Andhra Pradesh

News May 27, 2024

విజయనగరం: 290 మందికి ఈ-చలానాలు

image

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఎం దీపిక పాటిల్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, సిబ్బంది గడచిన 24 గంటల్లో విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. మోటార్ వెహికల్ నిబంధనలు అతిక్రమించిన 290 మందికి రూ.75,980 ఈ-చలానాలను విధించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 23 కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై నమోదు చేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం తెలిపింది.

News May 27, 2024

విజయనగరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

బొండపల్లి మండలంలోని అంబటివలస-గొట్లాం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను ఢీకొని విజయనగరం మండలం గుంకలాంకి చెందిన తాడ్డి తాతబాబు (35) మృతి చెందినట్లు బొండపల్లి ఎస్.ఐ కె.లక్ష్మణరావు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న తాతబాబు విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ప్రమాదానికి గురైనట్లు చెప్పారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేశామన్నారు.

News May 27, 2024

నెల్లూరు: విద్యుత్ అక్రమ వినియోగంపై మూడు లక్షల జరిమానా

image

నెల్లూరు రూరల్, కోవూరు డివిజన్ లలో డి.పి.ఈ. విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో అక్రమ విద్యుత్ వినియోగంపై తనిఖీలు నిర్వహించారు. ఆదివారం రొయ్యల గుంటలకు అక్రమ విద్యుత్ వాడుతున్న వారిపై రాత్రి దాడులు నిర్వహించారు. రైడ్స్ లో విద్యుత్ డి.పి.ఈ. విభాగం, ఏ.పి.టి.ఎస్.సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వారి సిబ్బంది పాల్గొన్నారు. సుమారు మూడు లక్షల వరకు జరిమానా విధించారు.

News May 27, 2024

కాకినాడ: YCP ప్రచారంలో ఉద్యోగులు.. ఇద్దరు సస్పెండ్

image

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు పాల్పడిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశామని జగ్గంపేట ఎంపీడీవో వసంత్ కుమార్ తెలిపారు. జగ్గంపేట ఫీల్డ్ అసిస్టెంట్ గొల్లపల్లి రత్నరాజు, సీనియర్ మేట్ రెడ్డి భానుప్రతాప్ ఎన్నికల కోడ్ అతిక్రమించి వైసీపీ నేతల ప్రచారంలో పాల్గొన్నట్లు ఆర్వోకు  ఫిర్యాదు వచ్చిందన్నారు. దీనిపై డ్వామా అధికారులకు నివేదిక పంపించగా.. ఆ ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.

News May 27, 2024

శ్రీకాకుళం: జూన్ 10 నుంచి పాలిటెక్నిక్ తరగతుల ప్రారంభం

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 2,591 సీట్లు ఉన్నాయి. మే 27వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు సర్టిఫికెట్లు పరిశీలించనున్నారు. జూన్ 5వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలి. జూన్ 7న సీట్ల కేటాయింపులు వివరాలను పాలిసెట్ కన్వీనర్ ప్రకటిస్తారు. జూన్ 10వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

News May 27, 2024

ప.గో: ALERT.. మామిడి పండ్లు తింటున్నారా..?

image

పండ్ల రారాజైన ‘మామిడి’కి ఈ ఏడాది మంచి డిమాండ్ ఉండటంతో ఉమ్మడి ప.గో జిల్లాలో దళారులు అక్రమ మార్గాలకు తెరదీస్తున్నారు. కార్బైడ్, ఇథిలిన్ వంటి రసాయనాలతో కాయలను మగ్గబెడుతున్నారు. ఇలాంటి ఆరోపణలున్నా అధికారులు దాడులు చేసిన దాఖలాలు లేవు. కెమికల్స్‌తో మగ్గబెట్టిన పండ్లు తింటే క్యాన్సర్, అల్సర్, కాలేయ వ్యాధుల బారిన పడే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు నీటితో పండ్లు కడితే మేలని సూచిస్తున్నారు.

News May 27, 2024

మచిలీపట్నం: జనసేన నేత కారు దగ్ధం కేసులో దర్యాప్తు వేగవంతం

image

మచిలీపట్నానికి చెందిన జనసేన నేత కర్రి మహేశ్ కారు దగ్ధం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ అబ్దుల్ సుభాన్ బాధితుడి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం ఘటనాస్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాదవశాత్తు కారు దగ్ధమైందా.? లేక రాజకీయ ప్రేరేపితం ఉందా.? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News May 27, 2024

ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ కన్నుమూత

image

స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ(64) హైదరాబాద్ లో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. తెలుగు రాష్ట్రాలకు తొలి ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో ముద్ర వేసుకున్న ప్రకాశం పంతులుకు ఇరువురు కుమారులు. వారిలో హనుమంతరావు ఒకరు కాగా.. హనుమంతరావు కుమారుడు గోపాలకృష్ణ సోమవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. ప్రకాశం పంతులు కుటుంబంలో దీనితో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News May 27, 2024

విశాఖ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్టు

image

నిరుద్యోగులను కంబోడియాకు తరలిస్తున్న మరో ఇద్దరు ఏజెంట్లను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు నిర్వహించగా గాజువాకకు చెందిన ఏజెంట్ కె.వీరేంద్రనాథ్ 17 మందిని కాంబోడియాకు పంపించినట్లు గుర్తించారు. వీరేంద్రనాథ్‌తో పాటు మరో ఏజెంట్ కె.ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

News May 27, 2024

ప్రకృతి సంరక్షణతోనే సుఖమయ జీవితం: రామ్, లక్ష్మణ్

image

మనం ప్రకృతిని సంరక్షించుకుంటే సంతోషకరమైన జీవితం పొంద వచ్చని సినీ ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ తెలిపారు. ఆదివారం నార్పలకు వచ్చిన వారు.. ద్యానమందిర కేంద్రంలో ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ప్రతి ఒక్కరూ పొలం గట్లు, ఇళ్ల ముందు, రహదారులకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పక్షులకు, మూగజీవాలకు ఆహారంతో పాటు నీరు అందించాలన్నారు.