Andhra Pradesh

News May 27, 2024

కడప: గండికోట అందాలు అదరహో

image

కడప జిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ, ఎందరో పర్యాటకులను మనవైపు చూసేలా చేసింది మన గండికోట. చుట్టూ ఆహ్లాదకరమైన కొండలు, మూడు వైపుల పెన్నా నది లోయ, అబ్బుర పరిచే శిల్ప సంపద, రాజులు, రాజ్యాల వైభవం గండికోట సొంతం. వర్షాలు పడేకొద్దీ గండికోట అందాలు మరింత ఆకర్షణగా ఉంటాయి. ప్రస్తుతం కొద్ది వర్షపాతానికే గండికోట పరిసర ప్రాంతాలు పచ్చగా మారాయి. దీంతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

News May 27, 2024

సీతంపేటలో లోయలో పడిన ఆటో..వాహనంలో 17మంది

image

సీతంపేట మండలం కొత్తగూడ పంచాయతీ వంబరెల్లి సమీపంలో సోమవారం సంత ముగించుకొని వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఆటోలో ఉన్న 17 మందికి తీవ్ర గాయాలవ్వగా.. హుటా హుటిన సీతంపేట ఆసుపత్రికి తరలించారు. వారిలో ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

News May 27, 2024

బాడిగ జయ చరిత్ర సృష్టించారు: నటి మంచు లక్ష్మి

image

కాలిఫోర్నియాలో న్యాయమూర్తిగా నియమితులైన విజయవాడకు చెందిన బాడిగ జయకు నటి మంచు లక్ష్మీ అభినందనలు తెలిపారు. తొలి తెలుగు మహిళగా జయ హద్దులు బద్దలు కొట్టి, చరిత్ర సృష్టించారని ‘x’లో పోస్ట్ చేశారు. ఆమె తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు నటి పేర్కొన్నారు. ఇటీవల కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ జడ్జిగా జయ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.

News May 27, 2024

ఏలూరులో కలెక్టరేట్ ఉద్యోగి ఆత్మహత్య

image

ఏలూరులోని శాస్త్రీకాలనీలో విషాదం చోటుచేసుకుంది. యడ్లపల్లి వికాస్ సోమవారం ఇంట్లోనే ఉరివేసుకొని మృతి చెందాడు. వికాస్ ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి ఇటీవలే వేరే శాఖకు బదిలీ అయినట్లు సమాచారం. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వికాస్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 27, 2024

తూ.గో: ALERT.. వాటర్ టిన్స్ కొంటున్నారా..?

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో తాగునీటి ప్లాంట్లు చిన్నాపెద్దా కలిపి 3,700 వరకు ఉండగా.. ఏటా రూ.20 కోట్లకు పైనే వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. తూ.గో జిల్లాలో 8, కాకినాడ-11, కోనసీమలో 9 మాత్రమే గుర్తింపు పొందిన ప్లాంట్లు ఉన్నాయి. నియంత్రణ, నీటి నాణ్యతను పట్టించుకునే వారు లేక ప్రజారోగ్యం సమస్యల్లో పడుతోంది. 2020-24 వరకు అధికారులు 56 చోట్ల నీటి నమూనాలు సేకరించగా.. 29చోట్ల నాణ్యత, బ్రాండింగ్ లోపాలు గుర్తించారు.

News May 27, 2024

పర్చూరు: రాత్రి పడుకున్న వ్యక్తి ఉదయానికి మృతి

image

ఇంకొల్లు మసీదు కాంప్లెక్స్‌లో చికెన్ పకోడీ దుకాణంలో పనిచేస్తున్న షేక్ నాగూర్ వలి (40) సోమవారం మృతి చెందారు. నాగూర్‌వలి చికెన్ దుకాణంలో పనిచేస్తూ షాపులోనే ఉంటున్నాడు. రోజు లాగానే యాజమాన్యం వచ్చి చూసేసరికి బల్లపై పడుకున్న వ్యక్తి కింద పడి ఉన్నాడు. దీంతో యాజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఇంకొల్లు ఎస్సై మల్లికార్జునరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.

News May 27, 2024

విజయనగరం జిల్లాలో హత్య..? 

image

శృంగవరపుకోట మండలం ఒద్దుమరుపల్లిలో వివాహిత దారప్ప(కల్యాణి)ని భర్త కనకారావు హత్య చేసినట్లు సమాచారం. ఉద్దేశ పూర్వకంగా చంపినట్లు తెలుస్తోంది. చంపి ఊరికి దూరంగా తుప్పల్లో మృతదేహాన్ని పడేసినట్లు స్థానికులు గుర్తించారు. వీరికి వివాహం జరిగి నాలుగు సంవత్సరాలు అయిందని, వీరికి ఒక బాబు కూడా ఉన్నట్లు సమాచారం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

News May 27, 2024

అనంత ఎస్పీగా గౌతమి శాలి ఎంట్రీ.. రాజకీయ నేతల్లో వణుకు

image

ఎన్నికల పోలింగ్ తర్వాత ఉమ్మడి అనంత జిల్లాలో, ముఖ్యంగా తాడిపత్రిలో పెద్దఎత్తున గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి SPని మార్చి కొత్తగా గౌతమి శాలిని SPగా ఎన్నికల కమిషన్ నియమించింది. మేడమ్ అనంతలో అడుగుపెట్టగానే సీన్ మొత్తం మారిపోతోంది. గొడవలకు దిగేందుకు రాజకీయ నేతలు, రౌడీ షీటర్లు భయపడుతున్నారు. వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు ఆయా పార్టీలకు వత్తాసు పలికిన అధికారులపై చర్యలకు పూనుకున్నారు.

News May 27, 2024

అల్లర్లకు పాల్పడే వారిని గుర్తించేందుకు డ్రోన్లు: బాపట్ల ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కచ్చితమైన ప్రణాళికలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అల్లర్లకు పాల్పడే వారిని గుర్తించేందుకు డ్రోన్లను ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటాయని ఆయన అన్నారు.

News May 27, 2024

యెర్నేని సీతాదేవి మృతి పట్ల చంద్రబాబు సంతాపం

image

కలిదిండి మండలం కొండూరుకు చెందిన మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా సీతాదేవి తనదైన ముద్ర వేశారని ఆయన కొనియాడారు. సీతాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.