Andhra Pradesh

News May 28, 2024

తొలి రోజు కౌన్సెలింగ్ లో 243 మంది హాజరు

image

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పాలిసెట్‌ కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ కేంద్రంలో తొలి రోజు 1 నుంచి 12 వేల లోపు ర్యాంకు వచ్చిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు 243 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం 12,001 నుంచి 27,000 వరకు ర్యాంకు వచ్చిన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన జరగనుంది.

News May 28, 2024

నెల్లూరులో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

image

ఇందుకూరుపేట(మం) నరసాపురం గ్రామానికి చెందిన శేషయ్య, శ్రీనివాసులు అన్నదమ్ములు. శేషయ్య భార్య జయంతి అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్రీనివాసులు భార్య నీరజ అనారోగ్యానికి గురయ్యారు. జయంతి, నీరజలకు మెరుగైన వైద్యం అందించడానికి అద్దెకారులో వేలూరు సీఎంసీ ఆసుపత్రికి వెళ్తుండగా నిన్న చంద్రగిరిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు శేషయ్య, పద్మమ్మ, జయంతి దుర్మరణం చెందారు.

News May 28, 2024

కర్నూలు: ప్రజల్లో ఉత్కంఠ.. 7 రోజుల్లో భవితవ్యం

image

‘ఈసారి కూడా కచ్చితంగా ఆయనే గెలుస్తాడు. లేదు లేదు ఈసారి తప్పక గెలుపు ఇతనిదే.’ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పల్లెలను మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు ఎక్కడ చూసినా ప్రజల నోట వినిపిస్తున్న మాటలివి. సరిగ్గా ఇవాల్టి రోజే (JUN-4)న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు/DEOలు కౌంటింగ్‌ నిర్వహణ కోసం చర్యలు చేపడుతున్నారు. మరి మీ నియోజకవర్గంలో ఈసారి గెలుపు ఎవరిని వరించేనో కామెంట్ చేయండి.

News May 28, 2024

టెంకాయల అలంకరణలో తాతయ్యగుంట గంగమ్మ

image

తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర అనంతరం తొలి మంగళవారం ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇస్తుంది. ఉదయం గంగమ్మకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం టెంకాయలతో అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. జాతర తరువాత ఐదు వారాల పాటు మారు పొంగళ్లు పేరుతో అమ్మవారికి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. తొలి వారం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు.

News May 28, 2024

విశాఖ: కేంద్ర కారాగారంలో ఈ-ములాఖత్ సేవలు

image

జైళ్ల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేంద్ర కారాగారంలో ఈ-ములాఖత్ విధానం సోమవారం నుంచి అమలులోకి తెచ్చినట్లు కారాగారం పర్యవేక్షకుడు ఎస్.కిషోర్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు ఖైదీలతో వారి కుటుంబ సభ్యులు మాట్లాడాలంటే జైలుకి వచ్చి జైలు నిబంధనలు మేరకు మాట్లాడే అవకాశం ఉండేది. దూరం నుంచి రావటం.. సమయంతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా ఖైదీల కుటుంబ సభ్యులకు భారమవుతుందనే ఉద్దేశంతో ఈ విధానం అమల్లోకి తెచ్చారు.

News May 28, 2024

జియ్యమ్మవలస: కుక్కను చంపిన గ్రామస్థులు

image

జియ్యమ్మవలస మండలం బిత్రపాడు గ్రామంలో మనుషులపై దాడి చేసి చంపిన<<13322804>> కుక్కలను<<>> గ్రామస్థులు వేటాడుతున్నారు. నాలుగు కుక్కలు 15 రోజుల ముందు బంటు. లక్ష్మీ అనే వృద్ధురాలిపై, నిన్న నీరస. శంకర రావు అనే వ్యక్తిపై దాడిచేసి చేయగా వారు మృతిచెందారు. దీంతో గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులు చర్యలు ముమ్మరం చేయలేదంటూ వారే ఒక కుక్కను చంపారు.

News May 28, 2024

REWIND: టెక్కలిలో ఎన్టీఆర్ పర్యటనలు

image

నందమూరి తారకరామారావు తన రాజకీయ ప్రస్థానంలో పలుమార్లు టెక్కలిలో పర్యటించారు.1983లో టెక్కలిలో చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 1985లో మధ్యంతర ఎన్నికల్లో పర్యటించారు. 1987లో టెక్కలిలో కరువు సంభవించడంతో పర్యటించారు. 1988లో వంశధార కాలువ నీరు నిలిచిపోవడంతో పర్యటించి సమస్య పరిష్కరించారు. 1994లో టెక్కలిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 1995లో రూ.10కోట్లతో ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు.

News May 28, 2024

కడప జిల్లాలో తల్లులకు తప్పని కడుపు కోత

image

కడప జిల్లాలో సిజేరియన్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. WHO సంస్థ ప్రకారం 15 శాతం వరకు సిజేరియన్లకు అవకాశం ఉంటే.. జిల్లాలో మాత్రం ఆ సంఖ్య 50పైనే ఉంటుంది. 2023-24లో ప్రభుత్వ ఆసుపత్రిలో 10,890 ప్రసవాలు జరగ్గా అందులో 4,916 సిజేరియన్లే. అదే ప్రైవేట్ ఆస్పత్రిలో 22,667 ప్రసవాలు జరగ్గా ఏకంగా 14,346 మంది తల్లుల కడుపును డాక్టర్లు కోశారు. కొన్ని ఆస్పత్రిల్లో ఈ సంఖ్య 80 శాతంపైనే ఉంటోంది.

News May 28, 2024

కోనసీమ జిల్లాలో తొలి ఫలితం వెలువడేది అక్కడే..!

image

కోనసీమ జిల్లాలో తొలి ఫలితం రాజోలు నియోజకవర్గంలో వెలువడనుంది. అనంతరం అమలాపురం రూరల్ మండలం, పాలగుమ్మి, బండారులంక నుంచి ప్రారంభమవుతుంది. పి.గన్నవరంలోని ఆదుర్రు, రామచంద్రపురంలోని కొత్తూరు, ముమ్మిడివరంలోని గురజాపులంకలో వెలువడనున్నాయి. తర్వాత కేశవరం, మండపేటతో ఓట్ల లెక్కింపు ముగియనుంది.

News May 28, 2024

విజయవాడలో సీఎం జగన్‌పై దాడి కేసులో నేడు తీర్పు

image

ఏప్రిల్ 13న విజయవాడలో జగన్‌పై గులకరాయి దాడి కేసు విచారణలో భాగంగా నేడు తీర్పు రానుంది. ఈ కేసు విచారిస్తున్న విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు మంగళవారానికి తీర్పును రిజర్వ్ చేసింది. కేసు విచారణలో భాగంగా అరెస్టైన సతీశ్‌ను అక్రమంగా ఇరికించారని అతడి తరఫు లాయర్ సలీం కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ సతీశ్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనుంది.