Andhra Pradesh

News May 28, 2024

ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలు

image

జిల్లా వ్యాప్తంగా మంగళవారం భానుడి ప్రతాపం వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతూ 11 గంటల సమయంలో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో పాటు ఉక్కపోత తోడవ్వడం సాధారణ జనజీవనానికి ఒకింత ఆటంకంగా ఏర్పడింది. పది, ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు, వారి సహాయకులు ఎండ తీవ్రతతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

News May 28, 2024

నెల్లూరు: పలు దుకాణాలు క్లోస్

image

ఆహార విక్రయ కేంద్రాల్లో పరిశుభ్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జరిమానాలు విధిస్తామని ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ హెచ్చరించారు. నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశాల మేరకు చిల్డ్రన్స్ పార్కు రోడ్డులో  వివిధ హోటళ్లు, బేకరీల ప్రాంగణాలను తనిఖీ చేశారు. పరిశుభ్రతా ప్రమాణాలను పాటించని వివిధ దుకాణాలకు 10 వేల రూపాయల జరిమానాలు విధించి, కొన్ని దుకాణాలను మూసివేశారు.

News May 28, 2024

కౌంటింగ్ రోజు ఏపీ అంతటా 144 సెక్షన్: ముకేశ్ కుమార్ మీనా

image

ఓట్ల లెక్కింపు రోజు జూన్ 4న పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. మంగళవారం డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో కలిసి పల్నాడు జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. కౌంటింగ్ రోజు రాష్ట్రమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పల్నాడు కలెక్టర్ శ్రీకేశ్ బాలాజీ రావు, ఎస్పీ మలికా గర్గ్, జేసీ శ్యాంప్రసాద్, డీఆర్వో వినాయకం, తదితరులు పాల్గొన్నారు.

News May 28, 2024

కడప: భయంతో విద్యార్థి ఆత్మహత్య

image

ఎంసెట్ లో తక్కువ మార్కులు వస్తాయన్న భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బ్రహ్మంగారిమఠంలో జరిగింది. గొడ్లవీడుకు చెందిన లక్కినేని చిన్నయ్య కూతురు ప్రతిభ(19) పులివెందులలో ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ పరీక్ష రాసింది. తాజాగా ఆమె కీ చూసుకోగా తక్కువ మార్కులు వస్తాయని భయపడి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 28, 2024

జామి వాటర్‌ ఫాల్స్‌లో ఇద్దరి మృతదేహాలు లభ్యం

image

జామి వాటర్ ఫాల్స్‌లో గల్లంతైన విజయనగరం కంటోన్మెంట్‌కు చెందిన<<13330025>> ముగ్గురు <<>>యువకులలో ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఇంకొకరి కోసం APSDRF బృందాల చేత గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తమ పిల్లల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.యువకుల మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News May 28, 2024

శ్రీకాకుళం: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఈస్ట్ కోస్ట్ రైల్వే

image

విశాఖపట్నం, పారాదీప్ మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌(నం.22810, 22809) ట్రైన్‌కు LHB(లింక్డ్ హాఫ్‌మన్ బుష్) కోచ్‌లు అమర్చామని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. అధునాతన LHB కోచ్‌లతో ఈ రైలులో ప్రయాణం సౌకర్యవంతంగా సాగుతుందని విశాఖపట్నం డివిజన్ రైల్వే మేనేజర్ సౌరబ్ ప్రసాద్ తెలిపారు. కాగా ఈ ట్రైన్ జిల్లాలో శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.

News May 28, 2024

29న గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్

image

అనంతపురం రూరల్ మండలంలోని కురుగుంట గురుకుల పాఠశాలలో ఈనెల 29న 5వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆ విద్యాలయాల సమన్వయకర్త మురళీకృష్ణ తెలిపారు. గతంలో రాసిన ప్రవేశ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేస్తామని చెప్పారు. బాలుర విభాగంలో 26, బాలికల విభాగంలో 12 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు.

News May 28, 2024

కృష్ణా: పీజీ పరీక్షల రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో ఫిబ్రవరి/మార్చి 2024లో నిర్వహించిన పీజీ పరీక్షలకు(ఇయర్ ఎండ్) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా నిర్ణీత ఫీజు రూ.960 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News May 28, 2024

కర్నూలు: గుండెపోటుతో హోంగార్డు మృతి

image

దేవనకొండ మండల పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు మంగళవారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండలంలో అందరికీ సుపరిచితుడైన శ్రీనివాసులు మృతి బాధాకరమని స్థానిక టీడీపీ నాయకుడు బడిగింజల రంగన్న ఆన్నారు.

News May 28, 2024

ద్వారకాతిరుమల శ్రీవారికి బంగారు కిరీటం బహూకరణ

image

ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవస్థానానికి మంగళవారం దాతలు స్వామి వారికి బంగారు కిరీటాన్ని బహూకరించారు. ఎం, శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు 139 గ్రాముల బంగారు కిరీటాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ అర్చకులు కిరీటాన్ని స్వామి వారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలకు స్వామి వారి ప్రసాదాలను అందజేశారు.