18, 25(రెండు ట్రిప్పులు) తేదీల్లో రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తక్కువ ఆక్యుపెన్సి కారణంగా వీటిని రద్దు చేశాయన్నారు.

News May 28, 2024

కడప: వైవీయూ డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

వైవీయూ అనుబంధ డిగ్రీ కళాశాలల బీఏ, బీబీఏ, బీకాం, బీఎస్‌సీ ఆరో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వీసీ ఆచార్య చింతా సుధాకర్ విడుదల చేశారు. వైవీయూలోని తన ఛాంబర్‌లో కులసచివులు ప్రొ. వై.పి వెంకటసుబ్బయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ. ఎన్ ఈశ్వర్ రెడ్డితో కలిసి పరీక్షా ఫలితాల గణాంకాలను పరిశీలించారు. బీఏ, బీబీఏలో 100 శాతం పాసయ్యారని, బీకాంలో 98.38 శాతం, బీఎస్సీలో 98.93 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

News May 28, 2024

కౌంటింగ్‌పై అవగాహన ఉండాలి: కలెక్టర్

image

చిత్తూరు: ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ షన్మోహన్ సూచించారు. చిత్తూరులో కౌంటింగ్ పర్యవేక్షకులు, సహాయకులు, సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపులో ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా పని చేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆదేశించారు.

News May 28, 2024

శ్రీకాకుళం: ఓట్ల లెక్కింపులో 1300 మంది సిబ్బంది

image

ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 1300 మంది సూపర్‌వైజర్లు, మైక్రోఅబ్జర్వర్లు, కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌లను నియమించినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. రౌండ్లవారీగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గానికి 19 రౌండ్లు, పాతపట్నం 24, ఇచ్ఛాపురం 22, పలాస 21, టెక్కలి 23, శ్రీకాకుళం 20, ఎచ్చెర్ల 23, నరసన్నపేట 21 రౌండ్లుగా లెక్కింపు జరగనుంది.

News May 28, 2024

ప్ర‌శాంతంగా కౌంటింగ్ పూర్తి చేసేందుకు స‌హ‌క‌రించాలి: కలెక్టర్

image

ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌ను జిల్లాలో స‌జావుగా, ప్ర‌శాంతంగా పూర్తి చేసేందుకు ప్ర‌తీఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి, జిల్లా ఎస్పీ దీపిక కోరారు. విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటు స్థానంలో పోటీ చేసిన అభ్య‌ర్ధుల‌కు, రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌కు ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌పై క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో మంగ‌ళ‌వారం అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

News May 28, 2024

స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్

image

లేపాక్షి మండలం చోళసముద్రంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూములను మంగళవారం కలెక్టర్/హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబు పరిశీలించారు. అక్కడ ఉన్న సిబ్బందికి తగు జాగ్రత్తలు చెప్పారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News May 28, 2024

పలాసలో బాలుడి కిడ్నాప్‌కు యత్నం

image

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రాజమ్మ కాలనీకి చెందిన పదేళ్ల బాలుడు కుమార్ తన తల్లిని కలిసేందుకు సమీపంలో ఉన్న జీడి పరిశ్రమకు సోమవారం వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి బాలుడికి మాయమాటలు చెబుతూ తన వెంట ద్విచక్ర వాహనంపై తీసుకుపోయాడు. పలాస రైల్వే స్టేషన్ వైపు వెళుతున్న సమయంలో బాలుడు బిగ్గరగా ఏడుస్తూ ఉండటాన్ని స్థానికులు ప్రశ్నించడంతో బాలుడును వదిలి వెళ్లాడు.

News May 28, 2024

చంద్రగిరి: ఐదు నెలల్లోనే 26 మంది మృతి

image

తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై వేగానికి మించి వాహనాలు దూసుకెళ్తున్నాయి. దీనికి డ్రైవర్ల నిద్రమత్తు తోడవ్వడంతో చంద్రగిరి నుంచి గాదంకి టోల్‌ప్లాజా మధ్యలో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఐతేపల్లి పరిసరాల్లోనే చాలామంది చనిపోతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చంద్రగిరి పరిధిలోనే 26 మంది మృత్యువాత పడటం కలవరపెడుతోంది. నిన్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో నలుగురు <<13322392>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే.

News May 28, 2024

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

అనంతపురంలోని రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్లో ఎస్ఎస్ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మాల్ కాపియింగ్ చేయకుండా ఇన్విజిలేటర్లు అబ్జర్వ్ చేయాలని తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు రాయడానికి వెలుతురు, గాలి ఉండేటట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News May 28, 2024

నెల్లూరు: ఫస్ట్ ఆ ఓట్ల లెక్కింపే

image

జూన్ నెల 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియలో మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కమిషనర్ వికాస్ మర్మత్ తెలిపారు. అనంతరం 8.30 గంటల నుంచి ఈవిఎంల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులుగా శామ్యూల్, ప్రత్యూషలను ఎన్నికల సంఘం నియమించినట్లు కమిషనర్ వివరించారు.