India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నెల్లూరు(D)లోని ఆ శాఖా ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ, ప్రత్యేకమైన వీడియోల పోటీలకు జిల్లా పర్యాటక అధికారి ఉషశ్రీ ఓ ప్రకటన విడుదల చేశారు. చూడదగిన ప్రదేశాలు, సాంస్కృతిక వారసత్వ కోటలు, జలపాతాలు, ఈకో-టూరిజం, స్థానిక వంటకాలు తదితరాలను ప్రోత్సహించేలా సృజనాత్మకత ఉన్న వారు ఈ పోటీలకు అర్హులన్నారు. వివరాలకు 94936 68022, 77807 49802 నంబర్లకు 20వ తేదీలోపు సంప్రదించాలన్నారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి పదేళ్లు పూర్తవుతున్న వేళ మరో మైలురాయిని చేరుకుంది. 2015లో ప్రారంభమై 89 రోజుల్లోనే 8.3 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు అందించి రైతుల ఊపిరిగా మారింది. ఆ తరువాత 2015-19లో 263 టీఎంసీలు, 2019-24లో 165 టీఎంసీలు, ఈ ఏడాది ఇప్పటి వరకు 11.05 టీఎంసీలు చేరాయి. మొత్తంగా 439 టీఎంసీలు మళ్లించిన ఈ పథకం డెల్టా రైతులకు ఆపద్బాంధవంగా నిలిచింది.
విజయనగరం జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి బబిత ఉమ్మడి జిల్లా న్యాయవాదులతో బుధవారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. వచ్చేనెల 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను న్యాయవాదులు విజయవంతం చేయాలని సూచించారు. రాజీకు వచ్చే ప్రమాద బీమా క్లెయిమ్ కేసులు, అన్ని సివిల్ దావాలు, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, బ్యాంకు, తదితర కేసులకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.
విజయనగరం జిల్లాలో ప్రస్తుతం 200 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ అంబేడ్కర్ చెప్పారు. బుధవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు ఐపీఎల్ కంపెనీ నుంచి కేటాయించిన 700 మెట్రిక్ టన్నులు మార్గమధ్యంలో ఉందని, ఒకటి రెండు రోజుల్లో జిల్లాకు చేరునుందన్నారు. అదేవిధంగా రైలు మార్గం ద్వారా కాకినాడ నుంచి ఇంకొక 500 మెట్రిక్ టన్నులు 3 రోజుల్లో వస్తుందన్నారు.
విశాఖలో రాత్రి సమయంలో ఆర్టీసీ బస్సులు అదనపు సర్వీసులు నిర్వహించాలని పలువురు ప్రయాణికులు కోరారు. బుధవారం జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు డైల్ యువర్ ఆర్‌ఎం ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు ఆయనకు పలు సూచనలు చేశారు. కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ సర్వీసులు వేయాలని కోరారు. నిర్ణీత సమయానికి గమ్యస్థానాలకు చేరుకునే విధంగా బస్సులు నడపాలన్నారు.
నేపాల్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎవరైనా అక్కడ ఇబ్బందులు పడుతున్నట్లయితే, వారి వివరాలు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి బుధవారం కోరారు. అటువంటి వారికి సహాయం అందించేందుకు రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో 24×7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. అవసరమైనవారు 8977935611 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆమె కోరారు.
రసాయన రహిత వ్యవసాయ సాగుపై రైతులు దృష్టి సారించాలని, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ద్వారా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంలో భాగంగా కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటికే జిల్లాలో 75 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు నడుస్తోందన్నారు.
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి కడప జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతుందని కలెక్టర్ శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేపాల్‌లో ఉన్న ఏపీ వాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో కంట్రోల్ రూమ్ నంబర్ 08562-246344 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కృష్ణా జిల్లాలో యూరియా సరఫరా సక్రమంగా జరుగుతోందని కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం చల్లపల్లి మండలం లక్ష్మీపురం పీఏసీఎస్ వద్ద యూరియా విక్రయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా సరఫరా, పొందిన రైతుల వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఐ కృష్ణమోహన్, ఏఓ కే.మురళీకృష్ణ, సొసైటీ సీఈఓ రమేశ్, వీఆర్ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లాలో ముగ్గురు ఏఎస్ఐలకు ఎస్ఐగా పదోన్నతి లభించింది. 1989 బ్యాచ్‌కు చెందిన కేఏవీ ప్రసాదరావు, కె. గణేష్, కె. వెంకటేశ్వరరావులకు ఈ పదోన్నతి దక్కింది. వీరిని ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రత్యేకంగా అభినందించారు. పట్టుదల, నిబద్ధత, విధేయత కారణంగానే ఈ పదోన్నతి సాధ్యమైందని ఎస్పీ అన్నారు. పదోన్నతితో బాధ్యతలు మరింత పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.