Andhra Pradesh

News May 27, 2024

విశాఖలో 1201వ రోజు దీక్ష

image

కేంద్రం దిగివచ్చే వరకు పోరాటం ఆగదని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధి వరసాల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 1201 రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామన్నారు.

News May 27, 2024

బి.కొత్తకోటలో స్కూటర్ ఢీకొని రైతు దుర్మరణం

image

బి కొత్తకోట మండలంలో స్కూటర్ ఢీకొని రైతు దుర్మరణం చెందినట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు. అర్ధరాత్రి సమయంలో బి.కొత్తకోటలోని బెంగళూరు రోడ్డు, పెట్రోల్ బంక్ సమీపంలోని అయ్యవారి పల్లె క్రాస్ వద్ద దాస్ అలియాస్ శ్రీరాములు అనే రైతును స్కూటర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రైతు శ్రీరాములు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందినట్టు చెప్పారు. మృతదేహాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News May 27, 2024

ప్రకాశం జిల్లాలో సర్వీసు ఓట్లు 6,890

image

జిల్లాలో సైనిక దళాల్లో పనిచేసే వారు 6,677 మంది ఉండగా, వారి కుటుంబ సభ్యులు 173 మందికి కూడా ఓటు హక్కు ఉంది. ఇప్పటికే వారందరికీ పోస్టల్ బ్యాలెట్లను తపాలా శాఖ ద్వారా పంపారు. వారు ఓటేసి తిరిగి పోస్టల్ ద్వారా ఆయా నియోజకవర్గ కేంద్రాలకు, లేదా ఎన్నికల అధికారైన జిల్లా కలెక్టర్ అడ్రసుకు పంపాలి. జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రానికి 1477 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు సమయానికి వస్తేనే పరిగణనలోకి తీసుకుంటారు.

News May 27, 2024

అంతర్జాతీయ స్థాయిలో సిక్కోలు చిన్నోడి రికార్డ్

image

ఇచ్ఛాపురానికి చెందిన ఏడేళ్ల పార్థివ్ శ్రీవత్సల్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో రెండు సార్లు స్థానం సాధించారు. తండ్రి అప్పలనాయుడు గణిత టీచర్‌గా పని చేస్తుండగా..తల్లి ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడో తరగతికే టెన్త్ స్థాయి లెక్కల్లో ప్రావీణ్యం చూపుతున్నాడు. రెండు నిమిషాల్లో 197 జాతీయ జెండాలను గుర్తించడంతో పాటు ఈ బాలుడు 1నిమిషంలో క్యూబ్ చేయగలడు.

News May 27, 2024

ఉదయగిరి దుర్గంపై గుర్తు తెలియని వ్యక్తుల సంచారం

image

ఉదయగిరి దుర్గం పై గత కొన్ని రోజుల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వీరు సాధు వస్త్రాలు ధరించి గుప్తనిధుల కోసం పూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇక్కడ గుప్త నిధులు కోసం వచ్చి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగానే అధికారులు నిఘా ఉంచాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.

News May 27, 2024

టెక్కలి: జాతీయ రహదారిపై అంబులెన్స్ బోల్తా

image

టెక్కలి సమీప జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ అంబులెన్స్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చిన్నపాటి గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ నుంచి ఝార్ఖండ్ ఓ వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో అంబులెన్స్ ను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

News May 27, 2024

గూగుల్‌కు వాయిస్ ఇచ్చింది మన కర్నూలు అమ్మాయే..!

image

గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో వచ్చే వాయిస్ కర్నూలు జిల్లా అమ్మాయి గ్రీష్మదే. చెన్నైలోని ఓ కళాశాలలో బీటెక్ చదివిన గ్రీష్మకు తన ఫ్రెండ్ ద్వారా వాయిస్ ఓవర్ రంగం గురించి తెలిసింది. తల్లి శశిదేవి డిప్యూటీ కలెక్టర్‌గా.. తండ్రి జేసీ నాథ్ ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ పొందారు. గ్రీష్మ వాయిస్ ఓవర్‌లో ప్రైవేటు, ప్రభుత్వ ప్రాజెక్టులకు పనిచేసింది. అంతేకాదు AXIS, HDFC బ్యాంకుల కస్టమర్లకు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చింది.

News May 27, 2024

అజ్జమూరులో లారీ ఢీకొని మహిళ మృతి

image

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమూరులోని అజ్జాలమ్మ గుడి సమీప మలుపులో సోమవారం లారీ ఢీకొని పీతల నందమ్మ(75) మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నందమ్మ మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

News May 27, 2024

తూ.గో: NOTA, చెల్లని పోస్టల్ ఓట్లపై అభ్యర్థుల్లో టెన్షన్

image

చెల్లని పోస్టల్ బ్యాలెట్, నోటా ఓట్లపై ఉమ్మడి తూ.గో జిల్లాలోని ప్రధాన అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వారిలో టెన్షన్ పెరుగుతోంది. కాకినాడ జిల్లాలో చూస్తే 2019లో నోటా, చెల్లని పోస్టల్ ఓట్ల వివరాలు వరుసగా ఇలా..
☞ పిఠాపురం-2339, 271
☞ కాకినాడ సిటీ-1654, 15
☞ కాకినాడ గ్రామీణ-1575, 868
☞ తుని-2586, 178
☞ ప్రత్తిపాడు-2079, 117
☞ పెద్దాపురం-2072, 206
☞ జగ్గంపేట-3016, 163

News May 27, 2024

ప్రకాశం: పది మార్కుల మెమోల్లో తప్పుల సవరణకు అవకాశం

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షల మార్కుల మెమోల్లో దొర్లిన పొరపాట్లను సవరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మార్కుల మెమోల్లోని తప్పులు, పొరపాట్లపై విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని డీఈవో సుభద్ర చెప్పారు. తప్పుల సవరణకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలోని మాణిక్యాంబ 9919510766 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.