Andhra Pradesh

News May 28, 2024

కర్నూలు: ఓట్ల లెక్కింపు విజయవంతంగా నిర్వహించండి- సీఈసీ

image

ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ, కచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈవోలు, నియెజకవర్గాల ఆర్వోలు, జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News May 28, 2024

శ్రీకాకుళం: కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరగాలి: కలెక్టర్

image

జూన్ 4తేదిన కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగే విధంగా ప్రతీ ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ జి.ఆర్.రాధికతో కలిసి ఎచ్చెర్ల మండలంలోని శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలను ఇరువురు సందర్శించారు. అనంతరం కౌంటింగ్ రోజున తీసుకోవలసిన జాగ్రత్తలు, భద్రత ఏర్పాట్లును పరిశీలించారు. కౌంటింగ్ రోజున పటిష్ఠమైన భద్రత ఉండాలన్నారు.

News May 28, 2024

పార్వతీపురంలో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్

image

పార్వతీపురం జిల్లా ఎస్పీ విక్రాంత్ ఈ పాటిల్ ఆదేశాల మేరకు ఏఆర్ డిఎస్పీ ఆర్మర్డ్ రిజర్వుడు, స్పెషల్ పార్టీ పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ సోమవారం నిర్వహించారు. జూన్ 4న, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మాబ్ డ్రిల్ నిర్వహించారు. జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉన్నందున శాంతియుతంగా ఉండాలని కోరారు.

News May 28, 2024

సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు: సత్యసాయి కలెక్టర్

image

జూన్ 4వ తేదీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం సమీపాన గల బిట్ కళాశాల, లేపాక్షి మండలంలోని చోళ సముద్రం వద్ద కల అంబేద్కర్ పాఠశాలలో జరుగు ఓట్ల లెక్కింపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుందని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఈవీఎంల లెక్కింపు కొరకు మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేశామని, ఓట్ల లెక్కింపు గదులలో సీసీ కెమెరా, వీడియోగ్రఫీ నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు.

News May 28, 2024

ఏలూరు: స్ట్రాంగ్‌రూమ్‌లను పరిశీలించిన SP

image

ఏలూరు జిల్లా కేంద్రంలోని సీఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను SP మేరీ ప్రశాంతి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అధికారులకు సూచించారు.  

News May 28, 2024

కడప: స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన జిల్లా ఎస్పీ

image

కడప జిల్లాకు సంబంధించి ఈవీఎం మిషన్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బందోబస్తు భద్రతపై సిబ్బందితో చర్చించారు. 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. జూన్ 4 వరకు బందోబస్తులో ఎటువంటి అలసత్వం వహించరాదని సిబ్బందికి సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు.

News May 28, 2024

బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై కలెక్టర్ సూచనలు

image

నెల్లూరు: పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై కౌంటింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేది ప్రియదర్శిని కాలేజీలో జరుగుతుందన్నారు.

News May 28, 2024

గుంటూరు: కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలించిన ముకేశ్ కుమార్ మీనా

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూములను కౌంటింగ్ ఏర్పాట్లను సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా పరిశీలించారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్ కీర్తి చేకూరి, ఎస్పీ తుషార్‌తో కలిసి స్ట్రాంగ్ రూంలో భద్రత ఏర్పాట్లను, సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని రకాల భద్రత చర్యలు తీసుకున్నామని మీనా తెలిపారు.

News May 28, 2024

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మాయాబజార్ రీరిలీజ్

image

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, SV రంగారావు నటించిన ‘మాయాబజార్'(1957) సినిమా ఈ నెల 28న రీరిలీజ్(కలర్ ప్రింట్) కానుంది. ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి సందర్బంగా విజయవాడలోని ఊర్వశి కాంప్లెక్స్, స్వర్ణ మల్టీఫ్లెక్స్ థియేటర్‌లలో ఈ సినిమా 28, 29వ తేదీలలో రెండు రోజులపాటు ప్రదర్శించనున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది.

News May 28, 2024

CTR: కౌంటింగ్‌కు పటిష్ఠ బందోబస్తు

image

చిత్తూరు: ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, పటిష్ఠంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ షన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జూన్ 4న కౌంటింగ్‌కు పటిష్ఠమైన బందోబస్తు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.