Andhra Pradesh

News May 27, 2024

ప్రవర్తన మారకుంటే తాట తీస్తాం: ప్రకాశం పోలీసులు

image

ఎస్పీ సుమిత్ గరుడ్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు
సోమవారం పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేరాల జోలికెళ్లకుండా బుద్ధిగా జీవించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రవర్తన మార్చుకోవాలని, సత్ప్రవర్తన ఒక్కటే మంచి మార్గమన్నారు.

News May 27, 2024

నెల్లూరు: యువకుడి స్పాట్‌డెడ్

image

జిల్లాలోని మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద హైవేపై సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై‌ వెళ్తున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని సమాచారం. స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. యువకుడిని పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసుల ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 27, 2024

పలాస: అదుపుతప్పి గోడను ఢీకొన్న బొలెరో వాహనం

image

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం శాసనాం గ్రామ సమీప జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఓ బొలెరో లగేజీ వ్యాన్ అదుపుతప్పి వంతెన గోడకు ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

News May 27, 2024

వైవీయూ బీటెక్ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

వైవీయూ పరిధిలోని ప్రొద్దుటూరు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన బీటెక్ 4వ సంవత్సరం 2వ సెమిస్టర్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాలను వైవీయూ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి వెంకటసుబ్బయ్య, ప్రిన్సిపల్ ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి, ప్రొద్దుటూరు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నాగరాజు, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎన్.ఈశ్వర్ రెడ్డి విడుదల చేశారు.

News May 27, 2024

చిత్తూరు: మందకొడిగా సర్వీస్ ఓట్ల పోలింగ్

image

చిత్తూరు జిల్లాలో త్రివిధ దళాలకు చెందిన 3380 మంది ఉద్యోగులు సర్వీసు ఓటర్లుగా నమోదయ్యారు. అత్యధికంగా పూతలపట్టులో 1075, అత్యల్పంగా నగరిలో 139 ఓట్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం(ETPBS) ద్వారా వీరంతా ఓటు వేసేలా అవకాశం కల్పించారు. ఈక్రమంలో ఇప్పటి వరకు 800 మంది ఓటు వేశారు. కౌంటింగ్ జరిగే జూన్ 4వ తేదీ ఉదయం 7 గంటలలోగా మిగిలిన వాళ్లు ఓటు వేయవచ్చు.

News May 27, 2024

కాకినాడ: ఇళ్లల్లోకి దూసుకొచ్చిన కెరటాలు

image

కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్రతీరంలో 3 రోజులుగా సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్‌ వరకు అలలు దూసుకొస్తున్నాయి. సూరాడ పేట, మాయాపట్నంలో గతంలో వేసిన జియో ట్యూబ్‌ గట్టు పూర్తిగా ధ్వంసం కావడంతో సముద్రపు నీరు ఇళ్లలోకి చొచ్చుకు వచ్చింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

News May 27, 2024

విజయనగరం: కౌంటింగ్‌లో మైక్రో అబ్జ‌ర్వ‌ర్ల పాత్ర కీల‌కం

image

ఓట్ల‌ను లెక్కించే ప్ర‌క్రియ‌లో సూక్ష్మ ప‌రిశీల‌కుల పాత్ర అత్యంత కీల‌క‌మ‌ని జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ కె.కార్తీక్ అన్నారు. కౌంటింగ్‌లో పాల్గొనే మైక్రో అబ్జ‌ర్వ‌ర్ల‌కు క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో సోమ‌వారం శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ మైక్రో అబ్జ‌ర్వ‌ర్ల విధులు, బాధ్య‌త‌ల‌ను గురించి వివ‌రించారు.

News May 27, 2024

కర్నూలు: పోక్సో కేసులో జీవిత ఖైదు

image

కర్నూలు పొక్సో కేసుల స్పెషల్ కోర్టు ఒకరికి జీవత ఖైదు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించింది. హోళగుంద పోలీసు స్టేషన్ పరిధిలో 2021 సంవత్సరంలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన రంగమునికి జీవిత ఖైదుతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ పోక్సో కేసుల స్పెషల్ కోర్టు జడ్జి వి.భూపాల్ రెడ్డి తీర్పునిచ్చారు. దర్యాప్తు అధికారులను ఎస్పీ అభినందించారు.

News May 27, 2024

ప.గో.: నేటి నుంచి డెమో రైళ్ల పునరుద్ధరణ

image

రైల్వే ట్రాక్, ఇతర నిర్వహణ పనులు కారణంగా జిల్లాలో 10 రోజులుగా రద్దయిన డెమో రైళ్లు సోమవారం నుంచి పట్టాలెక్కనున్నాయి. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, నిడదవోలు నుంచి నడిచే అన్ని రైళ్లు గతంలో మాదిరిగా షెడ్యూల్ ప్రకారం నడవనున్నాయి. అలాగే భీమవరం, నరసాపురం నుంచి నడిచే డెమో రైళ్లు కూడా గతంలో నడిచిన విధంగానే షెడ్యూల్ సమయాలకు బయలుదేరనున్నాయి. 

News May 27, 2024

శ్రీసత్యసాయి: డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

image

ఉరివేసుకొని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పుట్టపర్తి రూరల్ మండలం వీరచిన్నయ్యగారిపల్లికి చెందిన వడ్డే విష్ణువర్ధన్(19) అనంతపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీకామ్ చదువుతున్నాడు. తన తండ్రి రాజేశ్ తాగుడుకు బానిస కావడంతో మనస్తాపం చెంది ఉరివేసుకున్నట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.