Andhra Pradesh

News May 28, 2024

జామి వాటర్‌ ఫాల్స్‌లో ఇద్దరి మృతదేహాలు లభ్యం

image

జామి వాటర్ ఫాల్స్‌లో గల్లంతైన విజయనగరం కంటోన్మెంట్‌కు చెందిన<<13330025>> ముగ్గురు <<>>యువకులలో ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఇంకొకరి కోసం APSDRF బృందాల చేత గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తమ పిల్లల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.యువకుల మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News May 28, 2024

శ్రీకాకుళం: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఈస్ట్ కోస్ట్ రైల్వే

image

విశాఖపట్నం, పారాదీప్ మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌(నం.22810, 22809) ట్రైన్‌కు LHB(లింక్డ్ హాఫ్‌మన్ బుష్) కోచ్‌లు అమర్చామని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. అధునాతన LHB కోచ్‌లతో ఈ రైలులో ప్రయాణం సౌకర్యవంతంగా సాగుతుందని విశాఖపట్నం డివిజన్ రైల్వే మేనేజర్ సౌరబ్ ప్రసాద్ తెలిపారు. కాగా ఈ ట్రైన్ జిల్లాలో శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.

News May 28, 2024

29న గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్

image

అనంతపురం రూరల్ మండలంలోని కురుగుంట గురుకుల పాఠశాలలో ఈనెల 29న 5వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆ విద్యాలయాల సమన్వయకర్త మురళీకృష్ణ తెలిపారు. గతంలో రాసిన ప్రవేశ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేస్తామని చెప్పారు. బాలుర విభాగంలో 26, బాలికల విభాగంలో 12 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు.

News May 28, 2024

కృష్ణా: పీజీ పరీక్షల రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో ఫిబ్రవరి/మార్చి 2024లో నిర్వహించిన పీజీ పరీక్షలకు(ఇయర్ ఎండ్) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా నిర్ణీత ఫీజు రూ.960 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News May 28, 2024

కర్నూలు: గుండెపోటుతో హోంగార్డు మృతి

image

దేవనకొండ మండల పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు మంగళవారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండలంలో అందరికీ సుపరిచితుడైన శ్రీనివాసులు మృతి బాధాకరమని స్థానిక టీడీపీ నాయకుడు బడిగింజల రంగన్న ఆన్నారు.

News May 28, 2024

ద్వారకాతిరుమల శ్రీవారికి బంగారు కిరీటం బహూకరణ

image

ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవస్థానానికి మంగళవారం దాతలు స్వామి వారికి బంగారు కిరీటాన్ని బహూకరించారు. ఎం, శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు 139 గ్రాముల బంగారు కిరీటాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ అర్చకులు కిరీటాన్ని స్వామి వారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలకు స్వామి వారి ప్రసాదాలను అందజేశారు.

News May 28, 2024

జామి వాటర్ ఫాల్స్‌లో గల్లంతైన వారి వివరాలు

image

జామి వాటర్ ఫాల్స్‌లో ముగ్గురు యువకులు గల్లంతైన<<13329808>> విషయం తెలిసిందే<<>>. వీరు విజయనగరం కంటోన్మెంట్‌కు చెందిన వారిగా గుర్తించారు. మొత్తం ఆరుగురు యువకులు వాటర్ ఫాల్స్ వద్దకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వీరిలో మహమ్మద్ రజక్(13), మహమ్మద్ షాహిద్ ఖాన్ (17), మహమ్మద్ ఆశ్రీఫ్ (16) గల్లంతు అయినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరిని రక్షించేందుకు విశాఖ నుంచి APSDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

News May 28, 2024

మార్కాపురం: లాయర్‌పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

image

న్యాయవాదిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు మార్కాపురం పట్టణ రెహమాన్ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. మార్కాపురం పట్టణంలోని కోర్టు సెంటర్లో ఈనెల 25న రాత్రి రసూల్ అనే న్యాయవాదిపై నిసార్ మొహమ్మద్ అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఆస్తుల వివాదానికి సంబంధించిన ఓ కేసులో న్యాయవాది రసూల్‌పై కక్ష పెంచుకొని దాడికి పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుడని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు.

News May 28, 2024

తొలి ఫలితం SC నియోజకవర్గాల్లో.. గెలుపు ఎవరిదో?

image

జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో ప్రారంభం కానుంది. కాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తొలి ఫలితాలు SC నియోజకవర్గాలైన నందిగామ, పామర్రుల నుంచి వెలువడనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరి ఈ తొలి ఫలితాల్లో ఎవరిది ( వైసీపీ or కూటమి ) పై చేయి కానుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి.

News May 28, 2024

విశాఖ: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్ల భర్తీపై పరిమితి ఎత్తివేత

image

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్ల భర్తీపై భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) పరిమితి ఎత్తివేసింది. డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 40 వరకు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉండగా, సుమారు 20 వేల వరకు సీట్లు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఒక్కో బ్రాంచ్‌లో 240 సీట్లు మాత్రమే భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది నుంచి ఆ పరిమితిని ఏఐసీటీఈ ఎత్తేసింది.