Andhra Pradesh

News May 27, 2024

నెల్లూరు: పాలిసెట్ కౌన్సిలింగ్ కు ఇవి తప్పనిసరి…

image

వేంకటేశ్వరపురం పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం కౌన్సిలింగ్, ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం కానుంది. అర్హులైన వారు ముందుగా కౌన్సెలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కళాశాలలో వెరిఫికేషన్, ఫీజు రసీదుతో పాటు పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, 10వ తరగతి మార్క్ లిస్ట్, 4 -10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని ప్రిన్సిపల్ రాంప్రసాద్ తెలిపారు.

News May 27, 2024

అనంత జిల్లాలో 32 డెంగీ కేసులు నమోదు

image

అనంతపురం జిల్లాలో డెంగీ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 32 డెంగీ, రెండు మలేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. పట్టణాల్లోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వెల్లడించారు. అనంతపురం, ఉరవకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుత్తి, రాప్తాడు ప్రాంతాల్లో డెంగీ బాధితులను గుర్తించామన్నారు.

News May 27, 2024

కర్నూలు: రెండు వజ్రాలు లభ్యం

image

తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరిలో ఆదివారం రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. వీటిలో ఒక వజ్రం స్థానిక వ్యాపారి రూ.లక్షకు, మరోదాన్ని పెరవలికి చెందిన వ్యాపారి రూ.7 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. తొలకరి వర్షాలు రావడంతో వజ్రాల అన్వేషణకు వివిధ ప్రాంతాల ప్రజలు జొన్నగిరి పొలాల బాట పడుతున్నారు.

News May 27, 2024

కృష్ణా: భారీగా పెరిగిన కూరగాయల ధరలు

image

ఎండల తీవ్రత నేపథ్యంలో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. నీటి లభ్యత లేని కారణంగా ఉత్పత్తి తగ్గిపోవడంతో టమాటా (కేజీ-రూ.40), వంకాయ (కేజీ- రూ.45), పచ్చిమిర్చి (కేజీ- రూ.80), బెండ (కేజీ -రూ.44), బీన్స్ (కేజీ రూ-180) ధరలు పలుకుతున్నాయి. మైలవరం, అవనిగడ్డ, నందిగామ, కంచిచర్ల, జగ్గయ్యపేట నుంచి వచ్చే టమాటా.. గుంటూరు జిల్లా నుంచి వచ్చే బెండ, దొండ, వంకాయల ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

News May 27, 2024

ప్రకాశం: తగ్గిన నిమ్మ ధరలు.. కిలో రూ.5

image

జిల్లాలో నిమ్మధరలు వారం రోజులుగా భారీగా పడిపోయాయి. కిలో రూ.60 నుంచి రూ.30లకు పడిపోయింది. దీంతో ఇతర ప్రాంతాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. కనిగిరి కమీషన్ మార్కెట్‌కు రోజుకు 10 లారీల సరకు వచ్చేది కాగా, ఇప్పుడు 2, 3 లారీలకు పరిమితమైంది. మార్కాపురం స్థానిక మార్కెట్లకు వెళ్తున్న రెండోరకం నిమ్మకు రూ.5లకు మించి లేదు. దీంతో కోతలు ఆగిపోయాయి. అకాల వర్షంతో ధరలు పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News May 27, 2024

JSP Vs YCP ‘నేమ్ ప్లేట్ల’ ట్రెండ్.. ఎవరూ తగ్గట్లేగా..!

image

ఎన్నికల ఫలితాలకు మరో వారమే ఉండగా.. పిఠాపురంలో ‘నేమ్ ప్లేట్స్’ ట్రెండ్ నడుస్తోంది. ‘పిఠాపురం MLA గారి తాలూకా’ అంటూ జనసైనికులు, పవన్ అభిమానులు నేమ్ ప్లేట్స్ చేయించినట్లు సోషల్ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ‘డిప్యూటీ CM వంగా గీత’ అంటూ ఓ కారుపై రాసి ఉన్న ఫొటోను వైసీపీ నేతలు, కార్యకర్తలు షేర్ చేస్తున్నారు. ఎవరి కాన్ఫిడెంట్‌లో వారున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News May 27, 2024

పిఠాపురంలో ‘నేమ్ ప్లేట్ల’ ట్రెండ్.. ఎవరూ తగ్గట్లేగా..!

image

ఎన్నికల ఫలితాలకు మరో వారమే ఉండగా.. పిఠాపురంలో ‘నేమ్ ప్లేట్స్’ ట్రెండ్ నడుస్తోంది. ‘పిఠాపురం MLA గారి తాలూకా’ అంటూ జనసైనికులు, పవన్ అభిమానులు నేమ్ ప్లేట్స్ చేయించినట్లు సోషల్ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ‘డిప్యూటీ CM వంగా గీత’ అంటూ ఓ కారుపై రాసి ఉన్న ఫొటోను వైసీపీ నేతలు, కార్యకర్తలు షేర్ చేస్తున్నారు. ఎవరి కాన్ఫిడెంట్‌లో వారున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News May 27, 2024

కొత్తపల్లి మండల వాసికి డాక్టరేట్

image

కొత్తపల్లి మండలంలోని పెద్దగుమ్మడాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని మజార గ్రామమైన సింగరాజుపల్లి వాసికి శనివారం డాక్టరేట్ ప్రదానం చేశారు. గ్రామానికి చెందిన నక్క సత్యాలు, యేసురత్న దంపతుల కుమారుడు ప్రవీణ్ కుమార్ విజయవాడలోని వీఐటీ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. పరిశోధనకు గాను యూనివర్సిటీ అధికారులు ప్రవీణ్ కుమార్‌కు డాక్టరేట్ ప్రదానం చేశారు. దీంతో పలువురు అభినందించారు.

News May 27, 2024

ముద్దనూరు: భార్యపై అనుమానం.. భర్త సూసైడ్

image

ముద్దనూరు మండలంలోని ఉప్పలూరు గ్రామంలో ఓబులేసు (41) అనే వ్యక్తి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ ఆంజనేయులు సమాచారం మేరకు.. ఓబులేసుకు 20 ఏళ్ల కిందట ఉప్పలూరుకు చెందిన కేశమ్మతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కొంతకాలంగా భార్య కేశమ్మ ప్రవర్తనపై అనుమానం పెంచుకుని మనస్థాపానికి గురయ్యాడు. ఈక్రమంలో ఓబులేసు శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇనుప పైపునకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News May 27, 2024

ఎన్నికల్లో అల్లర్లు చేసిన వారిపై రౌడీ షీట్

image

అనంతపురం జిల్లాలో ఎన్నికల పోలింగ్ రోజు జరిగిన ఘటనలను ఎస్పీ గౌతమి శాలి సీరియస్‌గా పరిగణించారు. అల్లర్లకు పాల్పడిన వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయించారు. తాడిపత్రిలో 106 మంది, యాడికిలో 37 మంది, పెద్దవడుగూరులో ఏడుగురు, ఇతర ప్రాంతాల్లో 9 మంది కలిపి మొత్తం 159 మందిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు తెలిపారు. అల్లర్లు, గొడవలు, ఘర్షణలకు దిగేవారికి ఇది పెద్ద గుణపాఠం అని హెచ్చరించారు.