Andhra Pradesh

News May 27, 2024

మాచర్ల: ‘రెచ్చిపోతున్న వైసీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలి’

image

పట్టణంలో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్న పోలీసులు చర్యలు తీసుకోకపోవటం బాధాకరమని టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. టీడీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పాశవికంగా కత్తులతో స్వైర్య విహారం చేయడం పట్ల వారు ఆవేదన వెలిబుచ్చారు. తురక కిషోర్ ప్రధాన అనుచరుడిగా ఉన్న వెంకటేశ్ సుమారు 10కేసుల్లో నిందితుడిగా ఉన్నప్పటికీ పోలీసులు అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. 

News May 27, 2024

విజయవాడలో 27న రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు

image

ఎన్టీఆర్ జిల్లా చదరంగం అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో మే 27, 28న జరగబోయే రాష్ట్రస్థాయి సీనియర్, పురుషుల మహిళల ఓపెన్ చదరంగం పోటీలకు సర్వం సిద్ధమని జిల్లా కార్యదర్శి మందుల రాజీవ్ ఆదివారం తెలిపారు. రాజీవ్ మాట్లాడుతూ.. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో పాటు నగదు బహుమతి కూడా ఉందన్నారు.

News May 26, 2024

విజయవాడ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది వీరే

image

విజయవాడ నగరంలో రాజీవ్ గాంధీ పార్క్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని ఇద్దరు సంఘటన స్థలంలోని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై కృష్ణలంక సీఐ మురళీకృష్ణ స్పందించారు. మృతులు మంగళగిరికి చెందిన మునీర్ బాషా, జరీనా గా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించినట్లు తెలిపారు.

News May 26, 2024

విజయవాడలో విషాదం.. యువతి, యువకుడి మృతి

image

విజయవాడలో ఆదివారం రాత్రి భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని రాజీవ్ గాంధీ పార్క్ వద్ద యువతీ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. విజయవాడ శివారు ఎనికేపాడుకు చెందిన ఇద్దరు స్కూల్ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న కృష్ణలంక సీఐ మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని మృతులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News May 26, 2024

ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడికి గాయాలు

image

మండల కేంద్రం కణేకల్లులో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. పట్టణంలోని దిగువ గేరి వద్ద ఉరవకొండ నుంచి కణేకల్లుకు వెళ్తన్న ఆర్టీసీ బస్సు యశ్వంత్ అనే బాలుడిని ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బాలుడి కాలి పాద భాగం నుజ్జునుజ్జయ్యింది. గాయపడ్డ బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారి ఆస్పత్రికి తరలించారు.

News May 26, 2024

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పనిచేయని కెమెరాలు

image

నంద్యాల జిల్లా కేంద్రంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పాణ్యం, నంద్యాల, డోన్ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని టీడీపీ ఎంపీ అభ్యర్థి శబరి కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో కలెక్టర్ పరిశీలిస్తామని చెప్పినట్లు వెల్లడించారు.

News May 26, 2024

హైదరాబాద్ లాడ్జిలో రాయచోటి ఉపాధ్యాయుడి మృతి

image

హైదరాబాద్‌లో రాయచోటి ఉపాధ్యాయుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. మియాపూర్ ఓయో లాడ్జిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి రాయచోటిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జయప్రకాశ్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News May 26, 2024

వడమాలపేట: రోడ్డు ప్రమాదంలో మహిళ స్పాట్ డెడ్

image

వడమాలపేట మండల పరిధిలోని పాదిరేడు బైపాస్ రోడ్డు వద్ద బైక్ ను కంటైనర్ ఢీకొనడంతో తమిళనాడుకు చెందిన ప్రజ్ఞ అనే మహిళ(35) అక్కడికక్కడే మృతి చెందింది. శనివారం తిరుమలకు వెంకటేశ్వర స్వామి దర్శనార్థం పొన్నేరికి చెందిన విజయకాంత్, ప్రజ్ఞ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి వెళ్తుండగా పాదిరేడు బైపాస్ వద్ద వెనుక వస్తున్న కంటైనర్ ఢీకొంది .మృతదేహాన్ని పుత్తూరు ఆసుపత్రికి తరలించారు.

News May 26, 2024

రాయలసీమ గురించి తప్పుగా మాట్లాడితే తాటతీస్తాం: సీమ కృష్ణ రాథోడ్

image

రాయలసీమ సంప్రదాయాన్ని, విలువలను తప్పుగా చిత్రీకరిస్తూ మాట్లాడే వ్యక్తుల తాట తీస్తామని రాయలసీమ ఉద్యమ నాయకులు సీమ కృష్ణ రాథోడ్ హెచ్చరించారు. తెలంగాణలో రాయలసీమ ఫ్యాక్షనిజం నడుస్తోందంటూ టీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ మాట్లాడటం పట్ల ఆయన స్పందించారు. రాయలసీమను తక్కువ చేసి మాట్లాడటం ఇతర ప్రాంతాల వారికి అలవాటుగా మారిందన్నారు. దీన్ని ఇలాగే కొనసాగిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు.

News May 26, 2024

ప.గో.: పెన్సిల్‌పై ‘గెట్ రెడీ SRH’ 

image

IPL-2024 ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం విజయం సాధించాలని ఓ కళాకారుడు పెన్సిల్‌పై ఆంగ్లంలో గెట్ రెడీ SRH అంటూ చెక్కారు. ప.గో. జిల్లా నరసాపురం పట్టణంలోని రుస్తుంబాదకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కొప్పినీడి విజయ్ SRH విజయాన్ని కాంక్షిస్తూ ఈ కళాఖండాన్ని ఆవిష్కరించారు. కాగా ఆయన లిఖితపూడి సచివాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్నారు.