Andhra Pradesh

News May 28, 2024

మరో 7 రోజులే.. ప్రకాశంలో పట్టాభిషేకం ఎవరిది.?

image

ఓట్ల లెక్కింపు తేదీ జూన్ 4 వచ్చేస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 MLA, 2 MP స్థానాలు ఉండగా.. ఫలితాలకు మరో 7 రోజుల సమయమే ఉంది. ఓ వైపు ఉత్కంఠ నెలకొనగా, బెట్టింగులు జోరందుకున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో YCP 8 MLA, 2 MP, టీడీపీ 4 MLA స్థానాలను గెలుచుకుంది. తాజా ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఇరుపార్టీల నేతలు గెలుపుపై ధీమాగా ఉండగా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కామెంట్ చేయండి.

News May 28, 2024

జామి: స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతు

image

జాగారం గెడ్డ వద్ద ఉన్న వాటర్ ఫాల్స్‌లో స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతు అయిన ఘటన జామిలో చోటు చేసుకుంది. వివరాలు ప్రకారం విజయనగరం కంటోన్మెంట్‌కు చెందిన ముగ్గురు యువకులు మంగళవారం ఉదయం వాటర్ ఫాల్స్‌లో స్నానానికి దిగి గల్లంతు అయ్యారు. సమాచారం తెలుసుకున్న జామి ఎస్సై వీరబాబు ఆధ్వర్యంలో బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 28, 2024

విజయనగరం: నేడు అభ్యర్థులతో కలెక్టర్ సమావేశం

image

సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై వివరించే నిమిత్తం పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మంగళవారం ఉదయం 11.00 గంటలకు కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆయా నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు కూడా పాల్గొంటారు. ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవలిసిన నియమ నిభందనలు పార్టీల నేతలకు వివరిస్తారు.

News May 28, 2024

పాలీసెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం

image

పాలిటెక్నిక్ కాలేజిల్లో ప్రవేశానికి సంబంధించి పాలిసెట్- 2024లో అర్హత సాధించిన విద్యార్థులకు సోమవారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమైంది. గుంటూరు నల్లపాడులోని ఎంబీటీఎస్ పాలిటెక్నిక్ కాలేజి, నరసరావుపేట JNTUలో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మొదటి రోజు 1-12వేల ర్యాంకుల వరకూ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎంబీటీఎస్ హెల్ప్ లైన్ సెంటర్లో 65 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు.

News May 28, 2024

మరో 7 రోజులే.. కడపలో ఆధిపత్యం ఎవరిది.?

image

ఓట్ల లెక్కింపు తేదీ జూన్ 4 వచ్చేస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. ఫలితాలకు మరో 7 రోజుల సమయమే ఉంది. ఓ వైపు ఉత్కంఠ నెలకొనగా, మరోవైపు బెట్టింగులు జోరందుకున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో YCP క్లీన్ స్వీప్ చేయగా, తాజా ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఇరుపార్టీల నేతలు గెలుపుపై ధీమాగా ఉండగా, ఏ పార్టీది ఆధిపత్యం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News May 28, 2024

శ్రీ సత్యసాయి: SBI ఉద్యోగి అరెస్ట్

image

SBI కదిరి వ్యవసాయ శాఖ విభాగంలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకట నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన రూ.1.50 కోట్లకు పైగా నగదును ఇతర ఖాతాలకు మళ్లించి తాను వాడుకున్నట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో తేలింది. దీంతో SBI రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఈ ఏడాది మార్చిలో ఆయనపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.

News May 28, 2024

తిరుపతి: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

image

నెల్లూరు: ఇందుకూరుపేట(మం) నరసాపురం గ్రామానికి చెందిన శేషయ్య, శ్రీనివాసులు అన్నదమ్ములు. శేషయ్య భార్య జయంతి అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్రీనివాసులు భార్య నీరజ అనారోగ్యానికి గురయ్యారు. జయంతి, నీరజలకు మెరుగైన వైద్యం అందించడానికి అద్దెకారులో వేలూరు సీఎంసీ ఆసుపత్రికి వెళ్తుండగా నిన్న చంద్రగిరిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు శేషయ్య, పద్మమ్మ, జయంతి దుర్మరణం చెందారు

News May 28, 2024

గుడివాడతో ఎన్టీఆర్‌కు ప్రత్యేక అనుబంధం

image

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌‌కు గుడివాడతో ప్రత్యేక అనుబంధం ఉంది. టీడీపీ స్థాపన అనంతరం జరిగిన 1983, 85 ఎన్నికలలో ఎన్టీఆర్ గుడివాడ నుంచి పోటీ చేసి విజయదుందుభి మోగించారు. అనంతరం ఆయన స్మారకార్థం గుడివాడలో ఎన్టీఆర్ పేరు మీద స్టేడియం నిర్మించారు. రెండు సార్లు తనను గెలిపించి అసెంబ్లీకి పంపించిన గుడివాడ గురించి ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా చెబుతుండేవారు. నేడు ఎన్టీఆర్ జయంతి.

News May 28, 2024

తొలి రోజు కౌన్సెలింగ్ లో 243 మంది హాజరు

image

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పాలిసెట్‌ కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ కేంద్రంలో తొలి రోజు 1 నుంచి 12 వేల లోపు ర్యాంకు వచ్చిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు 243 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం 12,001 నుంచి 27,000 వరకు ర్యాంకు వచ్చిన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన జరగనుంది.

News May 28, 2024

నెల్లూరులో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

image

ఇందుకూరుపేట(మం) నరసాపురం గ్రామానికి చెందిన శేషయ్య, శ్రీనివాసులు అన్నదమ్ములు. శేషయ్య భార్య జయంతి అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్రీనివాసులు భార్య నీరజ అనారోగ్యానికి గురయ్యారు. జయంతి, నీరజలకు మెరుగైన వైద్యం అందించడానికి అద్దెకారులో వేలూరు సీఎంసీ ఆసుపత్రికి వెళ్తుండగా నిన్న చంద్రగిరిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు శేషయ్య, పద్మమ్మ, జయంతి దుర్మరణం చెందారు.