Andhra Pradesh

News May 27, 2024

స్ట్రాంగ్ రూములు పరిశీలించిన నంద్యాల కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు ఆదివారం పరిశీలించారు. ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి భ‌ద్ర‌తాప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను ప‌రిశీలించారు. సీసీ కెమెరాల ప‌నితీరు, మానిట‌రింగ్ రూమ్ ద్వారా ప‌ర్య‌వేక్ష‌ణ గురించి అక్క‌డ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

News May 27, 2024

ఈనెల 28న మైక్రో అబ్జర్వర్స్‌కు శిక్షణ: కలెక్టర్

image

కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, విధుల్లో పాల్గొనే వివిధ అధికారులతో కలెక్టర్ మనజీర్ జీలాని సమూన్, జేసీ మల్లారపు నవీన్ ఆదివారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వివిధ శాఖల సిబ్బందితో కౌంటింగ్ ఏర్పాట్లు పై వివరించారు. ఈ నెల 28న మైక్రో అబ్జర్వర్స్‌కు శిక్షణ ఉంటుందని, 29న ఈవీఎం కౌంటింగ్ అసిస్టెంట్లకు, సూపర్వైజర్లకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

News May 27, 2024

ఎన్డీఏ కూటమి అభ్యర్థులతో సమీక్షించిన అశోక్ గజపతిరాజు

image

జూన్ 4న జరగనున్న ఓట్లు లెక్కింపు ప్రక్రియ కోసం తీసుకోవాల్సిన చర్యలు గూర్చి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు జిల్లాలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థులతో కలిసి ఆదివారం సాయంత్రం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమర్థులైన కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకొని ఓట్లు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

News May 27, 2024

రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలలో అనంతపురం జిల్లాకు తృతీయ స్థానం

image

అనంతపురం జిల్లా బాస్కెట్ బాల్ బాలురు, బాలికల జట్లు విజయవాడలో ఈనెల 21 నుంచి 24 వరకు జరిగిన 7వ రాష్ట్రస్థాయి యూత్ బాస్కెట్ బాల్ పోటీలలో తృతీయ స్థానం సాధించారు. ఈ పోటీలలో బాలురు విభాగంలో అనంతపురం జట్టు.. విశాఖపట్నం జట్టుతో, బాలికల విభాగంలో అనంతపురం జట్టు.. పశ్చిమగోదావరి జిల్లా జట్టుతో కలిసి సంయుక్తంగా తృతీయ స్థానంలో విజేతలుగా నిలిచారు. అనంతపురం జిల్లా జట్టు సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.

News May 27, 2024

విద్యా క్యాలెండర్ ప్రకారమే ఆటల పోటీలు: సంధ్య

image

విద్యా సంవత్సర క్యాలెండర్ ప్రకారం నిర్దేశించిన ప్రాంతాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తామని టార్గెట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య తెలిపారు. రాయచోటిలోని పీసీ ఆర్ గ్రాండ్‌లో టార్గెట్ బాల్ అసోసియేషన్ మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాబోవు విద్యా సంవత్సరంలో సీనియర్స్ విభాగం టోర్నీ కృష్ణా, జూనియర్ విభాగం అనంతపూర్‌లో, సబ్ జూనియర్ పోటీలు నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించారు.

News May 27, 2024

ప్రకాశం జిల్లాలో సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు

image

జిల్లా రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో సాధారణ విస్తీర్ణం 2.14 లక్షల హెక్టార్లు కాగా.. వర్షాలు ఆశించిన స్థాయిలో పడితే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉంటాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులకు అవసరమైన 40వేల క్వింటాళ్ల వరి విత్తనాలు, 1,500 క్వింటాళ్ల కందులు, 5వేల క్వింటాళ్ల మినుములు, 1,200 క్వింటాళ్ల పెసలు ఆర్బీకేల్లో రైతులకు అందబాటులో ఉంచారు.

News May 27, 2024

స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్

image

ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం హరి నారాయణన్ పరిశీలించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రోజువారీ తనిఖీల్లో భాగంగా ఆదివారం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. కలెక్టర్ వెంట రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

News May 27, 2024

నేడు ఉమ్మడి తూ.గో.లో వడగాల్పులు

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 25 మండలాల్లో సోమవారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తూర్పుగోదావరి జిల్లాలోని 17 మండలాలు, కాకినాడ జిల్లాలోని 6 మండలాలు, డాక్టర్.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 2 మండలాల్లో తీవ్ర వడ గాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలన్నారు.
– SHARE IT

News May 27, 2024

ప.గో.: ఏఈఓల సంఘ ఉమ్మడి జిల్లాధ్యక్షుడిగా రాంబాబు

image

తాడేపల్లిగూడెం పట్టణంలోని వ్యవసాయ పరీక్ష కేంద్రంలో ఆదివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నెక్కంటి రాంబాబు, MDR.శివప్రసాద్ ఎన్నికయ్యారు. వీరితో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు వేణుమాధవరావు, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.

News May 27, 2024

కౌంటింగ్ సిబ్బంది మొబైల్ ఫోన్లు తీసుకురావద్దు: కలెక్టర్

image

కౌంటింగ్ రోజున రాయలసీమ యూనివర్సిటీలోకి సాధ్యమైనంత వరకు కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది మొబైల్ ఫోన్లు తీసుకొని రావద్దని జిల్లా కలెక్టర్ జి. సృజన పేర్కొన్నారు. ఆదివారం కర్నూల్ నగరంలోని రాయలసీమ యూనివర్సిటీ కేంద్రంలో పార్కింగ్, మొబైల్ డిపాజిట్ సెంటర్, ఫుడ్ కౌంటర్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.