Andhra Pradesh

News May 27, 2024

కర్నూలు: మూడు మండలాల్లో తేలికపాటి వర్షం

image

కర్నూలు జిల్లాలో మూడు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు గోనెగండ్ల మండలంలో 2.8 మి.మీ. నమోదైంది. ఆదోని 2.0, సి.బెళగల్లో అత్యల్పంగా 0.4 మి.మీ. కురిసింది. జిల్లాలో సగటున 0.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈనెల సాధారణ వర్షపాతం 40.1 మి.మీ. కాగా ఇప్పటి వరకు 97.2 మి.మీ. రికార్డయ్యింది. సాధారణంతో పోలిస్తే 142 శాతం అధికంగా కురిసింది. అన్నదాతలు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు.

News May 27, 2024

నెల్లూరు: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

image

చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని ఎంకొంగవారిపల్లి వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరు నుంచి వేలూరు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. మృతులు ఇందుకూరుపేటకు చెందిన వారుగా గుర్తించారు.

News May 27, 2024

‘ఆ మామిడిపళ్లు ఆరోగ్యానికి హానికరం’

image

మామిడి కాయలను కాల్షియం కార్బై‌ట్‌తో మగ్గబెట్టవద్దని ఉద్యాన శాఖ అధికారి జి.రాధిక తెలిపారు. ఈ విధంగా మగ్గపెట్టిన పండ్లను తింటే ఆరోగ్యానికి హానికరమని హెచ్చరించారు. పక్వానికి వచ్చిన మామిడికాయలను ఇథలిన్ వాయువు సహాయంతో మగ్గబెడితే కొంత ముప్పు తప్పుతుందని తెలిపారు. పక్వానికి వచ్చిన మామిడి కాయలను గాలి చొరబడకుండా ఉండే గదిలో ఉంచి మగ్గపెట్టాలన్నారు.

News May 27, 2024

అన్నమయ్య: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

చిన్నమండెం మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసింహులు అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆరిఫుల్లా రైస్ మిల్లు ఎదురుగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనంలో వెళ్తున్న నరసింహులును ఢీకొంది. ఈ ప్రమాదంలో నరసింహులు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News May 27, 2024

నెల్లూరు : హైవేపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

చిల్లకూరు: కోట అడ్డరోడ్డు ప్రాంతంలోని హైవేపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల కథనం.. సైదాపురం మండలం గిద్దలూరుకి చెందిన వేణుగోపాల్ గుప్తా(58) బైక్‌పై కోటకు వెళ్లి తిరిగి గ్రామానికి వెళ్తుండగా కోట అడ్డరోడ్డు వద్ద అదుపుతప్పి లారీని ఢీకొట్టాడు. తీవ్రగాయాలైన ఆయన్ను చికిత్స నిమిత్తం గూడూరులోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News May 27, 2024

VZM: నేటి నుంచి కౌన్సిలింగ్‌.. విద్యార్థులు ఇవి మర్చిపోవద్దు

image

ఉమ్మడి జిల్లాలో 9,890 మంది పాలీసెట్ పరీక్ష రాయగా..నేటి నుంచి కౌన్సిలింగ్‌ ప్రారంభం కానుంది. కౌన్సిలింగ్‌కు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్ల వివరాలు.
➣ ప్రాసెసింగ్ ఫీజు రశీదు
➣ పాలీసెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డు
➣ పది, తత్సమాన మార్కుల జాబితా
➣ 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్
➣ EWS కోటా అభ్యర్థులు సంబంధిత EWS సర్టిఫికేట్
➣ 1-1-2021 తర్వాత నాటి కుల,ఆదాయ సర్టిఫికేట్
➣ టీసీ
➣➣Share it

News May 27, 2024

నెల్లూరు: పాలిసెట్ కౌన్సిలింగ్ కు ఇవి తప్పనిసరి…

image

వేంకటేశ్వరపురం పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం కౌన్సిలింగ్, ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం కానుంది. అర్హులైన వారు ముందుగా కౌన్సెలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కళాశాలలో వెరిఫికేషన్, ఫీజు రసీదుతో పాటు పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, 10వ తరగతి మార్క్ లిస్ట్, 4 -10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని ప్రిన్సిపల్ రాంప్రసాద్ తెలిపారు.

News May 27, 2024

అనంత జిల్లాలో 32 డెంగీ కేసులు నమోదు

image

అనంతపురం జిల్లాలో డెంగీ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 32 డెంగీ, రెండు మలేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. పట్టణాల్లోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వెల్లడించారు. అనంతపురం, ఉరవకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుత్తి, రాప్తాడు ప్రాంతాల్లో డెంగీ బాధితులను గుర్తించామన్నారు.

News May 27, 2024

కర్నూలు: రెండు వజ్రాలు లభ్యం

image

తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరిలో ఆదివారం రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. వీటిలో ఒక వజ్రం స్థానిక వ్యాపారి రూ.లక్షకు, మరోదాన్ని పెరవలికి చెందిన వ్యాపారి రూ.7 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. తొలకరి వర్షాలు రావడంతో వజ్రాల అన్వేషణకు వివిధ ప్రాంతాల ప్రజలు జొన్నగిరి పొలాల బాట పడుతున్నారు.

News May 27, 2024

కృష్ణా: భారీగా పెరిగిన కూరగాయల ధరలు

image

ఎండల తీవ్రత నేపథ్యంలో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. నీటి లభ్యత లేని కారణంగా ఉత్పత్తి తగ్గిపోవడంతో టమాటా (కేజీ-రూ.40), వంకాయ (కేజీ- రూ.45), పచ్చిమిర్చి (కేజీ- రూ.80), బెండ (కేజీ -రూ.44), బీన్స్ (కేజీ రూ-180) ధరలు పలుకుతున్నాయి. మైలవరం, అవనిగడ్డ, నందిగామ, కంచిచర్ల, జగ్గయ్యపేట నుంచి వచ్చే టమాటా.. గుంటూరు జిల్లా నుంచి వచ్చే బెండ, దొండ, వంకాయల ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.