Andhra Pradesh

News May 28, 2024

స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్

image

లేపాక్షి మండలం చోళసముద్రంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూములను మంగళవారం కలెక్టర్/హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబు పరిశీలించారు. అక్కడ ఉన్న సిబ్బందికి తగు జాగ్రత్తలు చెప్పారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News May 28, 2024

పలాసలో బాలుడి కిడ్నాప్‌కు యత్నం

image

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రాజమ్మ కాలనీకి చెందిన పదేళ్ల బాలుడు కుమార్ తన తల్లిని కలిసేందుకు సమీపంలో ఉన్న జీడి పరిశ్రమకు సోమవారం వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి బాలుడికి మాయమాటలు చెబుతూ తన వెంట ద్విచక్ర వాహనంపై తీసుకుపోయాడు. పలాస రైల్వే స్టేషన్ వైపు వెళుతున్న సమయంలో బాలుడు బిగ్గరగా ఏడుస్తూ ఉండటాన్ని స్థానికులు ప్రశ్నించడంతో బాలుడును వదిలి వెళ్లాడు.

News May 28, 2024

చంద్రగిరి: ఐదు నెలల్లోనే 26 మంది మృతి

image

తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై వేగానికి మించి వాహనాలు దూసుకెళ్తున్నాయి. దీనికి డ్రైవర్ల నిద్రమత్తు తోడవ్వడంతో చంద్రగిరి నుంచి గాదంకి టోల్‌ప్లాజా మధ్యలో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఐతేపల్లి పరిసరాల్లోనే చాలామంది చనిపోతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చంద్రగిరి పరిధిలోనే 26 మంది మృత్యువాత పడటం కలవరపెడుతోంది. నిన్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో నలుగురు <<13322392>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే.

News May 28, 2024

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

అనంతపురంలోని రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్లో ఎస్ఎస్ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మాల్ కాపియింగ్ చేయకుండా ఇన్విజిలేటర్లు అబ్జర్వ్ చేయాలని తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు రాయడానికి వెలుతురు, గాలి ఉండేటట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News May 28, 2024

నెల్లూరు: ఫస్ట్ ఆ ఓట్ల లెక్కింపే

image

జూన్ నెల 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియలో మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కమిషనర్ వికాస్ మర్మత్ తెలిపారు. అనంతరం 8.30 గంటల నుంచి ఈవిఎంల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులుగా శామ్యూల్, ప్రత్యూషలను ఎన్నికల సంఘం నియమించినట్లు కమిషనర్ వివరించారు.

News May 28, 2024

కృష్ణా: పాలిసెట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యేవారికి ముఖ్య సూచన

image

పాలిసెట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు కింది ధ్రువపత్రాలు తెచ్చుకోవాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు సూచించారు. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్‌ ఫీజు చెల్లించిన రసీదు, పాలీసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, SSC మార్కుల జాబితా, 4-10 తరగతుల స్టడీ, రెసిడెన్షియల్ సర్టిఫికెట్స్, EWS వర్తించే వారికి సంబంధిత ధ్రువపత్రాలు, ప్రత్యేక కేటగిరి నిర్ధారించే ధ్రువపత్రాలు తీసుకొని రావాలన్నారు.

News May 28, 2024

శ్రీ సత్యసాయి: పాము కాటుతో బాలిక మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా అగలి మండలం నందరాజనపల్లిలో ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న బాలికను సోమవారం అర్ధరాత్రి పాము కాటువేసింది. దీంతో నాలుగో తరగతి చదువుతున్న ఖుషీ అనే తొమ్మిదేళ్ల బాలిక మృతిచెందింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

News May 28, 2024

తిరుపతి: పరీక్షా ఫీజు చెల్లించండి

image

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షా ఫీజు చెల్లించడానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు జూన్ 5వ తేదీ లోపు పరీక్షా ఫీజు చెల్లించాలని తెలియజేశారు. మరిన్ని వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. జూన్ 18వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని అన్నారు.

News May 28, 2024

జూన్ 1 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జూన్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ శామ్యూల్ తెలిపారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. పదో తరగతి పరీక్షలకు 930 మంది, ఇంటర్ పరీక్షలకు 1,265 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండలో మొత్తం 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News May 28, 2024

మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కేకు బెయిల్.. కండిషన్లు ఇవే.!

image

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రతిరోజు పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని సూచించింది. మాచర్ల వెళ్లకూడదని, నరసరావుపేటలో ఎక్కడ ఉంటారో పూర్తి చిరునామా, మొబైల్ నంబర్‌ను పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అందజేయాలని పేర్కొంది. పాస్‌పోర్ట్‌ను కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది.