Andhra Pradesh

News May 28, 2024

ఏలూరు: పోలీసుల గస్తీ.. ప్రతి వాహనం పరిశీలన

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి వేళలో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓట్ల లెక్కింపు జరిగే వరకు అన్ని ప్రాంతాలలో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ముందస్తు చర్యల్లో భాగంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

News May 28, 2024

చిత్తూరు: 1నుంచి అమల్లోకి నూతన ట్రాఫిక్ చట్టం

image

జూన్ 1 నుంచి నూతన ట్రాఫిక్ చట్టాలు అమలులోకి రానున్నట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. నిబంధనలు పాటించిన వారిపై భారీ జరిమానా విధిస్తామన్నారు. మైనర్లకు వాహనాలను ఇస్తే తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు రూ. 25వేల జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామన్నారు. తాగి వాహనాలు నడిపితే రూ.10 వేల జరిమానా విధించడంతో పాటు ఆరు నెలల జైలు శిక్షను విధిస్తామని వివరించారు.

News May 28, 2024

గుంటూరు: రైలు పట్టాలు తప్పిన ఘటనపై విచారణకు కమిటీ

image

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఆదివారం సరకుల రైలు పట్టాలు తప్పిన ఘటనపై విచారణకు కమిటీని నియమిస్తూ మండల రైల్వే అధికారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో సీనియర్ అధికారులను నియమించారు. సీనియర్ డీఈఎన్(కోఆర్డినేషన్), సీనియర్ డీఎస్వో, సీనియర్ డీఎంఈ, సీనియర్ డీఎంవో ఉన్నారు. ఈ కమిటీ సభ్యులు తమ నివేదికను జూన్ 2 లోపు ఇవ్వాలి. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు.

News May 28, 2024

అంతర్జాతీయ స్థాయికి కడప లెక్చరర్ 

image

కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్న డాక్టర్ బి.సుధాకర్ రెడ్డికి కాలిఫోర్నియాకు చెందిన ‘స్కాలర్ జీపీఎస్’ సంస్థ అధ్యయనంలో ఉత్తమ పరిశోధకుడిగా అవకాశం దక్కింది. స్కాలర్ జీపీఎస్ ర్యాకింగ్ అనలైటిక్స్‌లో భౌతికశాస్త్ర విభాగంలో ఈయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌతికశాస్త్ర పరిశోధకుల్లో చోటు దక్కించుకున్నాడు. పలువురు ఆయన్ను అభినందించారు. 

News May 28, 2024

నెల్లూరు: మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు నమోదు

image

సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళలకు నగదు పంపిణీ చేసిన వ్యవహారంపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అప్పట్లోనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందిచకపోవడంతో మూడు రోజుల క్రితం కాకాణి మీడియా సమావేశం నిర్వహించి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించారు. దీంతో జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై కేసు నమోదు చేసింది.

News May 28, 2024

పామర్రులో తొలి ఫలితం వచ్చే అవకాశం

image

కృష్ణా జిల్లాకు సంబంధించి జూన్ 4న మచిలీపట్నంలోని కృష్ణా వర్సిటీలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అన్ని నియోజకవర్గాలకు 14 టేబుళ్లు ఏర్పాటు చేసి లెక్కింపు పక్రియ కొనసాగిస్తారు. కాగా, జిల్లాలో తొలి ఫలితం పామర్రుది వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ రౌండ్ల సంఖ్య 17 కాగా, అభ్యర్థులు 8 మందే పోటీలో ఉన్నారు. దీంతో తొలి ఫలితం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని తర్వాత మచిలీపట్నం ఫలితం రావొచ్చని చెబుతున్నారు.

News May 28, 2024

ప్రకాశం: ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజిల్లో 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా జూన్ 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత పత్రాలను ప్రింట్ తీసుకోని తమ వద్ద ఉంచుకోవాలన్నారు. 

News May 28, 2024

అనంతపురం జిల్లా సీనియర్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా గిరినాథ్ రెడ్డి

image

కడపలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న సౌత్ జోన్ అంతర్ జిల్లా సీనియర్ వన్డే క్రికెట్ పోటీల్లో పాల్గొనే అనంతపురం జట్టుకు గిరినాథ్ రెడ్డిని కెప్టెన్‌గా నియమించారు. ఈయన రంజీ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 3 వరకు ఈ పోటీలు నిర్వహిస్తారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా కూడా పాల్గొంటుందని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి మధు ఆచారి తెలిపారు.

News May 28, 2024

కొవ్వూరు: రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

image

కృష్ణా జిల్లా కోడూరుపాడు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొవ్వూరుకు చెందిన స్వామినాథన్, రాజేశ్, రాధాప్రియ, స్వామి నాథన్ అన్న కుమారుడు మృతి చెందారు. తమిళనాడుకు చెందిన స్వామినాథన్ 15 ఏళ్ళ క్రితం కుటుంబంతో వచ్చి కొవ్వూరులో స్థిరపడ్డారు. కుమారుడు రాజేశ్, కూతురు రాధ తమిళనాడులో చదువుతున్నారు. వేసవి సెలవులకు కొవ్వూరు వచ్చిన వీరు తిరిగి సోమవారం కారులో తమిళనాడు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

News May 28, 2024

బాడంగి: నలుగురు జూదరుల అరెస్ట్

image

బాడంగి మండలం బ్రహ్మన్నవలస గ్రామ శివారులో జూదం ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసి రూ.16,400 స్వాధీనం చేసుకున్నట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ జయంతి సోమవారం నాడు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.