Andhra Pradesh

News May 28, 2024

నందిగామ ఫలితం 4 గంటల్లోనే..

image

జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ జిల్లాలో తొలి ఫలితం నందిగామ నుంచి రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 4 గంటల్లోనే ఇక్కడ విజేత ఎవరో తేలిపోనుంది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి నిమ్రా, నోవా కాలేజీల్లో లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే.

News May 28, 2024

నెల్లూరు: బాలికను రెండో పెళ్లి చేసుకునేందుకు యత్నం

image

సంగం మండలంలోని ఓ బాలికను ఆటో డ్రైవర్ రెండో పెళ్లి చేసుకునేందుకు యత్నించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన బాలిక పక్క గ్రామంలో ఉన్న పాఠశాలకు షేక్ బాదుషా అనే వ్యక్తి ఆటోలో వెళ్తుండేది. కాగా వివాహం జరిగి ఇద్దరు పిల్లలున్న అతను.. బాలికపై కన్నేసి తన ఆటోలో పక్కనే కూర్చొబెట్టుకుని అశ్లీల వీడియోలు చూపిస్తూ అసభ్యకరకంగా ప్రవర్తించేవాడు. చివరికి వివాహం చేసుకునే కుట్రకు పాల్పడ్డాడు.

News May 28, 2024

కురిచేడు: కరెంట్ షాక్‌తో నాలుగు గేదెల మృతి

image

కరెంట్ షాక్‌తో నాలుగు గేదెలు మృతి చెందిన ఘటన కురిచేడు మండలంలో సోమవారం జరిగింది. గంగదొనకొండ గ్రామంలో గోదాల సుబ్బారెడ్డి, కర్నాటి పెద్ద వెంకటరెడ్డి, బెండయ్య గేదెలు పొలాల్లో గడ్డి తింటుండగా మధ్యాహ్నం అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో సమీపంలో ఉన్న పొలాలలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. గేదెలు వాటిని తగలండంతో నాలుగు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

News May 28, 2024

చిత్తూరు: 65 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

image

ఎన్నికల విధులకు గైర్హాజరైన 65 మందిని సస్పెండ్ చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ సోమవారం పేర్కొన్నారు. విధులకు హాజరుకాని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా, కొందరు రాతపూర్వక సంజాయిషీ ఇచ్చారని తెలిపారు. సంతృప్తికర సమాధానం ఇవ్వని సిబ్బందిని ఎన్నికల నిబంధనల మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు.

News May 28, 2024

వేంపల్లి: విద్యుత్ షాక్‌తో బాలుడి మృతి

image

వేంపల్లిలో సోమవారం విషాదం నెలకొంది. కడప రోడ్డులో ఉన్న వాటర్ సర్వీసింగ్ సెంటర్లో పనిచేస్తున్న స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన ఊటుకూరు మనోజ్ అనే బాలుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. కారుకు నీటితో సర్వీసింగ్ చేస్తుండగా పొరపాటున నీరు మోటార్‌పై పడి మనోజ్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో చికిత్స కోసం బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News May 28, 2024

ఉమ్మడి అనంత జిల్లాలో రానున్న 5 రోజుల పాటు వర్షాలు

image

నైరుతి రుతుపవనాల రాక నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వచ్చే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. ఐదు రోజుల్లో రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం మీదుగా లక్షద్వీప్, కేరళ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయని చెప్పారు. ఈ ప్రభావంతో జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.

News May 28, 2024

గుంటూరులో వ్యభిచార ముఠా అరెస్ట్

image

వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను సోమవారం గుంటూరు నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. శ్రీనివాసరావుపేటలో లత అనే మహిళ ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. కొద్దిరోజులుగా గుట్టుచప్పుడు కాకుండా ఆ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తోంది. సోమవారం సీఐ మధుసూదన్ రావు ఆ ఇంటిపై తనిఖీలు చేసి ఇద్దరు మహిళలు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిర్వాహకురాలిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

News May 28, 2024

అభ్యర్థులు శాంతిభద్రతలకు సహకరించండి: బాపట్ల కలెక్టర్

image

బాపట్లలోని 8 నియోజకవర్గాలకు సంబంధించి జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. బాపట్లలోని కలెక్టరేట్‌లో పోటీలో ఉన్న అభ్యర్థులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ అయిపోయిన మరుసటి రోజు కూడా శాంతి భద్రతలకు సహకరించాలన్నారు.

News May 28, 2024

కర్నూలు: ఓట్ల లెక్కింపు విజయవంతంగా నిర్వహించండి- సీఈసీ

image

ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ, కచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈవోలు, నియెజకవర్గాల ఆర్వోలు, జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News May 28, 2024

శ్రీకాకుళం: కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరగాలి: కలెక్టర్

image

జూన్ 4తేదిన కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగే విధంగా ప్రతీ ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ జి.ఆర్.రాధికతో కలిసి ఎచ్చెర్ల మండలంలోని శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలను ఇరువురు సందర్శించారు. అనంతరం కౌంటింగ్ రోజున తీసుకోవలసిన జాగ్రత్తలు, భద్రత ఏర్పాట్లును పరిశీలించారు. కౌంటింగ్ రోజున పటిష్ఠమైన భద్రత ఉండాలన్నారు.