Andhra Pradesh

News September 24, 2024

రామతీర్థంలో అక్టోబర్ 3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. 3న విష్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో ఉత్సవాలు ప్రారంభమౌతాయి. 9వ తేదీన స్వామి వారి కళ్యాణం, 12వ తేదీన పూర్ణాహుతి, చక్రస్నానం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. 13న వెంకటేశ్వర స్వామి వారి పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ శ్రీనివాసరావు తెలిపారు.

News September 24, 2024

విజయవాడ: నటి జెత్వానీ కేసులో సాక్షులు ఎందరంటే.?

image

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో 9మందిని పోలీసులు సాక్షులుగా చేర్చారు. కాదంబరి జెత్వానీ, ఆమె తల్లి ఆశా, తండ్రి నరేంద్ర కుమార్‌తో పాటు పలువురిని ఆ లిస్టులో చేర్చి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. మరోవైపు, నిందితుడు విద్యాసాగర్‌ను నిన్న ఉదయం విజయవాడ జిల్లా జైలుకు తరలించి, కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడి న్యాయవాది కౌంటర్ దాఖలు చేయడం కోసం కేసును జడ్జి నేటికి వాయిదా వేశారు.

News September 24, 2024

ధర్మవరం ఘటనపై కేసు నమోదు

image

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో సోమవారం జరిగిన ఘటనపై కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో పాటు జడ్పీ వైస్ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, డ్రైవర్ రామాంజనేయులు, అంజి, రఫీ, విజయ్, రంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి చిగిచెర్ల తమపై దాడికి పాల్పడ్డారంటూ బీజేపీ కార్యకర్త ప్రతాప్ రెడ్డి ధర్మవరం వన్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 24, 2024

శ్రీకాకుళం జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

image

అల్పపీడనం ప్రభావంతో సోమవారం జిల్లాలో పలు మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. టెక్కలి 29.0మి.మీ ,కోటబొమ్మాళి 30.2 ,నందిగం 24.0 , సంతబొమ్మాళి 23.0 , పలాస 40.0 , కవిటి 25.25 , ఇచ్ఛాపురం 29.5, ఆమదాలవలస12.75, బూర్జ27.5, రణస్థలం29.75, పైడిభీమవరం24.75, లావేరు18.5, నరసన్నపేట10.75, పాతపట్నం10.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

News September 24, 2024

నకరికల్లు: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కీలం రామయ్య 41 అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున అద్దంకి-నార్కెట్ పల్లి రాష్ట్ర రహదారిపై చోటు చేసుకుంది. తెల్లవారుజామున మూడున్నర గంటలకు పోలీస్ పెట్రోలింగ్ వాహనం తిరుగుతున్న సమయంలో మృతదేహాన్ని గమనించారు. కాగా మృతుడు పిడుగురాళ్లలోని సున్నం మిల్లులో పనిచేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 24, 2024

చిత్తూరు: 119 రోడ్డు ప్రమాదాల్లో 64మంది మృతి

image

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. చిత్తూరు కలెక్టరేట్లో ఎస్పీ మణికంఠ డిటిసి నిరంజన్ రెడ్డితో కలిసి రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబర్ 20 వరకు జరిగిన 119 రోడ్డు ప్రమాదాలలో 64 మంది మరణించగా, 211 మంది గాయాలపాలయ్యారని తెలిపారు. ప్రమాదాల నివారణకు సమిష్టిగా పనిచేయాలని కోరారు.

News September 24, 2024

విజయనగరం జడ్పీ ఉన్నతాధికారులకు బదిలీలు

image

జిల్లా పరిషత్ లో పలువురు అధికారులకు బదిలీ అయ్యింది. జడ్పీ ఇన్ఛార్జి సీఈవోగా పనిచేస్తున్న శ్రీధర్ రాజా శ్రీకాకుళం జడ్పీ సీఈవోగా వెళ్లనున్నారు. ఆ స్థానంలో డ్వామా ఏవో సత్యనారాయణ రానున్నారు. డీపీవోగా శ్రీకాకుళం డీపీవో వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. జడ్పీ డిప్యూటీ సీఈవో రాజ్ కుమార్‌కు విశాఖ జడ్పీ డిప్యూటీ సీఈవోగా బదిలీ అయ్యింది. ఆయన స్థానంలో శ్రీకాకుళం జడ్పీ డిప్యూటీ సీఈవో రమేష్ రామన్ రానున్నారు.

News September 24, 2024

మనుబోలు: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

image

మనుబోలు మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డుపై ఓ ట్రావెల్ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం విజయవాడ నుంచి చెన్నైకి 18 మంది ప్రయాణికులతో వెళ్తుండగా.. యాచవరం రోడ్డు దాటాక బస్సు టైరు పగిలిపోయింది.దీంతో బస్సు అదుపుతప్పి మరో వైపు వెళ్లిపోయింది. ఆసమయంలో వేరే వాహనాలు ఉండకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు అన్నారు. బస్సును క్రేన్ సాయంతో పక్కకు తొలగించినట్లు బస్సు సిబ్బంది తెలిపారు.

News September 24, 2024

బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి: విశాఖ రేంజ్ డీఐజీ

image

దీపావళి పండుగకు బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి అని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాధ్ జట్టి శ్రీకాకుళం జిల్లా ఎస్పీకి సూచిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు సోమవారం విశాఖ రేంజ్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో బాణాసంచా నిల్వలు, తయారీ, విక్రయాలు తదితర వాటిపై నిఘా ఉంచాలన్నారు.

News September 24, 2024

ప్రకాశం: ‘మేము వైసీపీలోనే ఉంటాం’

image

ప్రకాశం జిల్లాలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సోమవారం కొత్తపట్నం మండల వైసీపీ నాయకులు పలువురు స్థానికంగా సమావేశమయ్యారు. ‘మేము వైసీపీ కార్యకర్తలం, ఈ పార్టీలోనే ఉంటాం, జనసేనలో చేరేదే లేదు’ అని తీర్మానం చేసినట్లు సమాచారం. తిరిగి 2029 జగన్‌ను సీఎం చేసుకోవడమే తమ లక్ష్యమని ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి ఈ సందర్భంగా చెప్పినట్లు తెలుస్తోంది.