Andhra Pradesh

News May 27, 2024

కర్నూలు: ఇద్దరికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

image

కర్నూలు జిల్లా టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి, ఎమ్మిగనూరుకి చెందిన బైలుప్పల షఫీయుల్లాకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే వేడుకల్లో అవార్డు అందుకోనున్నారు. ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా కళా రంగానికి సేవ చేస్తున్న తమను టీడీపీ గుర్తించిందన్నారు.

News May 27, 2024

నెల్లూరు జిల్లాలో వరుస ప్రమాదాలు

image

నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద సోమవారం ఆటో బోల్తా పడింది. కడపకు చెందిన కరీమున్నీసా మృతిచెందింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇవాళ ఒక్కో రోజే అనంతసాగరం, ఏఎస్ పేట, సైదాపురం, మనుబోలు మండలాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు చనిపోగా.. చంద్రగిరి వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామస్థులు నలుగురు కన్నుమూశారు.

News May 27, 2024

కృష్ణా: డిగ్రీ, పీజీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున వర్సిటీ (డిస్టెన్స్) 2024 ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించిన పలు పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ మేరకు అన్ని పీజీ కోర్సులు (ఇయర్ ఎండ్), బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ (BLISC) డిగ్రీ కోర్సుల ఫలితాలు నేడు విడుదల చేశామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఫలితాలకు http://www.anucde.info/ అధికారిక వెబ్‌సైట్ను సందర్శించాలని సూచించారు.

News May 27, 2024

CTR: పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

image

జిల్లాలో ఓ ప్రేమ జంట పోలీసుల రక్షణ కోరింది. చిత్తూరుకు చెందిన రితిక, రామసముద్రం(M) సింగంవారిపల్లికి చెందిన పి.సాకేత్ కుమార్ ప్రేమించుకున్నారు. తిరుమలలో పెళ్లి చేసుకున్నారు. పెద్దల నుంచి ప్రాణహాని ఉందని రామసముద్రం పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ చంద్రశేఖర్ రితిక తల్లిదండ్రులకు ఫోన్ చేయగా వాళ్లు రాలేదు. చివరకు ఎస్ఐ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడారు. రితికను బాగా చూసుకోవాలని చెప్పి వాళ్లతో పంపారు.

News May 27, 2024

ప.గో.: కూటమి అభ్యర్థి గెలుపు కోసం.. మోకాళ్లపై మెట్లెక్కి

image

ప.గో. జిల్లా పెంటపాడు మండలం రావిగుంటకు చెందిన పెంకి శ్రీను కూటమి అభ్యర్థి గెలుపు కోసం మోకాళ్లపై గుడిమెట్లు ఎక్కి మొక్కు చెల్లించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని కోరుతూ సోమవారం దేవరపల్లి మండలం గౌరీపట్నం నిర్మలగిరి మేరీ మాత మందిరాన్ని దర్శించారు. ఈ సందర్భంగా 350 మెట్లను మోకాళ్ళపై ఎక్కి మొక్కు తీర్చుకున్నట్లు శ్రీను తెలిపారు.

News May 27, 2024

నెల్లూరు: ఈవీఎం గోడౌన్ పరిశీలన

image

నెల్లూరు ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్‌ను కలెక్టర్ ఎం.హరి నారాయణన్ పరిశీలించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడి పనుల పురోగతిని అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. త్వరగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.

News May 27, 2024

రేపు పెన్నఅహోబిలం మహా రథోత్సవం.. స్పెషల్ స్టోరీ

image

14,15 శాతబ్దాల్లో విజయనగర రాజులు పెన్నఅహోబిలం ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ స్వామివారి పాదం కింద ఓ బిలం ఉంది. అభిషేకం చేసిన నీళ్లు ఈ బిలం గుండా వెళ్లి పెన్నా నదిలో కలుస్తాయి. అందువల్లనే ఈ క్షేత్రానికి పెన్నఅహోబిలం అనే పేరు వచ్చింది. ద్వాపరయుగంలో ఉద్ధాలక మహర్షి ఘోర తపస్సు చేయగా స్వామి ప్రసన్నుడై తన కుడి పాదం పెన్నఅహోబిలంపై ఎడమ కాలు అహోబిలంపై మోపినట్లు ఇక్కడి శాసనాలు, పురాణాలను బట్టి తెలుస్తోంది.

News May 27, 2024

ప్రకాశం: చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి

image

చెరువులో చేపలు పట్టేందుకు వెళ్ళి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇంకొల్లు మండలం నలతోటివారిపాలెంలో సోమవారం చోటు చేసుకుంది. గంగవరం గ్రామానికి చెందిన యాడికిరి సుబ్రహ్మణ్యం (50) చేపలు పట్టేందుకు చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు ఊపిరాడక మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మల్లిఖార్జునరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News May 27, 2024

పదో తరగతి కొత్త పుస్తకంలో ‘దేవరగట్టు’ అంశం

image

కర్నూలు జిల్లాకు నూతన పాఠ్యపుస్తకాలు చేరాయి. రాష్ట్రంలో సంప్రదాయాలు, ప్రజల నమ్మకాలు తెలియజేయడంలో భాగంగా పదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో విజయదశమి రోజు అర్ధరాత్రి జరిగే బన్నీ జైత్రయాత్ర, కర్రల ఊరేగింపు(సమరం) గూర్చిన చరిత్ర ప్రచురించారు. దీంతో జిల్లా తెలుగు పండితులు, అధ్యాపకులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

News May 27, 2024

ఫైర్ క్రాకర్ల తయారీ, అమ్మకం, కొనుగోలుపై నిషేధం: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో ఫైర్ క్రాకర్ల తయారీ, అమ్మకం, కొనుగోలు, వినియోగం, రవాణాపై నిషేధం విధించినట్టు సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతల పరిరక్షణ శరీరంలో భాగంగా జూన్ 5వ తేదీ వరకు ఎక్కడ తయారీ, అమ్మకాలు, రవాణా జరగకూడదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.