Andhra Pradesh

News May 28, 2024

అనంత: ఒకేరోజు 30 XUV 3XO వాహనాల డెలివరీ

image

ఇటీవల మార్కెట్‌లోకి విడుదలైన XUV 3XO శ్రేణి వాహనాలను అనంతపురం ఎంజీబీ మొబైల్స్ వారు ఒకేరోజు 30 డెలివరీ చేశారు. ఆదివారం ఒక్కరోజే ఈ ఘనత సాధించినట్లు ఎంజీబీ మొబైల్స్ సీఈఓ ఆదిత్య మాచాని తెలిపారు. కార్యక్రమంలో సేల్స్ జనరల్ మేనేజర్ వంశీకృష్ణ, సేల్స్ మేనేజర్ మస్తాన్ వలీఖాన్, పీవీకేకే ఐటీ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ జీఎన్ఎస్ వైభవ్ తదితరులు పాల్గొన్నారు.

News May 28, 2024

నెల్లూరు జిల్లా అంతటా 144 సెక్షన్ అమలు

image

ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ స్పష్టం చేశారు. కౌంటింగ్ సెంటర్ వద్ద మీడియా సెంటర్, పార్కింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం మూడంచెల సెక్యూరిటీ నియామించామన్నారు . ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీన జిల్లా మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంటుందని SP ఆరీఫ్ హఫీజ్ వెల్లడించారు. ఎవరూ గుంపులుగా తిరగ వద్దని సూచించారు.

News May 28, 2024

చంద్రగిరి ఘర్షణలో నిందితుల పేర్లు (2/2)

image

➤ జేబీ రమణ ➤ జేబీ శ్రీనివాస్
➤ పురపర్తివారిపల్లె మధు ➤ యశ్వంత్
➤ బాబు రెడ్డి ➤ నరసింహారెడ్డి
➤ బాబు యాదవ్ ➤ తిరుమల రెడ్డి
➤ రాశెట్టి మోహన్ ➤ జలిజపల్లె రెడ్డి
➤ ధర్మతేజ ➤ ఎస్.అఫ్రీద్
➤ భాస్కరపేట దామోదర్ ➤ వి.గురవయ్య
➤ సురేశ్ ➤ శ్రీధర్ ➤ గురుప్రకాశ్
➤ ప్రతాప్ ➤ దాము ➤ రాకేశ్
➤ హేమాంభర రావు ➤ చిన్నబాబు
➤ కేశవులు నాయుడు ➤ ఏజేపల్లె బాల

News May 28, 2024

చందగ్రిరి ఘర్షణలో నిందితుల పేర్లు(1/2)

image

వైసీపీ నాయకుడి ఫిర్యాదు మేరకు చంద్రగిరి, తిరుపతి ఘర్షణలకు సంబంధించి 37 మందిపై హత్యాయత్నం కేసు పెట్టారు. వారి పేర్లు ఇవే
➤ మబ్బు దేవనారాయణ రెడ్డి ➤ సురేశ్ రెడ్డి
➤ డాలర్స్ దివాకర్ రెడ్డి ➤ దేవర మనోహర్
➤ బడి సుధాయాదవ్ ➤ పులిగోరు మురళీకృష్ణారెడ్డి
➤ సి.మనోహర్ రెడ్డి ➤ గణపతి నాయకుడు
➤ గౌస్ బాషా ➤ మొగరాల మధు
➤ పనబాకం సుబ్రహ్మణ్యం నాయుడు
➤ సురేశ్ నాయుడు ➤ నాగరాజు నాయుడు

News May 28, 2024

ఎక్కువ మంది గుమిగూడరాదు: మన్యం జిల్లా ఎస్పీ

image

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పలు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద వాహనాల పార్కింగ్ కేంద్రం బయట ఏర్పాటు చేయడం జరిగిందని, నిర్దేశిత ప్రదేశంలో వాహనాలను నిలుపుదల చేయాలని స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రంలోనికి ప్రవేశించే వారికి విధిగా పాస్ ఉండాలని ఆయన చెప్పారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎక్కడ ఎక్కువ మంది గుమికూడరాదని ఆయన అన్నారు.

News May 28, 2024

నరసన్నపేటలో చైతన్యరథంపై ఎన్టీఆర్

image

1982 ఆగస్టులో ఎన్టీఆర్ నరసన్నపేట వచ్చారు. చైతన్యరథంపై ప్రచారం చేపట్టారు. కార్మికుడి డ్రెస్‌ వేసుకుని.. లక్ష్మీథియేటర్ సెంటర్లో ఉపన్యాసాలతో హోరెత్తించారు. ఎన్టీఆర్‌ను చూసేందుకు పేట వాసులతో పాటు చుట్టుపక్క గ్రామాల ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చారు. ప్రచార సభ అనంతరం.. ఎన్టీఆర్‌ నరసన్నపేట నుంచి తామరాపల్లి మీదుగా కోటబొమ్మాళి మండలం సుబ్బారాయుడుపేట వద్ద శివాలయంలో రాత్రి బస చేశారు.

News May 28, 2024

రాష్ట్ర చరిత్రలో భారీ భూకుంభకోణం: మూర్తి యాదవ్

image

ఎస్సీ,ఎస్టీ, బీసీలను సీఎస్ జవహర్ రెడ్డి అండ్ కో భయపెట్టి రూ.వేల కోట్ల విలువ చేసే భూములను దోచుకున్నారని జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఆయన మాట్లాడుతూ.. అసైన్డ్ భూముల బలవంతపు రిజిస్ట్రేషన్ల విషయమై తాను ఆరోపణలు చేసి 72 గంటలు అయినా సీఎస్ నుంచి సరైన సమాధానం లేదన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇది భారీ భూ కుంభకోణంగా పేర్కొన్నారు.

News May 28, 2024

నరసాపురంలో ఆలిండియా టోర్నీ.. గెలిస్తే రూ.64వేలు

image

నరసాపురంలోని అల్లూరి సత్యనారాయణ రాజు సాంస్కృతిక కేంద్రంలో మంగళవారంఆల్ ఇండియా ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నీ ప్రారంభమైంది. పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త నూలి శ్రీనివాస్ ఏడేళ్లుగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఏడాది జరుగుతున్న టోర్నీలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి రూ.64 వేల నగదు, జ్ఞాపికను బహుమతిగా అందజేయనున్నారు.

News May 28, 2024

సంబల్పూర్-కాచిగూడ-సంబల్పూర్ ప్రత్యేక రైళ్లు రద్దు

image

సంబల్పూర్ కాచిగూడ సంబల్పూర్ వేసవి ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. వచ్చే నెల 17, 24 (2 ట్రిప్పులు) తేదీల్లో నడపనున్న సంబల్పూర్ కాచిగూడ రైళ్లను రద్దు చేసామన్నారు. అలాగే కాచిగూడ సంబల్పూర్ వేసవి ప్రత్యేక రైళ్లను వచ్చే నెల 18, 25(రెండు ట్రిప్పులు) తేదీల్లో రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తక్కువ ఆక్యుపెన్సి కారణంగా వీటిని రద్దు చేశాయన్నారు.

News May 28, 2024

కడప: వైవీయూ డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

వైవీయూ అనుబంధ డిగ్రీ కళాశాలల బీఏ, బీబీఏ, బీకాం, బీఎస్‌సీ ఆరో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వీసీ ఆచార్య చింతా సుధాకర్ విడుదల చేశారు. వైవీయూలోని తన ఛాంబర్‌లో కులసచివులు ప్రొ. వై.పి వెంకటసుబ్బయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ. ఎన్ ఈశ్వర్ రెడ్డితో కలిసి పరీక్షా ఫలితాల గణాంకాలను పరిశీలించారు. బీఏ, బీబీఏలో 100 శాతం పాసయ్యారని, బీకాంలో 98.38 శాతం, బీఎస్సీలో 98.93 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.